Allari Naresh Bachhala Malli Trailer : టాలీవుడ్ స్టార్ హీరో అల్లరి నరేశ్ లీడ్ రోల్లో తెరకెక్కుతోన్న లేటెస్ట్ మూవీ 'బచ్చల మల్లి'. యాక్షన్, ఎమోషనల్ ఎలిమెంట్స్ కలగలిసిన ఈ సినిమా ప్రస్తుతం డిసెంబర్ 20న థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో మేకర్స్ తాజాగా ఈ సినిమాకు సంబంధించిన సాలిడ్ ట్రైలర్‌ను విడుదల చేసింది. ఇందులో అల్లరి నరేశ్ మాస్ లుక్‌లో కనిపించి ఆకట్టుకున్నారు. ప్రతి విషయంలో గొడవపడే వ్యక్తి ప్రేమలో పడటం, ఆ తర్వాత అతడికి ఎదురైన సంఘటనలేమిటి? అనే అంశాలతో ఆసక్తికరంగా ఈ ట్రైలర్ సాగింది.
కథ విషయానికి వస్తే
ఆంధ్రప్రదేశ్‌లోని తుని ప్రాంతంలో జరిగిన కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా సినిమాను తెరకెక్కించనున్నట్లు సమాచారం. డైరెక్టర్ సుబ్బు ఈ సినిమాను భారీ అంచనాలతో తెరకెక్కిస్తున్నారు. అంతేకాకుండా ఈ మూవీ రైటర్ కూడా ఆయనే. హాస్య మూవీస్ బ్యానర్ పై రాజేశ్ దండ, బాలాజీ గుత్తా ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఇందులో అల్లరి నరేశ్ సరసన అమృత అయ్యర్ ఫీమేల్ లీడ్‌గా కనిపిస్తుండగా, ఇతర కీలక పాత్రల్లో రావు రమేశ్, రోహిణీ అచ్చుత్ కుమార్, బలగం జయరాం, హరి తేజ, వైవా హర్ష ప్రవీణ్ కనిపించనున్నారు. విశాల్ చంద్రశేఖర్ ఈ సినిమాకు సంగీతం సమకూరుస్తున్నారు. ఫుల్ మాస్ స్టోరీతో అలరించేందుకు రెడీ అవుతోన్న డిసెంబర్ 20న రిలీజ్ కానుంది.
ఇంట్రెస్టింగ్గా ఫస్ట్ లుక్ పోస్టర్
పేరు: మళ్ళీ, ఇంటిపేరు : బచ్చల, చేసేది : ట్రాక్టర్ డ్రైవెర్. "ఈ బచ్చల మల్లి ఖచ్చితంగా మీకు చాలా రోజులు గుర్తుండిపోతారు". అంటూ హీరో ఫస్ట్ లుక్ పోస్టర్‌ను గతంలో రివీల్ చేశారు మేకర్స్. దాన్ని చూస్తే నరేశ్ ఈ చిత్రంలో ఒక లోకల్ రౌడీ పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది. అందుకోసమే ఆయన ఈ కథకు తగ్గట్టుగా గడ్డం పెంచుకుని, మెడలో తాయెత్తు, చేతికి కాశీ దారం ఇలా ఫుల్ మాస్ లుక్‌లో కనిపించారు. అంతేకాకుండా ఓ రిక్షా మీద కూర్చొని బీడీ తాగుతున్నట్లు కూడా ఆ పోస్టర్లో చూడొచ్చు. ఇలా పలు మాస్ ఎలిమెంట్స్‌తో ఉన్న ఈ ఫొటో ప్రస్తుతం మూవీ లవర్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది.
'నరేశ్ 62' ఇంట్రెస్టింగ్ లుక్ - ఊరమాస్ 'బచ్చల మల్లి' ఎంట్రీ - Bachhala Malli Movie First Look
మాస్ లుక్, 90స్ బ్యాక్‌డ్రాప్ - అల్లరి నరేశ్ 'బచ్చల మల్లి' టీజర్ చూశారా?