ETV Bharat / international

అమెరికా ట్రెజరీపై సైబర్‌ ఎటాక్​ - బరితెగించిన చైనా హ్యాకర్స్​! - CHINA CYBER ATTACK ON AMERICA

అమెరికా ట్రైజరీ నెట్​వర్క్​పై చైనా హ్యాకర్స్​ దాడి - ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయవద్దన్న చైనా!

China Cyber Attack On America
China Cyber Attack On America (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 31, 2024, 9:03 AM IST

China Cyber Attack On America : అగ్రరాజ్యం అమెరికా - చైనాపై తీవ్రమైన ఆరోపణలు చేసింది. తమ ట్రెజరీ డిపార్ట్‌మెంట్‌ నెట్​వర్క్​పై చైనా హ్యాకర్లు సైబర్ దాడులకు పాల్పడినట్లు గుర్తించామని తెల్పింది. వర్క్‌స్టేషన్లను యాక్సెస్ చేసి, కీలకమైన పత్రాలను దొంగిలించేందుకు చైనా హ్యాకర్లు ప్రయత్నించినట్లు పేర్కొంది. అమెరికా ట్రెజరీ డిపార్ట్​మెంట్​ - కాంగ్రెస్‌కు రాసిన లేఖలో ఈ విషయాలను వెల్లడించినట్లు ఓ మీడియా సంస్థ బయటపెట్టింది.

అప్రమత్తమైన అమెరికా
"వాస్తవానికి ఈ నెల ప్రారంభంలోనే సైబర్‌ దాడి జరిగింది. థర్డ్‌ పార్టీ సైబర్‌ సెక్యూరిటీ సర్వీస్‌ ప్రొవైడర్స్ సాయంతో హ్యాకర్లు - అమెరికా ట్రెజరీ వర్క్‌స్టేషన్లతో సహా, కీలకమైన దస్త్రాలను యాక్సెస్ చేయగలిగారు. అయితే డిసెంబర్‌ 8న బియాండ్‌ట్రస్ట్‌ ప్రొవైడర్‌ దీనిని గుర్తించింది. వెంటనే అప్రమత్తమై ఈ విషయాన్ని ట్రెజరీ విభాగానికి తెలిపింది" అని ట్రెజరీ డిపార్ట్​మెంట్ అధికార ప్రతినిధి తెలిపారు. అనంతరం చైనా హ్యాకర్లు చేసిన సైబర్​ దాడి గురించి, సైబర్‌ సెక్యూరిటీ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సెక్యూరిటీ ఏజెన్సీ(CISA), ఎఫ్‌బీఐ దృష్టికి తీసుకెళ్లినట్లు వెల్లడించారు. అయితే దీనిపై ఎఫ్‌బీఐ అధికారులు స్పందించలేదు.

ఆధారం లేకుండా ఆరోపణలు చేయవద్దు!
వాషింగ్టన్‌లోని బీజింగ్‌ రాయబార కార్యాలయం ఈ ఆరోపణలను ఖండించింది. 'ఎటువంటి వాస్తవ ఆధారాలు లేకుండా మాపై అమెరికా చేస్తున్న ఆరోపణలను గట్టిగా వ్యతిరేకిస్తున్నాం' అని పేర్కొంది. మరోవైపు జార్జియాలోని బియాండ్‌ ట్రస్ట్‌ సైతం ఈ సైబర్‌ దాడి గురించి స్పందించలేదు. అయితే, వారి వెబ్‌సైట్‌లో ఇటీవల తమ కస్టమర్ల భద్రత ముప్పునకు సంబంధించిన ఘటనలు గుర్తించినట్లు తెలిపింది. దీనిపై దర్యాప్తు జరుగుతున్నట్లు వెల్లడించింది. 'బియాండ్‌ ట్రస్ట్‌ వివరించిన సైబర్​ ఎటాక్​ - ట్రెజరీ నివేదించిన హ్యాకింగ్‌ ఘటనకు దగ్గరగా ఉన్నట్లు గుర్తించాం. అయినప్పటికీ ఈ ఘటనపై విచారణ జరగాల్సి ఉంది' అని ఓ సైబర్‌ సెక్యూరిటీ కంపెనీ అధికారి పేర్కొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.