తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

అలర్ట్ : దీపావళి టపాసుల నుంచి మీ కారును ఇలా కాపాడుకోండి - లేదంటే కాలి బూడిదైపోయే ప్రమాదం!

- ఈ జాగ్రత్తలు తీసుకుంటే మీ కారు డ్యామేజ్​ కాకుండా చూసుకోవచ్చు

Car Parking Safety Tips From Crackers
Car Parking Safety Tips From Crackers (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : 4 hours ago

Car Parking Safety Tips From Crackers: దీపావళి పండగ జరుపుకోవడానికి యావత్​ దేశం సిద్ధమైంది. ఈ పండగ సందడి అంతా టపాసులలోనే ఉంటుంది. ఇప్పటికే బాణాసంచా ఇంటింటికీ చేరుతోంది. ఇక, గల్లీ నుంచి దిల్లీ దాకా ఈ టపాసులు మోతెక్కిపోతాయి. అయితే.. ఇలాంటి సమయంలో కేవలం మనుషులు,పెట్స్​ విషయంలోనే కాదు.. వాహనదారులు తమ వెహికల్స్ పార్కింగ్ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాల్సిందే. లేదంటే.. అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. అంతేకాదు వాహనాలు కాలి బూడిదైనా ఆశ్చర్యం పోవాల్సిన పని లేదు. అందుకే.. మీ వెహికల్స్​ జాగ్రత్తగా ఉండాలంటే ఈ టిప్స్ పాటించండి.

దూరంగా: ఇప్పుడు చాలా మంది టపాసుల షాపులు పెడుతున్నారు. అయితే.. అవి నిర్వహించే ప్రాంతాల పక్కనే మీరు నివసిస్తున్నట్టయితే.. మీ కారును ఆ దుకాణాలకు దగ్గరగా అస్సలే ఉంచకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఆ దుకాణాల్లో పొరపాటున అగ్నిప్రమాదం చోటుచేసుకుంటే.. మీ కారు కూడా బూడిదయ్యే అవకాశం ఉంటుంది. అదే విధంగా.. పిల్లలు టపాసులు పేల్చే ప్రాంతానికి కూడా దూరంగా మీ కారును పార్క్ చేయాల్సిందే.

కవర్డ్ పార్కింగ్ :చాలా మంది తమ కార్లను షెడ్డులో పెడితే.. మరికొంతమంది ఓపెన్​ ప్లేస్​లలో పెడుతుంటారు. అయితే కారును పూర్తిగా కవర్​ చేసే షెడ్డు లాంటి ప్రాంతంలోనే పార్కింగ్ చేస్తున్నట్టైతే ఇబ్బంది లేదు. అలా కాకుండా.. ఓపెన్ ప్లేస్​లో పెడుతున్నట్టయితే.. వీధిలో ఉంచకుండా చూసుకోండి. దీపావళి ఒక్క రోజు ఇంటి రూఫ్​ కింద పెట్టే అవకాశం ఉంటే.. అక్కడ పార్క్ చేయండి. ఇలా చేస్తే మీ కార్​ సేఫ్​గా ఉంటుంది.

కారు పై కవర్ వేయకండి :కారును పార్క్ చేయగానే.. చాలా మంది దుమ్ము, ధూళి పడకుండా దాని పైన కవర్ కప్పుతారు. సాధారణ రోజుల్లో అది మంచి పద్ధతే. కానీ.. దివాళీ టపాసులు మోగే సమయంలో కవర్ కప్పకపోవడమే మంచిదట. నిప్పు రవ్వలు ఎగిరి వచ్చి కవర్​పై పడితే మంటలు వ్యాపించి కారు కాలిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే కారు కవర్లన్నీ దాదాపుగా మండే లక్షణాలనే కలిగి ఉంటాయి. ఈ విషయం గుర్తుంచుకోవాలి.

పెయిడ్ పార్కింగ్ : దీపావళి వేళ రెగ్యులర్ పార్కింగ్ స్థలం రిస్క్ స్పాట్​గా అనిపిస్తే.. మీ ఇంటి లోపల కావాల్సినంత స్థలం లేకపోతే.. ఈ పండగ రెండు రోజులు మీకు తెలిసిన వారి స్థలం సేఫ్​ అనుకుంటే.. అక్కడ పార్క్ చేయడం మంచిది. అలాంటి అవకాశం లేదు అనుకుంటే.. పెయిడ్ పార్కింగ్ ప్రాంతంలో పార్క్ చేయడం బెస్ట్​.

ఫొటోలు తీసుకోండి : మీ కారును బాణాసంచా పేలుస్తున్న ప్రాంతంలో పార్క్ చేయడం తప్ప మరో మార్గం లేకపోతే.. ఎక్కడైతే పార్క్ చేస్తారో ఆ ప్రదేశంలో కారు పార్క్ చేసిన తర్వాత మీ వాహనాన్ని కొన్ని ఫొటోలు తీసి ఉంచుకోండి. ఏదైనా అనుకోని సంఘటన జరిగితే.. మీరు ఈ ఫొటోల ద్వారా ఎక్కడ కారుకు డ్యామేజ్ జరిగిందో చూసుకొని.. ఇన్సూరెన్స్ క్లైమ్ చేసుకునే అవకాశం ఉంటుంది.

చిటికెలో పాత మట్టి ప్రమిదలను శుభ్రం చేయండి - దీపావళి రోజున కొత్త వాటిలా కనిపిస్తాయి!

దీపావళి ఒక్కరోజు కాదు ఐదు రోజుల పండగని మీకు తెలుసా? - ఆ విశేషాలు మీకోసం!

ఇత్తడి కుందులు నల్లగా మారాయా? - ఈ టిప్స్ పాటిస్తే దీపావళి వేళ బంగారంలా మెరుస్తాయి!

ABOUT THE AUTHOR

...view details