Pakistan Terrorists Killed Today : పాకిస్థాన్ బలూచిస్థాన్‌లో 21మంది ఉగ్రవాదులు హతమయ్యారు. నిషేధిత వేర్పాటువాద సంస్థకు చెందిన ఉగ్రవాదులు దాడులు చేసిన నేపథ్యంలో పాక్ బలగాలు ప్రతిదాడుల చేశాయి. ఈ కాల్పుల్లో సుమారు 21మంది ఉగ్రవాదులు మరణించినట్లు పాక్ ఆర్మీ అధికారులు తెలిపారు. ఈ దాడుల్లో నలుగురు భద్రతా అధికారులు సహా ఇద్దరు పౌరులు మరణించినట్లు వెల్లడించారు. మృతుల సంఖ్య అధికంగానే ఉన్నా, ఉన్నతాధికారులు ధ్రువీకరించలేదని ఆయన తెలిపారు. ఉగ్రవాదుల ఏరివేతకు చేపట్టిన ఆపరేషన్ చివరిదశకు చేరుకుందని ఉన్నతాధికారి తెలిపారు. ఉగ్రవాదులు పర్వతాల్లోని చీకటి ప్రాంతాల్లో నక్కినట్లు వివరించారు.
పాక్‌లో 21మంది ఉగ్రవాదులు హతం- నలుగురు అధికారులు, ఇద్దరు పౌరులు మృతి - pakistan terrorists news
Pakistan Terrorists Killed Today : బలూచిస్థాన్‌లో 21మంది ఉగ్రవాదులను మట్టుబెట్టాయి పాకిస్థాన్ భద్రతా బలగాలు. ఈ దాడుల్లో నలుగురు భద్రతా అధికారులు సహా ఇద్దరు పౌరులు మరణించినట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి.
Published : Feb 1, 2024, 11:15 AM IST
|Updated : Feb 1, 2024, 12:55 PM IST
బలూచిస్థాన్‌లోని మాచ్, కొల్పూర్ ప్రాంతాల్లో సోమవారం రాత్రి ఉగ్రవాదులు దాడులకు తెగబడ్డారు. ఈ క్రమంలోనే ఆపరేషన్ చేపట్టిన భద్రతా బలగాలు 21 మందిని మట్టుబెట్టాయి. అయితే, మిలిటరీ అధికార మీడియా విభాగం మాత్రం మృతుల సంఖ్యను 12గా ప్రకటించింది. "సూసైడ్ బాంబర్లు సహా పలువురు ఉగ్రవాదులు మాచ్, కొల్పూర్‌లో దాడులు చేశారు. వీరంతా మాచ్ సెంట్రల్ జైలును లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ జైలులో చాలా మంది నిషేధిత ఉగ్ర సంస్థలో ఉన్న వ్యక్తులు, మరణశిక్ష పడిన వారు ఉన్నారు. ప్రస్తుతం ఇందులో సుమారు 800మంది శిక్ష అనుభవిస్తున్నారు." అని ఓ అధికారి తెలిపారు.
సైనికుల లక్ష్యంగా దాడి-23మంది మృతి
Pakistan Terror Attack Today :అంతకుముందు గతేడాది డిసెంబర్లో ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డ ఘటనలో 23 మంది సైనికులు మరణించారు. అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. పాకిస్థాన్ తాలిబన్ సంస్థకు అనుబంధంగా పనిచేస్తున్న 'తెహ్రీక్- ఎ- జిహాద్- పాకిస్థాన్' అనే ఉగ్రవాద సంస్థ దాడికి బాధ్యత వహిస్తూ ప్రకటన చేసింది. పాకిస్థాన్- అఫ్గానిస్థాన్ సరిహద్దులోని ఖైబర్ పఖ్తుంక్వా ప్రావిన్స్‌లో ఈ ఘటన జరిగింది. డేరా ఇస్మాయిల్ ఖాన్ జిల్లాలోని దారాబన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉన్న సైనిక స్థావరంపై ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడి చేశారు. పేలుడు పదార్థాలు నింపిన ట్రక్కును ఆరుగురు ఉగ్రవాదులు సైనిక స్థావరంలోని భవనాన్ని ఢీకొట్టారు. ఈ ఘటనలో 23 మంది సైనికులు చనిపోయారని ఆర్మీ ప్రకటించింది.