తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

మొటిమలు, మచ్చలకు చెరకు రసంతో చెక్! చర్మం కాంతివంతం అవుతుందట! - SUGAR CANE JUICE BENEFITS FOR SKIN

-చెరకు రసంతో చర్మం, వెంట్రుకల ఆరోగ్యం మెరుగు! -వాటితో కలిపి పెట్టుకుంటే ఫేస్ మెరుస్తుందని సూచన

Sugar Cane Juice Benefits for Skin
Sugar Cane Juice Benefits for Skin (Getty Images)

By ETV Bharat Lifestyle Team

Published : Jan 9, 2025, 11:33 AM IST

Sugar Cane Juice Benefits for Skin:రుచితో పాటు పోషకాలూ నిండి ఉన్న చెరకు రసం అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా ఎండాకాలంలో చెరకు రసాన్ని విపరీతంగా తాగుతుంటారు. అయితే, చెరకు రసంతో కేవలం ఆరోగ్యానికే కాకుండా.. అందానికి, కేశ సౌందర్యానికి కూడా మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

  • చర్మకాంతికి చెరకు రసం ఎంతగానో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం చెరకు రసంలో కొద్దిగా ముల్తానీ మట్టిని కలిపి పేస్ట్‌లా చేసుకుని ముఖానికి పట్టిస్తే చర్మంపై ఉన్న నల్లమచ్చలు తొలగిపోతాయని అంటున్నారు. ఇంకా ఇందులో ఉండే సమ్మేళనాలు చర్మకణాలను పునరుత్తేజితం చేస్తాయని వివరిస్తున్నారు.
  • చెరకు రసంలో కొద్దిగా తేనెను కలిపి ఈ మిశ్రమంతో పావుగంట పాటు చర్మానికి మర్దన చేయాలని నిపుణులు చెబుతున్నారు. ఆ తర్వాత ఇరవై నిమిషాల పాటు ఉంచి కడిగేయాలని సూచిస్తున్నారు. ఇలా వారానికి రెండుసార్లు చేయడం వల్ల చర్మం మృదువుగా మారుతుందని వివరిస్తున్నారు.
  • ఇంకా కాఫీపొడికి కాస్త చెరకురసాన్ని చేర్చి స్క్రబ్‌లా ఉపయోగిస్తే చర్మం కాంతులీనుతుందని చెబుతున్నారు.
  • చెరకు రసం, నిమ్మరసం, యాపిల్ జ్యూస్, ద్రాక్ష రసం, కొబ్బరి పాలు.. వీటన్నింటినీ సమపాళ్లలో తీసుకొని బాగా కలపి చర్మానికి పట్టించాలట. ఇలా చేయడం వల్ల చర్మంపై ఉన్న మొటిమలు, మచ్చలు తొలగిపోయి మెరుపు వస్తుందని నిపుణులు అంటున్నారు.
  • ఇంకా చర్మాన్ని యవ్వనంగా, బిగుతుగా ఉంచడానికి మామూలు ఐస్‌క్యూబ్‌ల కన్నా చెరకు రసంతో తయారు చేసుకున్న ఐస్ క్యూబ్‌లను వాడితే రెట్టింపు ఫలితాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు. 2019లో Journal of Cosmetics, Dermatological Sciences and Applicationsలో Sugarcane juice as a natural remedy for skin hydration and elasticity అనే అధ్యనంలోనూ ఈ విషయం తేలింది. (రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
  • బొప్పాయి గుజ్జులో చెరకు రసాన్ని కలిపి పట్టించడం వల్ల చర్మం బిగుతుగా మారుతుందని నిపుణులు అంటున్నారు.
  • ఇంకా నాలుగు చెంచాల చెరకు రసంలో రెండు చెంచాల నెయ్యి చేర్చి చర్మానికి మర్దన చేస్తే ఎండ వల్ల కమిలిన చర్మం తిరిగి కొత్త నిగారింపును సంతరించుకుంటుందని అంటున్నారు.
  • లీటరు నీటిలో గుప్పెడు పుదీనా ఆకులు, పావు లీటరు చెరకు రసం కలిపి, మరిగించి ఆవిరి పట్టుకుంటే చర్మం తేటగా తయారవుతుందని నిపుణులు అంటున్నారు.
  • ఇవే కాకుండా ఎటువంటి పదార్థాలూ కలపకుండానే స్వచ్ఛమైన చెరకు రసాన్ని ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు చర్మానికి పట్టిస్తే చర్మం ఆరోగ్యంగా, మృదువుగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు.
  • చర్మానికే కాకుండా జుట్టు రక్షణకు కూడా చెరకు రసం ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. చెరకు రసాన్ని కుదుళ్లకు పట్టించి గంట తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేస్తే పొడిబారిన జుట్టు తిరిగి పట్టులా మెరుస్తుందని అంటున్నారు. ఇంకా చెరకు రసం జుట్టుకు సహజసిద్ధమైన కండిషనర్‌గా ఉపయోగపడుతుందని వివరిస్తున్నారు.

NOTE :ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

ABOUT THE AUTHOR

...view details