తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

ఆదివారం అద్దిరిపోయే మటన్ కుర్మా- ఇలా చేస్తే ఎవరైనా ఇష్టంగా తినేస్తారు! మీరు ట్రై చేయండి!! - HOW TO MAKE MUTTON KORMA

-సండే మటన్ వండాలని అనుకుంటున్నారా? -ఎప్పుడూ రొటీన్​గా కాకుండా ఈ కుర్మా ట్రై చేయండి!

mutton korma recipe in telugu
mutton korma recipe in telugu (ETV Bharat)

By ETV Bharat Lifestyle Team

Published : Feb 1, 2025, 5:30 PM IST

Mutton Korma Recipe in Telugu:ఆదివారం వచ్చిందంటే మెజార్టీ పీపుల్​ ఇంట్లో నాన్​వెజ్ ఉడకాల్సిందే. ఇక నాన్​వెజ్​లో మటన్​కు సెపరేట్​ ఫ్యాన్​ బేస్​ ఉంటుంది. ధర ఎక్కువైన సరే వారానికి ఒకసారి అయినా మటన్ తినాల్సిందే. ఇక మటన్​తో బిర్యానీ, కర్రీ, వేపుడు అంటూ రకరకాలు చేసుకుని తింటుంటారు. అయితే ఎప్పుడూ ఒకటే రకమైతే బోర్​ కొడుతుంది. అందుకే ఒకసారి వెరైటీగా మటన్ కుర్మా చేసుకుని తినండి. చాలా రుచిగా ఉంటుంది. దీనిని అన్నం, బిర్యానీ, చపాతీ ఇలా దేనితో తిన్నా సూపర్​ టేస్టీగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ కుర్మాకు కావాల్సిన పదార్థాలు? తయారీ విధానం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

కావాల్సిన పదార్ధాలు

  • ఒక కిలో మటన్
  • ఒక టీ స్పూన్ పసుపు
  • 2 టీ స్పూన్ల కారం
  • ఒక టీ స్పూన్ ఉప్పు
  • 2 టేబుల్ స్పూన్ల వేపిన శనగపప్పు
  • 1 టీ స్పూన్ సోంపు గింజలు
  • 2 టీ స్పూన్ల గసగసాలు
  • 6 జీడిపప్పులు
  • పావు కప్పు పచ్చి కొబ్బరి
  • 4 టేబుల్ స్పూన్ల నూనె
  • ఒక బిర్యానీ ఆకు
  • 4 దాల్చిన చెక్క ముక్కలు
  • 5 లవంగాలు
  • 2 యాలకులు
  • ఒక అనాస పువ్వు
  • ఒక మరాఠి మొగ్గ
  • ఒక రాతి పువ్వు
  • ఒక జాపత్రి
  • 3 తరిగిన ఉల్లిపాయలు
  • 5 పచ్చిమిరపకాయలు
  • 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్
  • 3 తరిగిన టమాటాలు
  • 1 టీ స్పూన్ కల్లుప్పు
  • 2 టీ స్పూన్ల ధనియాలపొడి
  • 2 రెబ్బల కరివేపాకులు
  • తరిగిన కొత్తిమీర

తయారీ విధానం

  • ముందుగా మటన్​ను తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. అందులోనే పసుపు, కారం, ఉప్పు వేసి బాగా కలిపి మారినెట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
  • తర్వాత ఒక గిన్నెలో వేపిన శనగపప్పు, సోంపు గింజలు, గసగసాలు, జీడిపప్పులు కొద్దిగా నీళ్లు పోసి పది నిముషాలు నానపెట్టుకోవాలి.
  • అనంతరం మిక్సీ జార్​లో నానపెట్టుకున్న పదార్ధాలు, పచ్చి కొబ్బరి ముక్కలు కొద్దిగా నీళ్లు పోసి మెత్తని పేస్టులా చేసుకొని పక్కనపెట్టుకోవాలి.
  • ఇప్పుడు స్టౌ ఆన్ చేసి కుక్కర్​లో నూనె పోసి వేడి చేసుకోవాలి.
  • ఆ తర్వాత బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క ముక్కలు, లవంగాలు, యాలకులు, అనాస పువ్వు, మరాఠి మొగ్గ, రాతి పువ్వు, జాపత్రి వేసి వేయించుకోవాలి.
  • ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చి మిరపకాయలు వేసి ఉల్లిపాయలు బంగారు రంగులో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి.
  • ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కాసేపయ్యాక టమాటా ముక్కలు వేసి ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి.
  • అనంతరం మారినాట్ చేసుకున్న మటన్ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి.
  • ఇప్పుడు ఇందులో కల్లుప్పు, ధనియాలపొడి, కరివేపాకులు వేసి కలిపి 5 నిమిషాల తర్వాత అర కప్పు నీళ్లు పోసి కలిపి మూత పెట్టి ఐదు విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్​లో ఉడికించుకోవాలి.
  • ఆ తర్వాత స్టౌ ఆఫ్ చేసుకొని ప్రెషర్ పూర్తిగా పోయేంతవరకు పక్కనపెట్టుకోవాలి.
  • కుక్కర్ ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి స్టౌ ఆన్ చేసి ముందుగా రుబ్బుకున్న మసాలా పేస్ట్ వేసి కలిపి మరో 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్​లో ఉడికించుకోవాలి.
  • ఇక చివర్లో కొత్తిమీర, కరివేపాకు వేసి కలిపి దించేసుకుంటే ఎంతో టేస్టీ హోటల్ స్టైల్ మటన్ కుర్మా రెడీ

దూదిలాంటి మెత్తటి 'స్పాంజ్ సెట్ దోశ'- రొటీన్​గా కాకుండా ఇలా ఈజీ​గా చేసుకోండి! టేస్ట్ అదుర్స్!!

నూనె లేకుండానే టేస్టీ 'చిల్లీ చికెన్'- ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్​లో చేసుకోవచ్చు!

ABOUT THE AUTHOR

...view details