ETV Bharat / health

రోజూ తలస్నానం చేయొచ్చా? హెడ్ బాత్​కు ముందు, తర్వాత ఈ జాగ్రత్తలు తీసుకోవాలట! - HOW TO DO HEAD BATH PROPERLY

-వేడి నీటితో తల స్నానం చేస్తే ఏం అవుతుంది? -తలస్నానం చేసే ముందు, తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు

How to Do Head Bath Properly
How to Do Head Bath Properly (Getty Images)
author img

By ETV Bharat Health Team

Published : 2 hours ago

How to Do Head Bath Properly: మీరు రోజు తలస్నానం చేస్తున్నారా? ఇంకా కొందరైతే జుట్టు కాస్త డల్‌గా, రఫ్‌గా కనిపించిన వెంటనే తలస్నానం చేసేస్తుంటారు. కానీ, అలా చేయడం జుట్టుకు మంచిదేనా? అసలు ఎన్ని రోజులకోసారి తలస్నానం చేయాలి? తలస్నానం చేసే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? లాంటి ప్రశ్నలకు సమాధానాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఎన్ని రోజులకోసారి చేస్తున్నారు?
దుమ్ము, ధూళి, వాతావరణ కాలుష్యం, పొగ.. ఇలా వివిధ కారణాల వల్ల జుట్టు తొందరగా రఫ్‌గా, డల్‌గా మారిపోతుంది. దీంతో జుట్టు తిరిగి మృదువుగా, ఆరోగ్యంగా కనిపించాలని వెంటనే తలస్నానం చేసేస్తుంటారు. అయితే, రెండు రోజులకోసారి తలస్నానం చేయడం వల్ల చుండ్రు పోయి జుట్టు ఆరోగ్యం మెరుగపడుతుందని నిపుణులు అంటున్నారు. 2018లో Journal of Cosmetic Dermatology ప్రచురితమైన "The Effect of Scalp Washing Frequency on Dandruff and Scalp Conditions" అధ్యయనంలో తేలింది. ఒకవేళ మీది సాధారణ, పొడి జుట్టు అయితే వారానికి రెండుసార్లు మాత్రమే తలస్నానం చేస్తే సరిపోతుందని వివరిస్తున్నారు. ముఖ్యంగా తలస్నానం చేసే సమయంలో గాఢత తక్కువగా ఉండే షాంపూనే ఉపయోగించాలని చెబుతున్నారు.

తల స్నానం ఇలా చేయాలట
తలస్నానం చేయాలనుకునే వారు ముందుగా జుట్టు చిక్కులు తీసి దువ్వుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఫలితంగా తలస్నానం చేసేటప్పుడు జుట్టు రాలడం కొంతవరకు తగ్గించుకోవచ్చని వివరిస్తున్నారు. అలాగే బిరుసుగా ఉన్న వెంట్రుకలు కూడా తెగిపోకుండా కాపాడుకోవచ్చని అంటున్నారు. తలస్నానానికి ముందుగా నీళ్లతో జుట్టుని బాగా తడపాలని సలహా ఇస్తున్నారు. ఆ తర్వాత నీళ్లలో షాంపూను కలిపి ఈ మిశ్రమాన్ని తలపై పోసుకొని.. కుదుళ్లను రెండు నిమిషాల పాటు గుండ్రంగా రుద్దుతూ మసాజ్‌ చేసి గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలని చెబుతున్నారు. ఫలితంగా కుదుళ్లు బాగా శుభ్రపడి రక్తప్రసరణ మెరుగుతుందని తెలిపారు. ఇంకా జుట్టు రాలిపోయే సమస్య కూడా తగ్గుముఖం పడుతుందని పేర్కొన్నారు.

గోరువెచ్చని నీరు
అయితే, తలస్నానం చేసే సమయంలో మరీ చల్లని లేదా బాగా వేడిగా ఉండే నీళ్లను ఉపయోగించకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల కుదుళ్ల లోపల ఉండే సెబేషియస్‌ గ్రంథులు దెబ్బతింటాయని హెచ్చరిస్తున్నారు. ఫలితంగా ఆ ప్రాంతంలో జుట్టు పల్చగా అయిపోయి, తేమను కూడా కోల్పోతుందని వివరిస్తున్నారు. అందుకే తలస్నానానికి ఉపయోగించే నీళ్లు మరీ చల్లగా, మరీ వేడిగా కాకుండా.. గోరు వెచ్చగా ఉండేలా చూసుకోవడం ఉత్తమమని సలహా ఇస్తున్నారు.

కండిషనర్‌తో ఫినిషింగ్‌ టచ్
మనలో చాలామంది తలస్నానం చేయగానే అక్కడితో పని అయిపోయిందని అనుకుంటారు. కానీ, తలస్నానం చేశాక జుట్టుకి కండిషనర్ రాసుకోవడం కూడా చాలా ముఖ్యమని వివరిస్తున్నారు. ఇలా కండిషనర్ రాసుకోవడం వల్ల వెంట్రుకల చివర్లు చిట్లకుండా జాగ్రత్తపడచ్చని అంటున్నారు. అలాగే జుట్టు మృదువుగా, పట్టుకుచ్చులా మారుతుందని.. కండిషనర్ జుట్టు తేమను కోల్పోకుండా చేస్తుందని తెలిపారు.

తడి తలను దువ్వకూడదట
మనలో చాలా మంది తలస్నానం చేయగానే జుట్టును దువ్వేస్తుంటారు. ఈ సమయంలో కుదుళ్లు బాగా మెత్తబడి ఉంటాయని.. అప్పుడు తల దువ్వితే ఎక్కువగా జుట్టు రాలిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అందుకే ఎప్పుడూ తడి తలను దువ్వే ప్రయత్నం చేయకూడదని చెబుతున్నారు. ముందు జట్టును బాగా ఆరబెట్టుకుని, ఆ తర్వాతే దువ్వుకోవాలని అంటున్నారు. ఇంకా చాలా మంది తడిగా ఉన్న తల త్వరగా ఆరిపోవాలని టవల్ పెట్టి తెగ తుడిచేస్తూ ఉంటారు. కానీ ఇలా చేయడం వల్ల జుట్టు నిర్జీవంగా మారిపోతుందని తెలిపారు. అందుకే వీలైనంత వరకు జుట్టుని సహజంగానే ఆరనివ్వాలని అంటున్నారు. అలాగే తలను ఆరబెట్టుకోవడానికి డ్రయర్స్, బ్లోయర్స్.. వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను వాడకపోవడమే మంచిదని సూచిస్తున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

ఎంత ట్రై చేసినా బరువు తగ్గట్లేదా? డైలీ ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే ఈజీగా వెయిట్ లాస్!

యూరిక్ యాసిడ్​ ఎక్కువై ఇబ్బంది పడుతున్నారా? ఈ డైట్ పాటిస్తే 'గౌట్' తగ్గిపోతుందట!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.