తెలంగాణ

telangana

By ETV Bharat Features Team

Published : 4 hours ago

ETV Bharat / offbeat

నోరూరించే క్రిస్పీ "ఆలూ కుర్​ కురే " - ఇంట్లోనే సింపుల్​గా ఇలా ప్రిపేర్ చేసుకోండి - పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు! - Aloo Kurkure Recipe

Crispy Aloo Kurkure Recipe : చిప్స్, కుర్​కురే కావాలంటూ.. పిల్లలు మాటిమాటికీ దుకాణం వైపు వేలు చూపిస్తుంటారు. అవి ఎంత హెల్దీనో తెలియదు. అందుకే.. ఈసారి ఈ క్రిస్పీ ఆలూ కుర్​ కురేలను మీ ఇంట్లోనే ప్రిపేర్ చేయండి. పిల్లలు వీటిని ఎంతో ఇష్టంగా తింటారు! మరి, వీటిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం.

How to Make Aloo Kurkure
Crispy Aloo Kurkure Recipe (ETV Bharat)

How to Make Aloo Kurkure in Telugu :ఆలూ క్రిస్పీ కుర్​ కురేలను.. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. వీటిని ఒకసారి ప్రిపేర్ చేసుకున్నారంటే.. వారం రోజులపాటు నిల్వ ఉంటాయి! మరి, వీటి తయారీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అన్నది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు :

  • బంగాళ దుంపలు - 1 కిలో
  • పచ్చిమిర్చి - 2
  • కొత్తిమీర తరుగు - 1 టేబుల్ స్పూన్
  • మిరియాల పొడి - అర టీస్పూన్
  • గరం మసాలా - అర టీస్పూన్
  • చాట్ మసాలా - 1 టీస్పూన్
  • కారం - ఒకటిన్నర టీస్పూన్
  • వేయించిన జీలకర్ర పొడి - అర టీస్పూన్
  • ఉప్పు - రుచికి తగినంత
  • బియ్యప్పిండి - 2 టీస్పూన్లు
  • కార్న్ ఫ్లోర్ - 2 టీస్పూన్లు
  • నూనె - వేయించడానికి తగినంత

తయారీ విధానం :

  • ఇందుకోసం ముందుగా కాస్త పెద్ద సైజ్​లో ఉండే బంగాళదుంపలను ఎంచుకోవాలి. ఆపై వాటిని పొట్టు తీసి 15 నిమిషాల పాటు ఉప్పు నీటిలో నానబెట్టుకోవాలి.
  • 15 నిమిషాల తర్వాత వాటిని కాస్త మందంగా ఉండేలా నిలువుగా స్లైసెస్​గా కట్ చేసుకోవాలి.
  • తర్వాత ఆ స్లైసెస్​ను ఒక దానిపై మరొకటి ఉంచి పొడుగ్గా స్ట్రిప్స్ మాదిరిగా కట్ చేసుకోవాలి. అలా అన్నింటినీ ఒకే సైజ్​లో స్ట్రిప్స్​ షేప్​లో కట్ చేసుకొని ఒక బౌల్​లోకి తీసుకోవాలి.
  • అనంతరం వాటిని కనీసం 3 నుంచి 4 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. దీని వల్ల ఆలూ ముక్కల్లో ఉండే స్టార్చ్ అంతా పోయి క్రిస్పీగా వస్తాయి.
  • ఆ తర్వాత ఆలూ ముక్కలను వడకట్టుకొని ఒక మిక్సింగ్ బౌల్​లోకి తీసుకోవాలి. ఆపై అందులో సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి, కొత్తిమీర తరుగు, మిరియాల పొడి, గరం మసాలా, అర టీస్పూన్ చాట్ మసాలా, ఒక టీస్పూన్ కారం, వేయించిన జీలకర్ర పొడి, ఉప్పు, బియ్యప్పిండి, కార్న్ ఫ్లోర్.. ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని ఇంగ్రీడియంట్స్ అన్నీ ఆలూ ముక్కలకు పట్టేలా బాగా కోట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు స్టౌపై పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె కాస్త వేడెక్కాక.. ఆలూ ముక్కులను వేసి మంటను హై-ఫ్లేమ్​లో ఉంచి వేయించుకోవాలి.
  • ముందుగా రెండు నిమిషాలు అలా వదిలేసి తర్వాత గరిటెతో కలుపుతూ అవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి.
  • ఆ తర్వాత వాటిని ఒక ఫ్లేట్​లోకి తీసుకొని వాటిపై అర టీస్పూన్ చొప్పున కారం, చాట్ మసాలా చల్లుకొని గాలికి పెట్టుకోవాలి.
  • అవి పూర్తిగా చల్లారాక బాగా కోట్ చేసుకొని డబ్బాలో పెట్టుకుంటే చాలు. అంతే.. ఎంతో టేస్టీగా, క్రిస్పీగా ఉండే "ఆలూ కుర్​ కురే" రెడీ!

ABOUT THE AUTHOR

...view details