తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

దీపావళి వేళ ఈ ఫేస్ ప్యాక్స్ ట్రై చేశారంటే - మీ ముఖం అందమైన దీపంలా మెరిసిపోతుందట! - TIPS TO LOOK GORGEOUS DURING DIWALI

పండగ వేళ అందంగా కనిపించేందుకు అద్భుతమైన టిప్స్ - బ్యూటీ పార్లర్ అవసరం లేకుండానే కాంతివంతంగా మెరిసిపోవచ్చు!

DIWALI BEAUTY TIPS
Tips to Look Gorgeous During Diwali (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Oct 30, 2024, 7:01 PM IST

Best Tips to Look Gorgeous During Diwali : పండగ, ఫంక్షన్, పార్టీ.. ఇలా అకేషన్ ఏదైనా అందంగా కనిపించాలనుకోవడం సహజం. అందులోనూ వెలుగుల పండగ దీపావళి అంటే అందరూ మరింత ప్రకాశవంతంగా మెరిసిపోవాలని కోరుకుంటారు. ఇంకెందుకు ఆలస్యం.. ఈ దివాళీ వేళ ఇంట్లో లభించే వస్తువులతో కొన్ని ఫేస్ ప్యాక్స్ ట్రై చేయండి. అలాగే, మేకప్విషయంలోనూ ఈ జాగ్రత్తలు తీసుకున్నారంటే అందరి చేత యూ ఆర్​ లుకింగ్​ బ్యూటీఫుల్​ అనిపించుకోవడం పక్కా అంటున్నారు సౌందర్య నిపుణులు. మరి, అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

అందంగా, ప్రకాశవంతంగా కనిపించాలంటే స్కిన్ మీద పేరుకుపోయే మృతకణాలను ఎప్పటికప్పుడు తొలగించుకుంటూ ఉండాలి. ఈ క్రమంలో ఫేషియల్ చేయించుకోవాలి. త్రెడింగ్ ద్వారా కనుబొమ్మల్ని కూడా షేప్ చేసుకోవాలి. అయితే, ఫెస్టివల్ ముందుగా ఎంత సన్నద్ధమైనా దివాళీ రోజు మరింత గ్లోయింగ్​ లుక్​తో కనిపించాలంటే ఈ నేచురల్ ఫేస్ ప్యాక్స్ వేసుకోవచ్చంటున్నారు నిపుణులు.

తేనె, నిమ్మరసంతో ఇలా చేయండి :

ఈ నేచురల్ ఫేస్​ ప్యాక్ చర్మాన్ని మెరిపించడానికి చాలా బాగా తోడ్పడుతుందంటున్నారు. ఇందుకోసం ఒక చిన్న బౌల్​లో తేనె, నిమ్మరసం సమపాళ్లలో తీసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆపై ముఖాన్ని శుభ్రంగా కడుక్కొని ఆ మిశ్రమాన్ని అప్లై చేసుకోవాలి. సుమారు 15 నుంచి 20 నిమిషాల పాటు ఆరనిచ్చి తర్వాత చల్లని వాటర్​తో శుభ్రం చేసుకుంటే సరి. నిమిషాల్లో మెరిసిపోయే చర్మం సొంతం చేసుకోవచ్చంటున్నారు.

టమాటాతో ముఖాన్ని మెరిపించండిలా!

వంటింట్లో ఉండే టమాటాని ఉపయోగించి కూడా కాంతివంతంగా మారిపోవచ్చంటున్నారు నిపుణులు. అందుకోసం ముందుగా టమటాని ముక్కలుగా కోసి దాని గుజ్జుతో ముఖమంతా రుద్దుకోవాలి. ఆపై పావుగంట పాటు ఆరనిచ్చి తర్వాత ఫేస్ వాష్ చేసుకుంటే సరిపోతుందంటున్నారు. ఇవేకాకుండా ఐస్‌క్యూబ్‌తో ముఖం రుద్దుకున్నా సరే.. చర్మాన్ని ప్రకాశవంతంగా మెరిపించుకోవచ్చంటున్నారు.

ఇలా మేకప్ వేసుకోండి!

  • ముందుగా మీ డ్రస్సింగ్ ఏ విధంగా ఉండాలనుకుంటున్నారో నిర్ణయించుకొని.. దాని ప్రకారం మేకప్ వేసుకోవడం స్టార్ట్ చేయాలి.
  • ఇందుకోసం ముందుగా ఫేస్ వాష్ చేసుకున్న వెంటనే పెదాలకు లిప్‌బామ్ అప్లై చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల పెదవులు పొడిబారకుండా తాజాగా కనిపిస్తాయి.
  • ఇప్పుడు మాయిశ్చరైజర్‌ని చర్మంలోకి ఇంకిపోయేలా స్మూత్​గా రుద్దాలి. ఆ తర్వాత ప్రైమర్ రాసి, స్కిన్ కలర్​కి సరిపడే ఫౌండేషన్‌ను అప్త్లె చేసుకోవాలి.
  • ఒకవేళ కళ్ల కిందడార్క్ సర్కిల్స్ఉంటే వాటిని కన్సీలర్‌తో కవర్ చేసుకోవాలి. ఆపై ముఖమంతా పౌడర్‌తో లైట్‌గా టచప్ ఇచ్చుకోవాలి.
  • ఇక మీకు లిప్‌స్టిక్ వాడే అలవాటు ఉంటే పెదాలకు నప్పే రంగు లిప్‌స్టిక్ వేసుకుంటే చాలు మంచి లుకింగ్ మీ సొంతమవుతుందంటున్నారు.
  • అలాగే.. మీరు ఎంచుకున్న డ్రస్సింగ్ ప్రకారం మీకు ఏ హెయిర్‌స్త్టెల్ నప్పుతుందో నిర్ణయించుకోవాలి. కావాలనుకుంటే హెయిర్ యాక్సెసరీస్ యూజ్ చేసి మరింత ఆకర్షణీయంగా రడీ అవ్వొచ్చని చెబుతున్నారు.

డ్రస్సింగ్ విషయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

  • దీపావళి సందర్భంగా కొందరు సంప్రదాయబద్ధంగా కనిపించడానికి ఇష్టపడితే, మరికొందరు ట్రెండీగా కనిపించాలని అనుకుంటారు.
  • అయితే, ఎలా కనిపించాలనుకున్నా సరే.. మీరు ఎంపిక చేసుకునే వస్త్రాలు మాత్రం సాధ్యమైనంత మేరకు కాటన్‌ దుస్తులు వేసుకోవడం మంచిదంటున్నారు.
  • ఎందుకంటే.. సిల్క్, పట్టు వస్త్రాలు ధరించి దీపాల మధ్య తిరగడం ప్రమాదకరం. కాబట్టి డ్రస్సింగ్ ఏదైనా సౌకర్యవంతంగా ఉండటానికే మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని సూచిస్తున్నారు సౌందర్య నిపుణులు.

ఇవీ చదవండి :

కాంతివంతమైన ఫేస్ కోసం 'కాఫీ స్క్రబ్'- ఇలా చేస్తే మీ ముఖం మెరిసిపోవడం ఖాయం!

ముల్తానీ మట్టి - ముఖాన్ని మాత్రమే కాదు జుట్టునూ మెరిపిస్తుంది! ఇలా వాడండి!

ABOUT THE AUTHOR

...view details