తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

హైట్​ తక్కువగా ఉన్నారా? - ఇలా చీర కట్టుకుంటే లుకింగ్​ గార్జియస్​ - పైగా ఎత్తు కనిపిస్తారట! - TIPS FOR SHORT GIRLS TO WEAR SAREES

-చీరతో మహిళల అందం రెట్టింపు -ఇలా చీర కట్టుకుంటే మంచి లుక్​

Best Tips to Wear saree for Short girl
Best Tips to Wear saree for Short girl (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Dec 5, 2024, 10:33 AM IST

Best Tips to Wear saree for Short girl: వేడుకలేవైనా చీరల్లో కుందనపు బొమ్మల్లా మెరిసిపోతుంటారు అమ్మాయిలు. చీర ఒద్దికగా కడితే బాపు బొమ్మల్లా తళుక్కుమంటారు. ఎందుకంటే చీర కట్టుకుంటే వచ్చే లుక్​ మరే ఇతర దుస్తులు ధరించినప్పుడు సాధ్యం కాదు. అందుకే హైట్​ ఎక్కువ ఉన్న అమ్మాయిలు ఎక్కువ శాతం చీరలు ధరించడానికి ఆసక్తి చూపిస్తుంటారు. కానీ ఎత్తు తక్కువగా ఉన్న స్త్రీలు చీర కట్టుకోవడానికి వెనకాడుతున్నారు. కారణం.. చీర ధరించడం వల్ల తమ ఎత్తు మరింత తక్కువగా కనిపిస్తుందని భావిస్తుంటారు. మరి మీరు కూడా హైట్​ తక్కువ ఉండి చీర కట్టుకోలేకపోతున్నారా? అయితే, మీకో గుడ్​న్యూస్​. ఈ చిట్కాలు ఫాలో అయితే చీర కట్టినప్పుడు పొడుగ్గా, నాజుగ్గా కనిపిస్తారని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఆ టిప్స్​ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

అది కీలకం: చీరకట్టినప్పుడు పొడుగ్గా కనిపించాలంటే చీరల ఎంపిక చాలా కీలకమంటున్నారు నిపుణులు. ముఖ్యంగా ఎత్తు తక్కువగా ఉన్న స్త్రీలు పెద్ద బార్డర్లు ఉన్న చీరలను ధరించడం మానుకోవాలని సూచిస్తున్నారు. ఎందుకంటే ఎక్కువ బార్డర్ ఉన్న చీరలు మీ ఎత్తును హైలెట్ చేస్తాయి. అందుకే ఎప్పుడూ చిన్న బార్డర్ ఉన్న చీరనే ధరించాలని.. సన్నని అంచులతో ఉన్న చీరలు పొడువుగా, నాజుగ్గా కనిపించేలా చేస్తాయంటున్నారు.

బ్లౌజ్ డిజైన్:చీర కట్టుకున్న తర్వాత పొడుగ్గా కనిపించాలంటే బ్లౌజ్ డిజైన్ ఎంపిక కూడా ముఖ్యమైనదని సలహా ఇస్తున్నారు. ఎత్తు తక్కువగా ఉన్నట్లయితే, నెక్లెస్ బ్లౌజ్ ధరించవద్దని సూచిస్తున్నారు. మీ కంఫర్ట్‌కి అనుగుణంగా V షేప్​ లేదా డీప్ నెక్ బ్లౌజ్‌ని ఎంపిక చేసుకుంటే బాగుంటుందని చెబుతున్నారు.

తేలికగా ఉండేలా: బనారసి సిల్క్, కంజీవరం సిల్క్, ఆర్ట్ సిల్క్, అస్సాం సిల్క్ చీరలన్నీ బరువుగా ఉంటాయి. ఈ బరువైన చీరలు ధరించడం వల్ల పొట్టిగా, లావుగా కనిపిస్తారని.. అందుకోసం తేలికపాటి పట్టు చీరల్ని ఎంపిక చేసుకోమంటున్నారు. ఈ చీరలు శరీరానికి దగ్గరగా అతుక్కొని.. మిమ్మల్ని సన్నగా, పొడుగ్గా ఉండేలా చూపిస్తాయంటున్నారు. ముఖ్యంగా షిఫాన్ లేదా జార్జెట్‌ చీరలను ధరిస్తే.. మీరు హైట్​ ఎక్కువగా కనిపిస్తారని అంటున్నారు.

అన్నీ చీరలే కదా.. ఏదైనా ఒకటే అనుకోవద్దు. కొన్ని చీరలు మీకు సెట్ కాకపోవచ్చు. చీరల్ని మన ఫిజిక్ ఆధారంగా ఎంచుకోవాలంటున్నారు. అంటే బరువు, ఎత్తును బట్టి వాటిని సెలక్ట్​ చేసుకోవాలి చెబుతున్నారు. అదే విధంగా.. పెట్టీ కోట్స్, లంగాలు కూడా చీరకు మ్యాచింగ్‌లో ఉండేలా చూసుకోవాలని.. ఇలా చేయడం వల్ల మీరు మరింత అందంగా కనిపిస్తారని అంటున్నారు. అలాగే, చీరలకు ఏ నగలు సెట్ అవుతాయో అవి ధరించడమే మంచిదంటున్నారు. అలాగే, చీర కలర్‌కి సూటయ్యే ఫుట్ వేర్, హెయిర్​ స్టైల్​ వేయాలని నిపుణులు చెబుతున్నారు.

నార్మల్ చీరతో డిజైనర్ లుక్ - ఈ టిప్స్​ పాటిస్తే మెరిసిపోతారంతే!

ఆ చీరలను ఎలా ఉతకాలో తెలుసా? - ఇలా చేస్తే మరకలు ఈజీగా పోతాయి!

అలర్ట్​: పట్టు చీరలను ఎండలో ఆరేస్తున్నారా? - ఏం జరుగుతుందో తెలుసుకోండి!

ABOUT THE AUTHOR

...view details