ETV Bharat / international

అఫ్గాన్‌పై పాక్‌ వైమానిక దాడులు - 46 మంది మృతి - PAKISTAN AIR STRIKES IN AFGHANISTAN

అఫ్గానిస్థాన్‌పై పాకిస్థాన్‌ వైమానిక దాడులు - ప్రతీకారం తీర్చుకుంటామని తాలిబన్ల హెచ్చరిక

Pakistan Air Strikes In Afghanistan
Pakistan Air Strikes In Afghanistan (ANI (Representative Image))
author img

By ETV Bharat Telugu Team

Published : 12 hours ago

Pakistan Air Strikes In Afghanistan : అఫ్గానిస్థాన్‌పై పాకిస్థాన్‌ చేసిన వైమానిక దాడుల్లో 46 మంది మృతి చెందినట్లు తాలిబన్‌ ప్రభుత్వం వెల్లడించింది. ఇందులో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారని తెలిపింది. ఈ దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించింది.

తూర్పు పక్తికా ప్రావిన్స్‌లోని బార్మల్‌ జిల్లాలో నాలుగు గ్రామాలే లక్ష్యంగా పాక్​ వైమానిక దాడులు జరిపింది. ఈ దాడుల్లో 46 మంది చనిపోగా, మరో ఆరుగురు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉందని తాలిబన్‌ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్‌ పేర్కొన్నారు. ఈ ఘటనను అనాగరిక చర్యగా తాలిబన్‌ రక్షణ శాఖ పేర్కొంది. వీటికి పాల్పడిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించింది. ఈ దాడుల్లో వజీరిస్థానీ శరణార్థులే ఎక్కువగా మరణించినట్లు తెలుస్తోంది.

అఫ్గాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్న తర్వాత సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవల తమ దేశంలో జరిగిన పలు ఉగ్రదాడులకు తాలిబన్లే కారణమని పాకిస్థాన్‌ ఆరోపిస్తోంది. అయితే ఈ ఆరోపణలను తాలిబన్‌ వర్గాలు ఖండిస్తున్నాయి.

ఇదేం కొత్తకాదు!
వాస్తవానికి మార్చి నెలలోనూ అఫ్గాన్‌పై పాక్​ వైమానిక దాడులు చేసింది. తాజాగా మరోసారి ఈ దాడులకు పాల్పడింది. అయితే, వీటిపై పాక్‌ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.