తన గెలుపపై దిసనాయకే స్పందించారు. "మనందరి శతాబ్దాల కల ఎట్టకేలకు సాకారమవుతోంది. ఈ విజయం ఏ ఒక్కరి కష్టం కాదు, వందల వేల మంది సమష్టి కృషి. ఈ విజయం మనందరిది. ఎందరో కన్నీళ్లు, ప్రాణ త్యాగాలతో మన ప్రయాణం సాగింది. వాళ్ల త్యాగాలు ఎప్పటికీ మరువలేనివి. లక్షలాది కళ్లు ఎన్నో ఆశలతో నిండిపోయాయి. శ్రీలంక చరిత్రను తిరగరాయడానికి మేం సిద్ధంగా ఉన్నాం" అని ఎన్పీపీ నాయకుడు అనుర కుమార దిసానాయకే సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
శ్రీలంక అధ్యక్షుడిగా అనుర కుమార దిసనాయకే విజయం - sri lanka election results - SRI LANKA ELECTION RESULTS
Published : Sep 22, 2024, 2:58 PM IST
|Updated : Sep 22, 2024, 8:23 PM IST
Sri Lanka Presidential Election 2024 Results Live Updates :మార్క్సిస్ట్ నేత అనుర కుమార దిససాయకే(56) శ్రీలంక నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. శ్రీలకం ఎన్నికల కమిషన్ దిసనాయకేను విజేతగా ప్రకటించింది. సోమవారం శ్రీలంక 9వ అధ్యక్షుడిగా దిసనాయకే ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
LIVE FEED
'దశాబ్దాల కల సాకారమవుతోంది'
శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా అనుర కుమార దిసనాయకే
మార్క్సిస్ట్ నేత అనుర కుమార దిససాయకే(56) శ్రీలంక నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఆదివారం వెలువడిన ఫలితాల్లో తన ప్రత్యర్థులు ప్రేమదాస, ప్రస్తుత అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘేను వెనక్కు నెట్టారు. శ్రీలకం ఎన్నికల కమిషన్ దిసనాయకేను విజేతగా ప్రకటించింది. సోమవారం శ్రీలంక 9వ అధ్యక్షుడిగా దిసనాయకే ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ఆదివారం మధ్యాహ్నం వరకు జరిగిన ఫస్ట్ రౌండ్ కౌంటింగ్లో ఏ అభ్యర్థికీ మెజారిటీ ఓట్లు రాలేదు. దీంతో శ్రీలంక ఎన్నికల చరిత్రలో తొలిసారి కౌంటింగ్ రెండో రౌండ్లోకి చేరింది. విజేతగా ప్రకటించాలంటే అభ్యర్థికి 50శాతం కన్నా ఎక్కువ ఓట్లు రావాలి.
శ్రీలంక రేసు నుంచి రణిల్ విక్రమ సింఘే ఔట్
శ్రీలంక అధ్యక్ష ఎన్నికల రెండో రౌండ్ కౌంటింగ్ కొనసాగుతోంది. ప్రస్తుత అధ్యక్షుడు రణిల్ విక్రమ సింఘే రేసు నుంచి ఔట్ అయ్యారు!. ఫస్ట్ రౌండ్ సింఘేకు 17.27శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. 42.31శాతం ఓట్లతో ఎన్పీపీ అభ్యర్థి అరుణ కుమార దిసనాయకే ముందంజలో ఉన్నారు. 32.8శాతం ఓట్లతో రెండో స్థానంలో ఎస్జీబీ అభ్యర్థి సజిత్ ప్రేమదాస ఉన్నారు.