How to Make Temple Style Chitrannam:దేవాలయాల్లో ఒక్కో టెంపుల్‌కి ఒక్కో విశిష్టత ఉన్నట్టే.. భక్తులకు పంచే ప్రసాదాల్లోనూ ప్రత్యేకత ఉంటుంది. అలాంటి ప్రత్యేకత కలిగిన ప్రసాదాల్లో చిత్రాన్నం ఒకటి. ఈ చిత్రానాన్ని శైవాలయాల్లో ముఖ్యంగా ధనుర్మాస తిరుప్పావైసమయంలో విష్ణు మూర్తికి ప్రసాదంగా నివేదిస్తారు. ప్రత్యేకించి సంతోషిమాత వ్రతాన్ని చేసుకునే వారుకూడా అమ్మవారికి దీనిని నివేదిస్తారు. ఈ ప్రసాదాన్ని ప్రత్యేక తిథుల్లో శ్రీశైల మల్లికార్జునుడికి సమర్పిస్తారు. మరి ఇంతటి విశిష్టత కలిగిన చిత్రాన్నం ప్రసాదాన్ని మీరు ఇంట్లోనే ట్రై చేయండి. టేస్ట్ అద్దిరిపోతుంది. పైగా చేయడం చాలా ఈజీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఈ స్టోరీలో తెలుసుకుందాం..
కావాల్సిన పదార్థాలు:
- బియ్యం - అర కప్పు
- పచ్చి శనగపప్పు - రెండు టేబుల్ స్పూన్లు
- నీళ్లు - కప్పున్నర
- ఉప్పు - రుచికి సరిపడా
- నెయ్యి - పావు కప్పు
- ఆవాలు - అర టీ స్పూన్
- మినపప్పు - 1 టీ స్పూన్
- జీలకర్ర - అర టీ స్పూన్
- ఎండు మిర్చి - 3
- మిరియాలు - అర టీ స్పూన్
- జీడిపప్పు - 2 టేబుల్ స్పూన్లు
- కరివేపాకు - 2 రెమ్మలు
- ఇంగువ - చిటికెడు(ఆప్షనల్)
- పచ్చి కొబ్బరి తురుము - పావు కప్పు
- పచ్చిమిర్చి - 2
తయారీ విధానం:
- ముందుగా పచ్చి శనగపప్పును శుభ్రంగా కడిగి అరగంట సేపు నానబెట్టాలి.
- స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి బియ్యం వేసి లో ఫ్లేమ్‌లో వైట్ కలర్ వచ్చేవరకు రోస్ట్ చేయాలి. ఇలా కలర్ మారిన తర్వాత ఓ గిన్నెలోకి తీసుకుని శుభ్రంగా కడిగి వడకట్టాలి.
- ఇప్పుడు కుక్కర్లోకి నానబెట్టిన శనగపప్పు, కడిగి వడకట్టిన బియ్యం, కప్పున్నర నీళ్లు, రుచికి సరిపడా ఉప్పు వేసి మీడియం ఫ్లేమ్‌లో మూడు విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి.
- కుక్కర్ ఆవిరి పోయిన తర్వాత మూత తీసి ఓసారి కలిపి పక్కన పెట్టాలి.
- ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నెయ్యి వేసి కరిగించుకోవాలి.
- నెయ్యి కరిగిన తర్వాత ఆవాలు, మినపప్పు వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత జీలకర్ర, ఎండు మిర్చి వేసి ఫ్రై చేయాలి.
- ఆ తర్వాత మిరియాలు, జీడిపప్పు, కరివేపాకు వేసి ఎర్రగా వేయించుకోవాలి. ఆ తర్వాత ఇంగువ వేసి మరో నిమిషం పాటు వేయించుకోవాలి.
- ఆ తర్వాత పచ్చికొబ్బరి తురుము, సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి చీలికలు వేసి కొబ్బరి ఎర్రగా మారే వరకు ఫ్రై చేసుకోవాలి.
- ఇలా వేయించుకున్న తాలింపును ఉడికించిన అన్నంలో వేసి కలిపితే సరి. ఎంతో రుచికరంగా ఉండే టెంపుల్ స్టైల్ చిత్రాన్నం రెడీ. నచ్చితే మీరూ దీనిని ట్రై చేయండి. ఇది కేవలం ప్రసాదంగా మాత్రమే కాదు లంచ్ బాక్స్‌లకు కూడా పర్ఫెక్ట్ రెసిపీ.
ఎంతో రుచికరమైన శబరిమల "అరవణ ప్రసాదం" - ఇంట్లోనే సులభంగా చేసుకోండిలా!
వంటసోడా లేకుండా అద్దిరిపోయే "అరటికాయ బజ్జీలు" - ఇలా చేస్తే నూనెె తక్కువ, రుచి ఎక్కువ!