How to Make Chilli Fish at Home: చేపలు.. ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. అందుకే సండే రోజున ఎక్కువ మంది వీటిని తెచ్చుకుని తింటుంటారు. కేవలం సండే మాత్రమే కాదు.. ఎప్పుడు తినాలనిపించినా, ఇంటికి అతిథులు వచ్చినప్పుడైనా సరే వీటిని తీసుకొస్తుంటారు. ఇక చేపలతో పులుసు, ఫ్రై, పచ్చడి అంటూ ఎన్నో రకాలుగా చేస్తుంటారు. అయితే చేపలతో చేసుకునే రెసిపీలలో చిల్లీ ఫిష్ కూడా ఒకటి. ఎక్కువ మంది వీటిని రెస్టారెంట్స్‌కు వెళ్లినప్పుడు మాత్రమే ఆర్డర్ పెట్టుకుని తింటుంటారు. కారణం ఇంట్లో తయారు చేసుకోవడం కుదరక. అయితే మేము చెప్పే ఈ టిప్స్ పాటిస్తే ఇంట్లోనే చిల్లీ ఫిష్‌ను ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పైగా ఎంతో టేస్టీగా ఉంటాయి. ఈ రెసిపీ ప్రిపేర్ చేయడానికి ఎక్కువ పదార్థాలు కూడా అవసరం లేదు. మరి ఈ స్టాటర్కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఈ స్టోరీలో తెలుసుకుందాం..
కావాల్సిన పదార్థాలు:
- ముళ్లు తీసిన చేప ముక్కలు - అర కేజీ
- ఉప్పు- రుచికి సరిపడా
- కారం - 2 టీ స్పూన్లు
- గరం మసాలా - 1 టీ స్పూన్
- అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టీ స్పూన్
- మిరియాల పొడి - అర టీ స్పూన్
- నిమ్మరసం - అర చెక్క
- కార్న్‌ఫ్లోర్ - 2 టేబుల్ స్పూన్లు
- మైదా - 2 టేబుల్ స్పూన్లు
- కోడిగుడ్డు - 1
- నీళ్లు - 2 టేబుల్ స్పూన్లు
టాసింగ్ కోసం:
- నూనె - 2 టేబుల్ స్పూన్
- అల్లం తరుగు - 1 టేబుల్ స్పూన్
- వెల్లుల్లి తరుగు - 1 టేబుల్ స్పూన్
- పచ్చిమిర్చి - 3
- ఉల్లిపాయ ముక్కలు - పావు కప్పు
- క్యాప్సికం ముక్కలు - పావు కప్పు
- సోయా సాస్ - 2 టేబుల్ స్పూన్లు
- చిల్లీ సాస్ - 2 టేబుల్ స్పూన్లు
- టమాట సాస్ - 1 టేబుల్ స్పూన్
- ఉప్పు - పావు టీ స్పూన్
- నీళ్లు - పావు కప్పు
- కొత్తిమీర తరుగు - కొద్దిగా