Vodafone Idea 5G Services: జియో, ఎయిర్‌టెల్ సంస్థలకు షాకింగ్ న్యూస్. ఎట్టకేలకూ ఈ కంపెనీలకు పోటీగా వొడాఫోన్-ఐడియా కూడా తన 5G బ్రాడ్‌బ్యాండ్ సేవలు తీసుకొచ్చేందుకు రెడీ అయింది. ఈ మేరకు ఈ ఏడాది మార్చిలో 5G సేవల్ని తీసుకొస్తున్నట్లు సంస్థకు చెందిన ఓ ప్రతినిధి వెల్లడించారు. మెరుగైన నెట్వర్క్ ఎక్స్‌పీరియన్స్‌తో పాటు తక్కువ ధరలోనే ఈ సేవలు అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది.
ఇక మన దేశంలో జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్-ఐడియా మూడూ అతి పెద్ద ప్రైవేట్ టెలికాం కంపెనీలు. వీటిలో మొదటి నుంచి నెలకొన్న త్రిముఖ పోరులో వొడాఫోన్ ఐడియా అంతంతమాత్రంగానే ఉంది. ప్రస్తుతం దీని యూజర్ బేస్ బాగా తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో వొడాఫోన్-ఐడియా తన స్థానాన్ని నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో జియో, ఎయిర్‌టెల్ తమ 5G సేవలను విస్తరించాయి.
దీంతో 5G రూపంలో వొడాఫోన్-ఐడియాకు గట్టి సవాలే ఎదురైందని చెప్పొచ్చు. 5G స్పెక్ట్రమ్‌ను దక్కించుకున్న ఈ సంస్థ నిధుల కొరత కారణంగా 5Gని విస్తరించడంలో ఆలస్యం చేసింది. అదే సమయంలో జియో, ఎయిర్‌టెల్ 5G సేవల్ని వేగంగా విస్తరించి మరింతమంది వినియోగదారులను ఆకర్షించాయి. దీంతో వొడాఫోన్-ఐడియా పెద్దసంఖ్యలో యూజర్లను కోల్పోయింది. అయితే ఇప్పుడు కాస్త ఆలస్యంగానైనా వీఐ(వొడాఫోన్-ఐడియా) 5G సేవల్ని తీసుకొచ్చి తన ఉనికిని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తోంది.
దీనిలో భాగంగా ఎయిర్‌టెల్, జియోతో పోలిస్తే ఎంట్రీ లెవల్ ప్లాన్లు 15 శాతం చౌకగా తీసుకురానున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ముఖ్యంగా ప్రీపెయిడ్ యూజర్లను ఆకర్షించేందుకు డీలర్ కమీషన్లు, క్యాంపెయిన్ ఖర్చులు కూడా భారీగా పెంచే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా. వొడాఫోన్ ఐడియా తన 5G నెట్‌వర్క్‌ను తొలుత 75 నగరాల్లో పరిచయం చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అధిక డేటా వినియోగించే పారిశ్రామిక కేంద్రాలపైనే ఫోకస్ చేయనున్నట్లు సమాచారం.
మరోవైపు BSNL కూడా జియో, ఎయిర్‌టెల్‌లకు పోటీగా తన 5G సేవలు తీసుకొచ్చేందుకు రెడీ అయింది. ఈ మేరకు తన 5G సేవలు ఈ ఏడాది ప్రారంభించబోతున్నట్లు కంపెనీ ఇటీవలే అధికారికంగా ప్రకటించింది. ఈ మకర సంక్రాంతి నాటికి BSNL.. 5G సేవలు అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
USB-C పోర్ట్, యాపిల్ మోడెమ్, న్యూ డిజైన్‌తో 'ఐఫోన్ SE 4'- ధర ఎంత ఉంటుందంటే?
క్రెటా ఈవీని ఆవిష్కరించిన హ్యుందాయ్- సింగిల్ ఛార్జ్‌తో 473కి.మీ రేంజ్- ఫస్ట్‌లుక్ చూశారా?
ధర తక్కువ- బెనిఫిట్స్ ఎక్కువ: BSNL నుంచి మరో రెండు చౌకైన ప్లాన్లు- డైలీ 3GB డేటాతో పాటు మరెన్నో!