తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

చికెన్​, మటన్​తోనే కాదు మొక్కజొన్నలతోనూ "పులావ్​" చేసుకోవచ్చు!- టేస్ట్​ అద్దిరిపోతుంది! - HOW TO MAKE CORN PULAO AT HOME

-మొక్కజొన్నలతో సూప్​, పకోడి, సమోసా ఇవే కాదు పులావ్​ కూడా అద్దిరిపోతుంది -లంచ్​బాక్స్​లో పెడితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు

How to Make Corn Pulao at Home
How to Make Corn Pulao at Home (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : 20 hours ago

How to Make Corn Pulao at Home:పులావ్.. చాలా మంది ఫేవరెట్​ డిష్​. అందుకే వీలు కుదిరినప్పుడల్లా రకరకాలుగా చేసుకుంటుంటారు. కూరగాయలతోపాటు మటన్, చికెన్, ఫిష్​ లాంటి నాన్ వెజ్​లతోనూ పులావ్ చేసుకుంటుంటారు. అయితే ఎప్పుడూ ఒకే రకంగా కాకుండా ఈసారికి వెరైటీగా మొక్కజొన్నపులావ్​ చేయండి. టేస్ట్​ అద్దిరిపోతుంది. సాధారణంగా మొక్కజొన్న పొత్తులను నిప్పుల మీద కాల్చుకునో, నీళ్లలో ఉడకబెట్టుకునో తింటుంటారు. అయితే అలానే కాకుండా కొంచెం వెరైటీగా ఈ పులావ్​ చేయండి. లంచ్​ బాక్స్​లకు కూడా ఇది పర్ఫెక్ట్​ రెసిపీ. మరి, దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఈ స్టోరీలో తెలుసుకుందాం..

కావలసిన పదార్థాలు:

  • బాస్మతి బియ్యం-గ్లాసు
  • స్వీట్‌కార్న్‌-కప్పు
  • నెయ్యి -టేబుల్‌స్పూన్‌
  • నూనె-టేబుల్‌స్పూన్‌
  • జీలకర్ర- అర టీ స్పూన్
  • బిర్యానీ ఆకులు-రెండు
  • యాలకులు-మూడు
  • దాల్చిన చెక్క- చిన్న ముక్క
  • లవంగాలు-ఆరు
  • మిరియాలు - నాలుగు
  • సన్నగా కట్​ చేసిన పచ్చిమిర్చి-రెండు
  • పొడవుగా కోసిన ఉల్లిపాయ-ఒకటి
  • ఉప్పు-సరిపడా
  • అల్లంవెల్లుల్లి పేస్టు-టీ స్పూన్
  • చిన్నగా కట్​ చేసిన క్యారెట్, బంగాళాదుంప, టమాట ముక్కలు-కప్పు
  • గరంమసాలా-పావు టీ స్పూన్
  • కొత్తిమీర తరుగు - కొద్దిగా
  • నిమ్మరసం-అరచెక్క

తయారీ విధానం:

  • ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి పావుగంట నానబెట్టాలి.
  • స్టవ్​ ఆన్​ చేసి ప్రెషర్‌ కుక్కర్‌ పెట్టి అందులో నూనె, నెయ్యి వేసి వేడిచేసుకోవాలి.
  • నూనె కాగిన తర్వాత మసాలా దినుసులు(జీలకర్ర, బిర్యానీ ఆకులు, యాలకులు, లవంగాలు, దాల్చినచెక్క, మిరియాలు) ఒకదాని తర్వాత ఒకటి వేసి వేయించుకోవాలి.
  • తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు, అల్లంవెల్లుల్లి పేస్టు వేసి పచ్చివాసన పోయే వరకూ ఫ్రై చేసుకోవాలి.
  • అనంతరం క్యారెట్, బంగాళాదుంప, టమాట ముక్కలు, స్వీట్‌కార్న్, ఉప్పు వేసి కలిపి మూతపెట్టి కాసేపు ఉడికించాలి.
  • ఆ తర్వాత కడిగిన బియ్యం, గరం మసాలా వేసి బాగా కలుపుతూ వేయించాలి. ఇప్పుడు గ్లాసున్నర నీళ్లు పోసి.. కొద్దిగా కొత్తిమీర తురుము వేసి, అరచెక్క నిమ్మరసం వేసి కలపాలి. దీనివల్ల పులావ్‌ పొడి పొడిగా వస్తుంది.
  • ఇప్పుడు ఈ మిశ్రమం మొత్తాన్ని ఒకసారి కలిపి మూత పెట్టి సిమ్​లో రెండు విజిల్‌ రాగానే స్టౌఆఫ్‌ చేయాలి.
  • ఆవిరి మొత్తం పోయినా తర్వాత మూత తీసేస్తే పులావ్‌లోని నీరంతా ఇంకిపోయి పొడిపొడిగా ఉంటూ ఘుమఘుమలాడుతుంది. అంతే దీన్ని వేడివేడిగా సర్వ్​ చేసుకుని ఏదైనా రైతాతో తింటే సూపర్​ టేస్ట్​.
  • నచ్చితే మీరూ ఈ రెసిపీ ట్రై చేయండి. పిల్లల లంచ్​బాక్స్​లకు కూడా ఇది పర్ఫెక్ట్​.

"ఊదల పులావ్​"తో ఊబకాయం రాదట - ఇలా చేస్తే టేస్ట్​ అదుర్స్​!

"పాలక్ పనీర్ పులావ్" - లంచ్ బాక్సులు ఖాళీ అయిపోతాయ్!

ABOUT THE AUTHOR

...view details