Tips to Remove Stains from Glass :ప్రస్తుతం స్మార్ట్ యుగం నడుస్తోంది. వాడుకునే ఫోన్ నుంచి వేసుకునే దుస్తుల వరకూ అన్నీ స్మార్ట్ లుక్‌నే సంతరించుకుంటున్నాయి. ఈ క్రమంలోనే చాలా మంది నేటి రోజుల్లో ఇంటిని మరింత అందంగా తీర్చిదిద్దడం కోసం విండోస్ నుంచి కప్‌బోర్డ్స్ వరకు గ్లాసుతో చేసిన అలంకరణ వస్తువులు విరివిగా ఉపయోగిస్తున్నారు. నిజానికి ఇవి ఇంటికి మంచి క్లాసీ, రిచ్ లుక్‌ని తీసుకోస్తాయి. కానీ, అసలు సమస్య వచ్చేసరికి.. వాటిని మెయింటెయిన్ చేయడం! ఎందుకంటే గ్లాసు ఇంటీరియర్‌పై ఏదైనా మరకలు పడితే వెంటనే కనిపిస్తాయి.
పైగా కొన్నిసార్లు ఎంత క్లీన్ చేసినా కొన్ని రకాల మరకలు అస్సలు పోవు. అలాంటి టైమ్‌లో ఈ టిప్స్ ఫాలో అవ్వడం ద్వారా ఎలాంటి మరకలైనా ఈజీగా తొలగించుకోవచ్చంటున్నారు నిపుణులు. అంతేకాదు, మీ ఇంటి గ్లాస్ ఇంటీరియర్ను కొత్తదానిలా తళతళమెరిపించవచ్చంటున్నారు. ఇంతకీ, ఆ టిప్స్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
నిమ్మరసం :ఇంట్లో ఉన్న గాజు వస్తువులు, అద్దాలపై మరకలు పోగొట్టడంలో నిమ్మరసంచాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుందంటున్నారు నిపుణులు. ముఖ్యంగా దీనిలో ఉండే బ్లీచింగ్ గుణాలు, అసిడిక్ లక్షణాలు అందుకు చాలా బాగా తోడ్పడుతాయి. ఇందుకోసం నీటిలో కొద్దిగా నిమ్మరసాన్ని కలిపి మరకలు ఉన్న చోట స్ప్రే చేయాలి. ఆ తర్వాత తడిగుడ్డతో క్లీన్ చేసుకుంటే సరిపోతుందని చెబుతున్నారు.
వైట్ వెనిగర్ : ఇదీ గ్లాస్ ఇంటీరియర్ ఐటమ్స్‌పై ఉండే మరకలు, మచ్చల్ని తొలగించడంలో చాలా బాగా పనిచేస్తుందంటున్నారు. దీనికోసం వాటర్‌లో కొద్దిగా వైట్ వెనిగర్తీసుకొని మిక్స్ చేసుకోవాలి. ఆపై దాన్ని స్టెయిన్స్ ఉన్న చోట స్ప్రే చేసి తుడుచుకుంటే మరకలు ఇట్టే తొలగిపోతాయంటున్నారు నిపుణులు.
బేకింగ్ సోడా :గాజు వస్తువులు, అద్దాలపై మరకలను పోగొట్టడంలో బేకింగ్ సోడా మంచి క్లీనింగ్ ఏజెంట్‌గా పనిచేస్తుందంటున్నారు. దీనికోసం ఒక బౌల్లో కొద్దిగా బేకింగ్ సోడా, వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్‌లా ప్రిపేర్ చేసుకోవాలి. ఆపై దాన్ని మరకలు ఉన్నచోట అప్లై చేయాలి. తర్వాత తడి క్లాత్‌తో తుడుచుకుంటే సరిపోతుందట. ఫలితంగా వాటిపై మరకలు ఈజీగా తొలగిపోయి తళతళ మెరుస్తాయంటున్నారు.