తెలంగాణ

telangana

ETV Bharat / international

అజర్​బైజన్ విమానం ప్రమాదం - క్షమాపణలు చెప్పిన పుతిన్ - అలా జరిగినందుకేనా? - PUTIN SORRY AZERBAIJAN PLANE CRASH

అజర్​బైజన్ ఘోర విమాన ప్రమాదంపై రష్యా అధ్యక్షుడు పుతిన్ క్షమాపణలు - సారీ చెప్పింది అందుకోసమేనా?

Putin Says Sorry For Azerbaijan Plane Crash
Putin Says Sorry For Azerbaijan Plane Crash (Associated Press)

By ETV Bharat Telugu Team

Published : Dec 28, 2024, 10:04 PM IST

Putin Says Sorry For Azerbaijan Plane Crash :అజర్​బైజన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం కూలిన ఘటనపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆ దేశాధినేతకు క్షమాపణలు చెప్పారు. విమానం కూలడం ఓ విషాదకర ఘటన అని పుతిన్ పేర్కొన్నారు. అజర్‌ బైజన్‌లోని బాకు నగరం నుంచి రష్యాలోని చెచెన్‌ ప్రాంతానికి చెందిన గ్రోజ్నికి ప్రయాణిస్తున్న విమానం కజఖ్‌స్థాన్‌ లోని ఆక్టావ్‌లో బుధవారం కూలిపోయింది. ఈ ఘటనలో 38 మంది మరణించారు. 29 మంది ప్రాణాలతో బయటపడ్డారు.

గ్రోజ్ని సమీపంలో ఉక్రెయిన్ డ్రోన్ దాడుల నేపథ్యంలో తమ వాయు రక్షణ వ్యవస్థ కాల్పులు జరిపిందని తాజాగా ఓ ప్రకటనలో రష్యా తెలిపింది. అయితే ఈ దాడుల్లోనే విమానం కూలిపోయిందని పేర్కోలేదు. విమానం ఘటనకు సంబంధించి వైరల్‌ అయిన దృశ్యాలను చూసిన నెటిజన్లు అందులో కుట్రకోణం ఉందని ఆరోపించారు. బయటి నుంచి ఢీకొన్న ఓ ఆయుధం కారణంగా విమానం ప్రమాదానికి గురైందని అమెరికాకు చెందిన ఓ అధికారి, అజర్‌బైజన్‌కు చెందిన ఓ మంత్రి ఇప్పటికే వేర్వేరు ప్రకటనలు చేశారు

అందుకే సారీ చెప్పారా?
అంతకుముందు, రష్యా మిస్సైల్ తాకడం కారణంగానే విమానం కూలిందంటూ ఉక్రెయిన్‌తో పాటు అజర్​బైజాన్‌ కూడా ఆరోపణలు చేసింది. ఈ క్రమంలోనే స్పందించిన రష్యా అధ్యక్షుడు పుతిన్‌, అజర్​బైజాన్‌ దేశాధినేత ఇల్హామ్‌ అలీయేవ్‌ను క్షమాపణలు కోరారు. ఉక్రెయిన్‌, అజర్​బైజాన్‌ ఆరోపణల వేళ, రష్యా చేసిన ప్రకటనతో పాటు పుతిన్‌ స్పందించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ABOUT THE AUTHOR

...view details