This Chicken Part Harmful to Health: టేస్టీగా, యమ్మీగా ఉండే చికెన్‌ను.. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడేవారే. ఇక నాన్‌వెజ్ ప్రియులకైతే ముక్కలేనిదే ముద్ద దిగదు. అలాంటి వారందరికీ బిగ్ అలర్ట్. అదేంటంటే.. చికెన్(Chicken)ఆరోగ్యకరమైన మాంసమే అయినప్పటికీ దాంట్లో కొన్ని భాగాలు శరీరానికి హాని కలిగిస్తాయంటున్నారు నిపుణులు. ముఖ్యంగా కోడిలోని ఈ భాగాన్ని అస్సలు తినకూడదని హెచ్చరిస్తున్నారు. ఇంతకీ, కోడిలోని ఏ పార్ట్ తినకూడదు? ఏది తింటే ఆరోగ్యానికి మంచిదో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
చికెన్‌లో ఆరోగ్యానికి అత్యంత హానికరమైనది.. చర్మం(Skin). ఇది కూరకు రుచిని అందించినప్పటికీ ఆరోగ్యం విషయంలో కొన్ని ప్రతికూల ఫలితాలను అందిస్తుందంటున్నారు నిపుణులు. ఎందుకంటే.. కోడి చర్మంలో హానికరమైన కొవ్వులు అధికంగా ఉంటాయి. అలాగే.. దీంట్లో పోషక విలువలేమీ ఉండవు. ఇంకో విషయం ఏంటంటే.. కోడి చూడటానికి అందంగా ఆకర్షణీయంగా కనిపించేందుకు ఫారమ్ వాళ్లు లేదా దుకాణాదారులు కోడి తోలుపై కెమికల్స్ చల్లుతారు. కాబట్టి.. చికెన్ స్కిన్‌కు దూరంగా ఉండాలని చెబుతున్నారు.
తింటే ఈ ఆరోగ్య సమస్యలు పక్కా!: చికెన్ స్కిన్ తినడం వల్ల శరీరంలో అనారోగ్యకరమైన కొవ్వులు(National Institutes of Health రిపోర్టు)పేరుకుపోయి బరువు పెరిగే ఛాన్స్ ఉంటుంది. అంతేకాదు.. రక్తపోటు, మధుమేహం, గుండె జబ్బులు వంటి వ్యాధుల ప్రమాదాన్ని చికెన్ స్కిన్ వినియోగం పెంచుతుందని సూచిస్తున్నారు నిపుణులు. అందుకే.. కార్డియాలజిస్టులు చికెన్ తక్కువగా తినాలని, చర్మాన్ని తినవద్దని సలహా ఇస్తుంటారు. 2018లో "బ్రిటీష్ జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్"లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. చికెన్ స్కిన్ తినేవారిలో అనారోగ్యకరమైన కొవ్వులు పేరుకుపోతాయని కనుగొన్నారు. ఈ పరిశోధనలో చైనాలోని హర్బిన్ మెడికల్ యూనివర్సిటీకి చెందిన ప్రముఖ పోషకాహార నిపుణులు డాక్టర్ జెన్ జాంగ్ పాల్గొన్నారు.
చికెన్ స్కిన్ అస్సలు తినకూడదా!:చికెన్ స్కిన్ అంటే కొందరికి చాలా ఇష్టం. ఎందుకంటే.. ఇది కూర రుచిని రెట్టింపు చేస్తుందని స్కిన్‌తోనే వండుకుని తింటుంటారు. అలాంటి వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. ముఖ్యంగా దాన్ని వండుకునే ముందు.. ఉప్పు, పసుపు వేసి రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి ఆపై కుక్ చేసుకోవాలని సూచిస్తున్నారు. అయినప్పటికీ.. చికెన్ స్కిన్‌ను ఎక్కువగా తినకూడదనే విషయాన్ని గుర్తుంచుకోవాలంటున్నారు.