తెలంగాణ

telangana

ETV Bharat / international

'ఉక్రెయిన్​ సరిహద్దుల్లో 8వేల మంది కిమ్​ సేనాలు- యుద్ధంలో పాల్గొనేందుకే!' - NORTH KOREAN TROOPS IN RUSSIA

ఉక్రెయిన్‌ సరిహద్దు ప్రాంతాల్లో దాదాపు 8 వేల మంది ఉత్తర కొరియా సైనికులు

North Korean Troops In Russia
North Korean Troops In Russia (Associated Press)

By ETV Bharat Telugu Team

Published : Nov 1, 2024, 7:52 AM IST

North Korean Troops In Russia : ఉక్రెయిన్‌ సరిహద్దు ప్రాంతాల్లో దాదాపు 8 వేల మంది ఉత్తర కొరియా సైనికులు ఉన్నట్లు అమెరికా తెలిపింది. వారంతా రానున్న రోజుల్లో రష్యాకు మద్దతుగా యుద్ధంలో పాల్గొంటారని ఆరోపించింది. ఈ నేపథ్యంలో ఉత్తర కొరియా బలగాలు ఒకటి, రెండుసార్లు ఆలోచించి బరిలోకి దిగాలంటూ అమెరికా సూచించింది.

రష్యాలో దాదాపు 10 వేల మంది ఉత్తర కొరియా సైనికులు ఉన్నట్లు తాము అంచనా వేస్తున్నట్లు అమెరికా డిఫెన్స్ సెక్రటరీ లాయిడ్ ఆస్టిన్ తెలిపారు. 'వారిలో 8వేల మంది సైనికులను ఉక్రెయిన్ సరిహద్దుల్లోని కుర్స్క్​ సరిహద్దుల్లో మోహరించారు. అయితే వాళ్లకు ఉక్రెయిన్​పై యుద్ధం కోసమేనా లేదా అనేది మేము చూడలేదు. కానీ రానున్న రోజుల్లో రష్యాకు మద్దతుగా యుద్ధంలో పాల్గొంటానికే అని మేం భావిస్తున్నాం' అని పేర్కొన్నారు.

ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలి
మరోవైపు ఉత్తర కొరియా బలగాలకు అమెరికా తీవ్ర హెచ్చరికలు చేసింది. రష్యాకు మద్దతుగా ఉత్తర కొరియా దళాలు ఉక్రెయిన్‌లోకి ప్రవేశించినట్లయితే వారి బాడీలు బ్యాగ్‌లలో తిరిగివెళ్తాయని తీవ్రంగా హెచ్చరించింది.అందుకే బరిలోకి దిగే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలని తెలిపింది. అటు మాస్కోకు ఉత్తర కొరియా బలగాలు పంపడంపై ఐరాసలో మాటల యుద్ధం నడిచింది. పాశ్చాత్య దేశాలు కీవ్‌కు సాయం అందిస్తున్నప్పుడు మాస్కోకు ఉత్తరకొరియా వంటి మిత్రదేశాలు సహాయం అందించకూడదా అని ఐక్యరాజ్యసమితిలో రష్యా రాయబారి వాసిలీ నెబెంజియా ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన కీవ్‌ ఐరాస రాయబారి సెర్గీ కిస్లిట్యా ఉక్రెయిన్‌కు సహాయం అందించే దేశాలు భద్రతామండలి ఆంక్షలను ఉల్లంఘించలేదన్నారు.

ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణులను పరీక్షించిన ఉత్తర కొరియా!
ఇదిలా ఉండగా ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణులను పరీక్షించినట్లు స్యయంగా ఉత్తర కొరియా ధ్రువీకరించింది. ఈమేరకు ఆ దేశ అధికారిక మీడియా సంస్థ వెల్లడించింది. ఈ పరీక్షలు ఉత్తరకొరియా అధినేత కిమ్‌జోంగ్‌ ఉన్‌ ఆదేశాల మేరకే జరిగినట్లు తెలిపింది. మునపటి ప్రయోగాల రికార్డును ఈక్షిపణులు బద్దలు కొట్టాయి. క్షిపణుల ప్రయోగాన్ని కిమ్‌ స్వయంగా వీక్షించారు. దేశ భద్రతకు ముప్పు కలిగించే శత్రువుల ఎత్తుగడలకు ప్రతిస్పందించడానికి ఈ ప్రయోగం సరైన సైనిక చర్యగా కిమ్‌ పేర్కొన్నారు. ఉత్తర కొరియా తూర్పు తీరం సముద్రంలోకి ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణులను పరీక్షించినట్లు అమెరికా, జపాన్‌, దక్షిణకొరియా ధ్రువీకరించాయి. ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులకు కారణమైన ఉత్తరకొరియా చర్యను తీవ్రంగా ఖండించాయి.

ABOUT THE AUTHOR

...view details