ETV Bharat / lifestyle

అన్నంతో అదిరిపోయే 'చిట్టి ఉల్లిపాయ పులుసు'- కూరగాయలు లేనప్పుడు ఈజీగా చేసుకోవచ్చు! - CHITTI ULLIPAYA PULUSU IN TELUGU

-ఆనియన్స్​తో అద్భుతమైన పులుసు -నిమిషాల్లో చేసుకునే సూపర్ రెసిపీ!

Chitti Ullipaya Pulusu Recipe
Chitti Ullipaya Pulusu Recipe (ETV Bharat)
author img

By ETV Bharat Lifestyle Team

Published : Jan 23, 2025, 3:34 PM IST

Chitti Ullipaya Pulusu Recipe: ఇంట్లో కూరగాయలు లేవు.. ఏం వండాలని ఆలోచిస్తున్నారా? అయితే, చిక్కని, కమ్మని చిట్టి ఉల్లిపాయ పులుసు ట్రై చేయండి. ఈ పులుసును వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే అద్భుతంగా ఉంటుంది. ఇంకా అట్టు, ఇడ్లీ, గారెలతో కూడా సూపర్​గా ఉంటుంది. దీనిని ఫ్రిజ్​లో పెట్టుకుంటే సుమారు 2 రోజులు నిల్వ ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం.. ఇందులోకి కావాల్సిన పదార్థాలు ఏంటి? తయారీ విధానం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు

  • 2 టేబుల్ స్పూన్ల నూనె
  • పావు టీ స్పూన్ మెంతులు
  • ఒకటింపావు టేబుల్ స్పూన్ ధనియాలు
  • 10 ఎండు మిరపకాయలు
  • 12-15 జీడి పప్పు లేదా పుట్నాల పప్పు
  • అర టీ స్పూన్ జీలకర్ర
  • పావు కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు
  • 2 టమాటా ముక్కలు
  • పావు కప్పు చింతపండు రసం

పులుసు కోసం కావాల్సిన పదార్థాలు

  • 3 టేబుల్ స్పూన్ల నూనె
  • 12-15 చిన్న ఉల్లిపాయలు
  • 12-15 వెల్లుల్లి
  • అర టీ స్పూన్ ఆవాలు
  • అర కప్పు ఉల్లిపాయ ముక్కలు
  • 2 పచ్చి మిరపకాయలు
  • 2 రెబ్బల కరివేపాకు
  • 2 ఇంచుల ఇంగువా
  • 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్
  • పావు టీ స్పూన్ పసుపు
  • ఒక టీ స్పూన్ కారం
  • రుచికి సరిపడా కారం
  • ఒక లీటర్ నీరు
  • 2 టేబుల్ స్పూన్ల బెల్లం
  • కొద్దిగా కొత్తిమీర

తయారీ విధానం

  • ముందుగా స్టౌ ఆన్ చేసి ఓ గిన్నెలో నూనె వేడి చేసుకుని అందులో మెంతులు, ధనియాలు, ఎండు మిర్చి వేసి కాసేపు వేయించుకోవాలి.
  • ఆ తర్వాత జీడిపప్పు, జీలకర్ర వేసి వేయించుకుని.. పచ్చి కొబ్బరి, టమాటా ముక్కలు వేసి మగ్గించుకోవాలి.
  • సుమారు 15 నిమిషాల తర్వాత టమాటా మగ్గాక.. దీనిని మిక్సీలో వేసుకోవాలి. ఇందులోనే చింతపండు పులుసు తీసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
  • మరోవైపు అదే కడాయిలో నూనె వేడి చేసి ఉల్లిపాయలు వేసి మీడియం ఫ్లేమ్​లో 60శాతం వరకు వేయించుకోవాలి.
  • ఆ తర్వాత వీటిని పక్కకు పెట్టుకుని.. మిగిలిన నూనెలో వెల్లుల్లి, ఆవాలు వేసి చిటపటమనిపించాలి.
  • అనంతరం ఉల్లిపాయ తరుగు, కరివేపాకు, పచ్చి మిర్చి వేసి వేయించుకోవాలి. (మీకు నచ్చితే ఇంగువా వేసుకోవచ్చు)
  • ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ఉప్పు వేసి వేయించుకోవాలి.
  • ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని వేసి రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత లీటర్ నీళ్లు పోసి హై ఫ్లేమ్​లో మరిగించుకోవాలి.
  • అనంతరం వేయించుకున్న ఉల్లిపాయలు, బెల్లం, కొత్తిమీర వేసి కలిపి మూత పెట్టి 18 నిమిషాలు పాటు మగ్గించుకోవాలి.(మధ్య మధ్యలో కలపాలి. లేకపోతే అడుగు అటుంకుపోతుంది)
  • చివర్లో ఇంకా కొద్దిగా కొత్తి మీర వేసి గార్నిష్ చేసుకుని దించేసుకుంటే సరిపోతుంది.

ఈ టిప్స్ పాటిస్తే బిర్యానీ టేస్ట్ అద్దిరిపోతుంది! హోటల్ స్టైల్​లో రావాలంటే ఎలా చేయాలో తెలుసా?

ఆరోగ్యానిచ్చే తీయటి 'మిల్లెట్స్ లడ్డు'- చిరు ధాన్యాలు తినలేకపోయేవారికి బెస్ట్ ఆప్షన్!!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.