తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

సండే స్పెషల్ - తెలంగాణ స్టైల్​లో "చికెన్ ఫ్రై" ఇలా చేయండి - రుచి అద్దిరిపోతుంది! - Telangana Style Chicken Fry - TELANGANA STYLE CHICKEN FRY

Restaurant Style Chicken Fry Recipe : చికెన్.. పిల్లల నుంచి పెద్దల వరకూ మెజారిటీ పీపుల్ ఇష్టపడే నాన్​ వెజ్​ ఐటమ్స్​లో ముందు వరుసలో ఉంటుంది. అలాంటి వారికోసం ఒక అద్దిరిపోయే నాన్​వెజ్ రెసిపీ తీసుకొచ్చాం. అదే.. "తెలంగాణ రెస్టారెంట్ స్టైల్ చికెన్ ఫ్రై". దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

Telangana Restaurant Style Chicken Fry
Chicken Fry Recipe (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Sep 1, 2024, 1:01 PM IST

Updated : Sep 1, 2024, 2:59 PM IST

Telangana Restaurant Style Chicken Fry Recipe : చాలా మంది "తెలంగాణ రెస్టారెంట్ స్టైల్ చికెన్ ఫ్రై" అంటే ఎంతో ఇష్టపడుతుంటారు. కానీ, ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే అలా కుదరడం లేదని ఫీల్ అవుతుంటారు. అలాంటి వారు ఇలా ఇంట్లోనో ఈజీగా ప్రిపేర్ చేసుకోండి. టేస్ట్ రెస్టారెంట్ స్టైల్​కి ఏమాత్రం తీసిపోదు. ఇంతకీ, ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :

  • చికెన్ - అరకిలో(మీడియం సైజ్​లో కట్ చేసిన ముక్కలు)
  • నూనె - 4 టేబుల్​స్పూన్లు
  • ఉల్లిపాయ - 1
  • పచ్చిమిర్చి - 2
  • కరివేపాకు రెమ్మలు - 2
  • అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్
  • ధనియాల పొడి - 1 టీస్పూన్
  • వేయించిన జీలకర్ర పొడి - 1 టీస్పూన్
  • గరం మసాలా - 1 టీస్పూన్
  • పసుపు - అర టీస్పూన్
  • కారం - రుచికి తగినంత
  • ఉప్పు - రుచికి సరిపడా
  • చింతపండు రసం - 1 టేబుల్ స్పూన్
  • మిరియాల పొడి - అర టీస్పూన్
  • కొత్తిమీర తరుగు - 2 టేబుల్​ స్పూన్లు

ఉల్లిపాయలు లేకుండా 'లాహోరి గ్రీన్​ చికెన్' - తిన్నారంటే మైమరచిపోతారు! ఓ సారి ట్రై చేయండి!

తయారీ విధానం :

  • ఇందుకోసం ముందుగా రెసిపీలోకి కావాల్సిన చికెన్​ను(Chicken)శుభ్రంగా కడగాలి. ఆపై ఒక బౌల్​లో కాస్త ఉప్పు వేసి 30 నిమిషాల పాటు చికెన్​ను నానబెట్టుకోవాలి.
  • ఆలోపు రెసిపీలోకి కావాల్సిన ఉల్లిపాయను సన్నని తరుగులా కాకుండా కాస్త మందంగా ఉండేలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే పచ్చిమిర్చిని సన్నగా తరుక్కోవాలి. ఫ్రెష్​గా అల్లం వెల్లుల్లి పేస్ట్​ను రుబ్బుకొని పక్కన ఉంచుకోవాలి.
  • ఇప్పుడు స్టౌపై కచ్చితంగా అడుగు మందం ఉండే పాన్​ను పెట్టుకొని నూనె పోసుకోవాలి. ఆయిల్ కాస్త వేడెక్కాక ఉల్లిపాయ తరుగు వేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి.
  • ఆనియన్స్ వేగాయనుకున్నాక.. అందులో పచ్చిమిర్చి తరుగు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మరికాసేపు ఫ్రై చేసుకోవాలి.
  • ఆ తర్వాత నానబెట్టిన చికెన్​ను తీసుకొని ఆ మిశ్రమంలో వేసుకొని మంటను హై ఫ్లేమ్​లో ఉంచి 3 నిమిషాల పాటు చికెన్​ను ఫ్రై చేసుకోవాలి.
  • అనంతరం ఆ మిశ్రమంలో ధనియాల పొడి, వేయించిన జీలకర్ర పొడి, గరంమసాలా, పసుపు, కారం, ఉప్పు.. ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఆపై మంటను హై ఫ్లేమ్​ మీద ఉంచి మసాలాలన్ని చికెన్​కు పట్టేలా బాగా కోట్ చేసుకోవాలి.
  • ఆ తర్వాత అందులో మూడు టేబుల్ స్పూన్ల వాటర్ పోసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అనంతరం పాన్​పై మూతపెట్టి మంటను మీడియం ఫ్లేమ్​లో ఉంచి ఉడికించుకోవాలి.
  • అయితే, ఇలా చికెన్ ఉడికించేటప్పుడు 4-5 నిమిషాలకి మసాలాలు వేగి అడుగుపడుతుంది అప్పుడు మసాలాలని గీరి బాగా కలిపి మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి.
  • ఇలా ప్రతీ 5 నిమిషాలకు ఒకసారి గరిటెతో కలుపుతూ.. వాటర్ పోయి చికెన్ డార్క్ బ్రౌన్​ కలర్​లోకి మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందుకోసం దాదాపు 40 నుంచి 45 నిమిషాల పట్టవచ్చు.
  • ఆ విధంగా చికెన్ ఉడికిందనుకున్నాక.. అందులో చింతపండు రసం, మిరియాల పొడి, కొత్తిమీర తరుగు వేసి బాగా కలుపుకొని మరో ఐదారు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి.
  • ఆ తర్వాత చూస్తే.. చికెన్ డార్క్ కలర్​లోకి రోస్ట్ అయి చూస్తే రెస్టారెంట్ స్టైల్ చికెన్ వేపుడులా కనిపిస్తూ నోరూరిపోతుంది. మరి, ఇంకెందుకు ఆలస్యం మీరు ఓసారి తెలంగాణ రెస్టారెంట్ స్టైల్ చికెన్ వేపుడుని ట్రై చేయండి. ఇంటిల్లిపాది ఆస్వాదించండి.

ఘాటు తక్కువ, ఘుమాయింపు ఎక్కువ - "రెస్టారెంట్ స్టైల్ బటర్ చికెన్" - ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోండి!

ఆంధ్రా స్టైల్​లో చికెన్ పచ్చడి - ఇలా ప్రిపేర్ చేశారంటే సూపర్​ టేస్ట్​!

Last Updated : Sep 1, 2024, 2:59 PM IST

ABOUT THE AUTHOR

...view details