ETV Bharat / offbeat

సండే స్పెషల్​ : నోరూరించే "మట్టగిడసల పులుసు" - ఈ పద్దతిలో వండితే ముద్దకో ముక్క తినాల్సిందే! - BURADAMATTA CHEPALA PULUSU TELUGU

-ఆదివారం అద్దిరిపోయేలా స్పైసీ మట్టగిడసల చేపల పులుసు -ఈ పద్దతిలో వండితే గిన్నె ఖాళీ కావాల్సిందే!

Buradamatta Chepala Pulusu
Buradamatta Chepala Pulusu (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 7, 2024, 5:27 PM IST

Buradamatta Chepala Pulusu : నాన్​వెజ్​ ప్రియులకు సండే వచ్చిందంటే చికెన్​, మటన్​ వంటివి ఏదో ఒకటి తప్పకుండా ఉండాల్సిందే. షాపుల దగ్గర లైన్ ఎంత ఉన్నా కూడా ఓపికగా నచ్చింది కొనుక్కుని ఇంటికి వస్తుంటారు. కూరలోకి మసాలాలు బాగా వేసి బిర్యానీ, కర్రీలు ప్రిపేర్​ చేసుకుని తృప్తిగా రెండుపూటల భోజనం చేస్తుంటారు. అయితే, ఈ సండేరోజు ఎప్పుడూ ఒకేలా కాకుండా ఈ సారి చేపల పులుసు ట్రై చేయండి. చేపల పులుసులో కూడా బురద మట్టలతో చేసిన కర్రీకి ఫ్యాన్స్​ ఎక్కువే. ఎందుకంటే దాని టేస్ట్​ అంత బాగుంటుంది. బురదమట్ట చేపలనే మట్టగిడసలు అని కూడా పిలుస్తారు. ఇక్కడ చెప్పిన విధంగా చేపల పులుసు చేస్తే ఎంతో స్పైసీగా పుల్లపుల్లగా చాలా బాగుంటుంది. మరి ఇక లేట్​ చేయకుండా ఇంట్లోనే సింపుల్​గా మట్టగిడసల చేపల పులుసు ఎలా చేయాలి ? దాని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఓ లుక్కేయండి.

మట్టగిడసల చేపల పులుసుకి కావాల్సిన పదార్థాలు :

  • మట్టగిడసలు - అరకేజీ
  • ఉల్లిపాయలు-6 (మీడియం సైజ్​)
  • పచ్చిమిర్చి-8
  • కొత్తమీర తరుగు-కప్పు
  • నూనె-3 టేబుల్​స్పూన్​
  • కారం-2 టేబుల్​స్పూన్లు
  • చింతపండు-పెద్ద నిమ్మకాయ సైజంతా
  • కల్లుప్పు- రుచికి సరిపడా
  • పసుపు-చిటికెడు

తయారీ విధానం:

  • ముందుగా మట్టగిడసల చేపలను బాగా శుభ్రం చేసుకోవాలి. తర్వాత కొద్దిగా కల్లుప్పు వేసి వాటిని మరోసారి శుభ్రం చేసుకోవాలి.
  • ఈ చేపల పులుసును మట్టి పాత్రలో చేసుకుంటే రుచి అద్భుతంగా ఉంటుంది.
  • అలాగే ఉల్లిపాయలను సన్నగా కట్​ చేసుకోండి. పచ్చిమిర్చి మధ్యలోకి చీల్చుకోండి.
  • ఇంకా చింతపండు 15 నిమిషాలు నీటిలో నానెబెట్టుకోండి.
  • తర్వాత చింతపండు రసం రెడీ చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకోండి.
  • ఇప్పుడు మట్టిపాత్రలోకి శుభ్రం చేసిన చేపలు, కట్​ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి చీలికలు, నూనె, రుచికి సరిపడా కల్లుప్పు, కొద్దిగా కొత్తిమీర తరుగు, పసుపు, కారం వేసి బాగా కలుపుకోండి.
  • తర్వాత చింతపండు పులుసు సగానికి పైగా పోసుకోండి. అలాగే చేప ముక్కలు మునిగే వరకు నీళ్లు పోసుకోండి. (మిగతా చింతపండు రసం చేపల పులుసు ఉడికిన తర్వాత పోసుకోండి)
  • ఇప్పుడు చేపల పులుసు ఉడికించడానికి మట్టిపాత్రను స్టౌపై పెట్టండి.
  • స్టౌ మీడియం ఫ్లేమ్​లో ఉంచి మధ్యమధ్యలో కలుపుతూ 20-25 నిమిషాలు ఉడికించుకోండి.
  • ఈ సమయంలోనే మిగిలిన చింతపండు పులుసు కూరలో పోసుకుని ఉప్పు, కారం, పులుపు సరి చూసుకోండి.
  • తర్వాత కొత్తిమీర తరుగు వేసి మరో 5 నిమిషాలు ఉడికించుకుని స్టౌ ఆఫ్​ చేసుకోండి.
  • అంతే ఇలా సింపుల్​గా చేసుకుంటే ఎంతో రుచికరమైన మట్టగిడసల చేపల పులుసు మీ ముందుంటుంది.
  • నచ్చితే ఇలా మట్టగిడసల చేపల పులుసు ట్రై చేయండి.

ఇవి కూడా చదవండి :

"ఫిష్​ ఫ్రై బిర్యానీ" ఎప్పుడైనా ట్రై చేశారా? - ఈ టేస్ట్​ అస్సలు మర్చిపోలేరు!

ఓసారి ఇలా "చేపల ఫ్రై" చేసి చూడండి - తక్కువ సమయంలో అదుర్స్ అనిపించే టేస్ట్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.