Realme 14 Pro Series: మార్కెట్లో త్వరలో 'రియల్మీ 14' సిరీస్ మొబైల్స్ ఎంట్రీ ఇవ్వనున్నాయి. కంపెనీ ఈ సిరీస్‌ను వచ్చే నెలలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. వీటి లాంఛ్ డేట్‌పై ఇంకా అధికారికంగా ధృవీకరించనప్పటికీ ఈ సిరీస్ సేల్ తేదీకి సంబంధించి ఆన్లైన్లో సమాచారం వెలువడింది.
సమాచారం ప్రకారం.. 'రియల్మీ 14 ప్రో' సిరీస్ కనీసం రెండు వేరియంట్స్‌లో అయినా వస్తున్నట్లు తెలుస్తోంది. అవి 'రియల్మీ 14 ప్రో', 'రియల్మీ 14 ప్రో ప్లస్'. వీటి విక్రయాలు జనవరి 13 నుంచి ప్రారంభమవుతాయని టిప్‌స్టర్ పరాస్ గుగ్లానీ తన X ఖాతాలో పోస్ట్‌లో రాశారు. ఈ పోస్ట్‌ను చూస్తుంటే జనవరి రెండో వారంలో 'రియల్మీ 14 ప్రో' సిరీస్ లాంచ్ కావచ్చని తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే మైక్రోసైట్ ఇ-కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో లైవ్ అవుతోంది. ఇది దాని ఆన్లైన్ సేల్స్ గురించి సమాచారాన్ని అందిస్తుంది.
స్పెసిఫికేషన్లు: 'రియల్మీ 14 ప్రో' సిరీస్ 42 డిగ్రీల క్వాడ్-కర్వ్డ్ డిస్‌ప్లే, అల్ట్రా-స్లిమ్ 1.6mm ఎడ్జ్-టు-ఎడ్జ్ బెజెల్స్‌ను కలిగి ఉంటుంది. ఇది 1.5K రిజల్యూషన్ డిస్‌ప్లే, వినూత్న కోల్డ్-సెన్సిటివ్ కలర్-ఛేంజ్ బ్యాక్ ప్యానెల్‌ను కలిగి ఉంటుంది. వీటితో పాటు ఈ సిరీస్ మొబైల్స్‌లో హీట్ ఎక్కువైతే కంట్రోల్ చేసేందుకు థర్మోక్రోమిక్ పిగ్మెంట్స్ ఉన్నాయి. అంతేకాక ఇది టెంపరేచర్ పెరిగితే సిగ్నల్ కూడా అందిస్తుంది. ఉష్ణోగ్రత 16°C కంటే తక్కువ ఉంటే ఇది పెర్ల్ వైట్ నుంచి వైబ్రెంట్ బ్లూ కలర్లోకి మారుతుంది. టెంపరేచర్ పెరిగేకొద్దీ ఇది రివర్స్ అవుతుంది.
Xclusive: Realme 14 Pro Series sales from 13th Jan onwards!! #Realme pic.twitter.com/Qss5QqNJFq
— Paras Guglani (@passionategeekz) December 30, 2024
ఇక ఇమేజింగ్ కోసం.. ఇది 'ఓషన్ ఓకులస్' అనే సర్క్యులర్ ట్రిపుల్-కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇది రాత్రి సమయంలో మెరుగైన పోర్ట్రెయిట్‌ల కోసం 'మ్యాజిక్‌గ్లో' ట్రిపుల్ ఫ్లాష్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ స్వెడ్ లెదర్ ఫినిషింగ్‌తో వస్తుంది. కంపెనీ దీన్ని 7.55 మిమీ మందంతో తీసుకురానుంది. దీని ఇతర ఫీచర్ల విషయానికొస్తే.. క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 7s Gen 3 ప్రాసెసర్‌తో ఈ సిరీస్ వస్తుంది. ప్రస్తుతం దాని బ్యాటరీ, డిస్‌ప్లే సైజ్, కెమెరా సెన్సార్ వంటి ఇతర విషయాల గురించి పూర్తి సమాచారం అందుబాటులో లేదు.
2025లో ఎన్ని గ్రహణాలు ఏర్పడతాయి? అవి ఏ రాశులపై ప్రభావం చూపిస్తాయి?
వారెవ్వా.. రోల్స్ రాయిస్ కొత్త కారు ఏం ఉంది భయ్యా!- ఒక్క చూపుకే ఫిదా అయిపోవడం ఖాయం!
ఇదెక్కడి క్రేజ్ రా మావా!- ఏకంగా 60లక్షల ప్రొడక్షన్- ఇది మామూలు బండి కాదు బాబోయ్!