తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

డ్రాగన్ ఫ్రూట్స్ సంచుల నిండా కొనుక్కెళ్తున్నారు - సడన్​గా ఇంత క్రేజ్ ఎందుకు? - బెనిఫిట్స్ ఏంటి? - Dragon Fruit Health Benefits - DRAGON FRUIT HEALTH BENEFITS

Dragon Fruit Benefits : ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా డ్రాగన్​ ఫ్రూట్ కనిపిస్తోంది. పట్టణాలు, నగరాల్లో రోడ్డుపక్కనే తోపుడు బండ్లపై అమ్ముతున్నారు. చాలా మంది జనాలు కూడా వీటిని కొనుగోలు చేయడంతో డిమాండ్​ పెరిగిపోతోంది. మరి.. ఈ పండుకి ఇంత డిమాండ్ రావడానికి కారణమేంటి? దీనిని తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటి? మీకు తెలుసా?

Dragon Fruit Benefits
Dragon Fruit Benefits (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Aug 9, 2024, 3:15 PM IST

Benefits Of Dragon Fruit : మనం ఆరోగ్యంగా ఉండడానికి మంచి ఆహారం తీసుకోవాలి. అందులో తప్పకుండా వివిధ రకాల పండ్లు ఉండాలి. అప్పుడే.. వాటిల్లోని విటమిన్లు, ఖనిజాలు, పోషక పదార్థాలు మనల్ని వ్యాధుల బారిన పడకుండా రక్షిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. దీంతో.. పండ్లు తినేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అయితే.. వారిలో డ్రాగన్ ఫ్రూట్ తినేవారి సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఈ కారణంగానే.. ఒకప్పుడు విదేశాల్లో మాత్రమే పండే ఈ పండుని.. ఇప్పుడు మన దగ్గర కూడా విస్తారంగా పండిస్తున్నారు. పట్టణాలు, నగరాల్లో తోపుడు బండ్లపైనా విరివిగా అమ్ముతున్నారు. మరి.. ఈ ఫ్రూట్​కి ఇంత క్రేజ్​ రావడానికి కారణమేంటి? దీనివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటి అన్నది ఇప్పుడు చూద్దాం.

రక్తహీనత తగ్గుతుంది :
ప్రస్తుత కాలంలో చాలా మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. ముఖ్యంగా మహిళల్లో ఈ సమస్య అధికంగా కనిపిస్తుంటుంది. అయితే రోజూ కొన్ని ఈ పండు ముక్కలు తింటే రక్తహీనత సమస్య తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని పీచు, మాంసకృత్తులు, ఇనుము, జింక్, మెగ్నీషియం, ఫాస్ఫరస్‌ వంటి పోషకాలు ఆరోగ్యంగా ఉంచడంలో సహాయం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.

రోగనిరోధక శక్తిని పెంచుతుంది :
ఈ పండులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

గుండె ఆరోగ్యంగా :
డ్రాగన్​ ఫ్రూట్​లో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది. దీనిని తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. డ్రాగన్ ఫ్రూట్ హార్ట్​ హెల్త్​కి ఎంతో మేలు చేస్తుందని ఓ పరిశోధన తేల్చింది. "ఫుడ్ & ఫంక్షనల్ ఫుడ్స్" జర్నల్​లో ఈ పరిశోధన ప్రచురితమైంది. ఈ అధ్యయనం​లో వైద్యులు 'W. Zhou, Z. Y. Lin' పాల్గొన్నారు. ఈ పరిశోధనలో డ్రాగన్ ఫ్రూట్ గుండె ఆరోగ్యంగా ఉంచడంలో సహాయం చేస్తుందని తేల్చారు.

బరువు తగ్గుతారు :
ఈ రోజుల్లో ఎక్కువ మంది జనాలు ఊబకాయంతో బాధపడుతున్నారు. అయితే, వీరు బరువు తగ్గడానికి వ్యాయామాలు చేస్తూ.. ఈ పండు తినడం వల్ల వెయిట్​ లాస్​ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే డ్రాగన్ ఫ్రూట్ తక్కువ క్యాలరీలను కలిగి ఉంటుంది.

షుగర్ అదుపులో :
షుగర్​తో బాధపడేవారు ఈ పండుని డైట్లో భాగం చేసుకోవడం గ్లూకోజ్​ స్థాయులు అదుపులో ఉండేలా చూసుకోవచ్చు. ఈ పండు గ్లైసెమిక్​ ఇండెక్స్​ తక్కువగా ఉంటుంది. ఇది షుగర్​ అదుపులో ఉండేలా చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

క్యాన్సర్​ వ్యాధిని అడ్డుకుంటుంది :
ఈ ఫ్రూట్​లో ఉండే పిటయా అనే పోషక పదార్థం రోగనిరోధకతను పెంచుతుంది. ఇందులోని శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు శరీరానికి హాని చేసే ఫ్రీరాడికల్స్‌ని నాశనం చేసి క్యాన్సర్‌ వ్యాధి రాకుండా అడ్డుకుంటుందని నిపుణులు చెబుతున్నారు.

NOTE :ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

ఇవి కూడా చదవండి :

జామపండు Vs డ్రాగన్​ ఫ్రూట్ - విటమిన్​ పోటీలో విన్నర్​ ఎవరంటే!

డ్రాగన్​ ఫ్రూట్​ ఇలా ట్రై చేశారంటే.. మెరిసే అందం మీ సొంతం..!

ABOUT THE AUTHOR

...view details