తెలంగాణ

telangana

బ్రెజిల్​లో ఘోర విమాన ప్రమాదం - స్పాట్​లోనే 61 మంది మృతి - Plane Crash In Brazil

By ETV Bharat Telugu Team

Published : Aug 10, 2024, 6:39 AM IST

Updated : Aug 10, 2024, 8:36 AM IST

Plane Crash In Brazil : బ్రెజిల్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 61 మంది మరణించారు.

Plane Crash In Brazil
Plane Crash In Brazil (Associated Press)

Plane Crash In Brazil: బ్రెజిల్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. 61 మంది ప్రయాణికులతో వెళుతున్న విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానంలోని 61 మంది కూడా మరణించారు. వో పాస్‌ విమానయాన సంస్థకు చెందిన విమానం సావో పువాలోలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్తుతుండగా విన్‌హెడో ప్రాంతంలో కూలిపోయింది. విమానంలోని మెుత్తం 62 మంది మరణించినట్లు మొదట వోపాస్‌ సంస్థ తెలిపింది. కానీ తర్వాత 61 మంది మృతి చెందారని వెల్లడిచింది. విమానం ప్రధాన భాగం అగ్నికీలల్లో చిక్కుకున్న దృశ్యాలు అక్కడి స్థానిక మీడియా ప్రసారం చేసింది. ఆ ప్రాంతంలో దట్టంగా పొగ అలుముకుంది. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొన్న పోలీసులు, సహాయ సిబ్బంది బృందాలు రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగిస్తున్నాయి. ప్రమాదంపై బ్రెజిల్‌ అధ్యక్షుడు లుయూజ్‌ లులా డసిల్వా విచారం వ్యక్తం చేశారు. ప్రస్తుతం విమానం కుప్పకూలుతున్న వీడియో సోషల్​ మీడియాలో వైరల్​ అవుతోంది.

2024లో జరిగిన విమాన ప్రమాదాలు

  • ఇటీవల నేపాల్​లోనూ విమాన ప్రమాదం జరిగింది. జులై 24న కాఠ్​మాండులోని త్రిభువన్ ఎయిర్​పోర్టులో విమానం టేకాఫ్​ అవుతుండగా కుప్పకూలింది. ఈ ఘటనలో 18మంది మరణించారు.
  • జులై 12న రష్యాలోని మాస్కోలో సుఖోయే సూపర్​ జెట్ 100 ల్యాండింగ్​ అవుతుండగా కూలి ముగ్గురు సిబ్బంది మృతి చెందారు.
  • మే 21న సింగపూర్ ఎయిర్​లైన్స్​కు చెందిన ఓ విమానం ఆకాశంలో తీవ్రమైన కుదుపులకు లోనవ్వడం వల్ల ఓ వ్యక్తి మరణించారు. మరో 30 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. లండన్​ నుంచి సింగపూర్​ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
  • ఏప్రిల్ 23న మలేషియాలో సైనిక విన్యాసాలు చేస్తున్న రెండు నేవీ హెలికాప్టర్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 10 మంది నేవీ సిబ్బంది మరణించారు.
  • మార్చి 11న రష్యాలో ఓ మిలటరీ రవాణా విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటికే కూలింది. ఈ ఘటనలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • జనవరి 24న ఉక్రెయిన్‌ సరిహద్దుల్లో రష్యా విమానం నేలకూలింది. అందులో ప్రయాణిస్తున్న 74మంది మృతి చెందారు. సైనిక రవాణా విమానం ఇలియుషిన్‌-76లో 65 మంది ఉక్రెయిన్ యుద్ధ ఖైదీలు, ఆరుగురు సిబ్బంది, మరో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు.
Last Updated : Aug 10, 2024, 8:36 AM IST

ABOUT THE AUTHOR

...view details