తెలంగాణ

telangana

ETV Bharat / international

నాటోలో చేరిన స్వీడన్- దశాబ్దాల తటస్థ వైఖరికి తెర - Sweden Joins NATO

Sweden Joins NATO : పశ్చిమ దేశాల సైనిక కూటమి( నాటో)లో స్వీడన్ గురువారం అధికారికంగా చేరింది. ఈ కూటమిలో ఇది 32వ సభ్య దేశం. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత నుంచి స్వీడన్ తటస్థంగా ఉంటూ వచ్చింది.

Sweden Joins NATO
Sweden Joins NATO

By ETV Bharat Telugu Team

Published : Mar 8, 2024, 8:12 AM IST

Sweden Joins NATO : పశ్చిమ దేశాల సైనిక కూటమి (నాటో)లో 32వ సభ్యదేశంగా స్వీడన్‌ అధికారికంగా చేరింది. స్వీడన్ ప్రధాని ఉల్ఫ్ క్రిస్టర్‌సన్, అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌లు ఒక కార్యక్రమంలో ఈ మేరకు అధికారిక పత్రాన్ని మార్చుకున్నారు. దీని వల్ల రెండో ప్రపంచ యుద్ధం తర్వాత దశాబ్దాల పాటు కొనసాగించిన తటస్థ వైఖరికి స్వీడన్‌ వీడ్కోలు పలికినట్లయ్యింది.

2022లో ఉక్రెయిన్‌పై రష్యా దాడి పరిణామాలతో 'నాటో'లో చేరిక దిశగా స్వీడన్‌ ముందడుగు వేసింది. ఈ దేశం చేరికపై తుర్కియే, హంగరీలు పలుమార్లు అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ ఎట్టకేలకు మార్గం సుగమమైంది. 'నాటో'లో సభ్యదేశంగా స్వీడన్ ఉండటం అమెరికా, దాని మిత్రపక్షాలను భద్రతాపరంగా మరింత సురక్షితం చేస్తుందని శ్వేతసౌధం పేర్కొంది. ఇప్పటి నుంచి తమ దేశం సురక్షితంగా ఉంటుందని స్వీడన్ ప్రధాని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు.

అభ్యంతరాలు వ్యక్తం చేసిన టర్కీ, హంగరీ
తీవ్రవాదులుగా పరిగణించే కుర్దిష్ గ్రూపులకు స్వీడన్ ఆశ్రయం కల్పిస్తుంది అని టర్కీ ఆందోళ వ్యక్తం చేస్తూ వచ్చింది. మరోవైపు హంగేరి అధ్యక్షుడు విక్టర్ ఓర్బన్ ఇప్పటి దాకా రష్యా అనుకూల భావాన్ని ప్రదర్శించారు, ఉక్రెయిన్​కు మద్దతు ఇవ్వాలనే కూటమి సంకల్పానికి వ్యతిరేకరంగా వ్యవహరించారు. ఈ సంవత్సరం ప్రారంభంలో స్వీడన్ ప్రవేశాన్ని టర్కీ ఆమోదించింది. హంగేరి ఈ వారంలో ఆమోదించింది. దీంతో 32వ సభ్య దేశంగా స్వీడన్ 'నాటో'లో చేరింది.

రష్యా విస్తరణను అడ్డుకోవటం కోసమే
నార్త్‌ అట్లాంటిక్‌ ట్రిటీ ఆర్గనైజేషన్‌ (నాటో) అనేది ఒక సైనిక కూటమి. 1949లో అమెరికా, కెనడా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌ సహా 12 దేశాలతో ఏర్పాటైంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఐరోపాలో రష్యా విస్తరణను అడ్డుకోవాలన్న లక్ష్యంతో 'నాటో' రూపుదాల్చింది. ఈ కూటమిలోని సభ్య దేశాలపై ఇతర దేశాలు యుద్ధానికి దిగితే ఒకరికొకరు అండగా నిలవడం, సైనిక సహకారం అందించుకోవాలని నిర్ణయించాయి. ఒక దేశం నాటోలో చేరాలనుకుంటే ముందుగా కూటమిలోని అన్ని సభ్యత్వ దేశాలు దానికి అంగీకరించాల్సి ఉంటుంది.

ఎన్నికల బరి నుంచి నిక్కీ హేలీ ఔట్- అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా ట్రంప్​

విమానంలో గర్భిణికి డెలివరీ చేసిన పైలట్​- తల్లీబిడ్డ సేఫ్​

ABOUT THE AUTHOR

...view details