Hezbollah Top Commander Killed: వైమానిక, భూతల దాడులతో హెజ్‌బొల్లాను ఉక్కిబిక్కిరి చేస్తోన్న ఇజ్రాయెల్ మరోసారి ఆ సంస్థను కోలుకోలేని దెబ్బకొట్టింది. హెజ్‌బొల్లా టాప్ కమాండర్ జాఫర్ ఖాదర్ ఫార్‌ను హతమార్చినట్లు ఇజ్రాయెల్ రక్షణ దళం(ఐడీఎఫ్) పేర్కొంది. ఇజ్రాయెల్‌పై జరిగిన పలు రాకెట్ దాడుల వెనక ఆ కమాండ్ హస్తం ఉన్నట్లు తెలిపింది. అయితే, జాఫర్ మృతి గురించి హెజ్‌బొల్లా ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.
ఆ దాడులన వెనక జాఫరే
నాసర్ బ్రిగేడ్ రాకెట్, మిస్సైల్స్ యూనిట్‌కు చెందిన కమాండర్ జాఫర్ ఖాదర్ ఫార్‌ను దక్షిణ లెబనాన్‌లో హతమార్చినట్లు ఐడీఎఫ్ వెల్లడించింది. 'ఇజ్రాయెల్‌పై జరిగిన పలు దాడుల వెనక జాఫర్ ఉన్నాడు. మాజ్‌దల్ షామ్స్‌పై రాకెట్ దాడి ఘటనలో 12 మంది చిన్నారుల మృతి చెందడం, గతవారం మెటులా ఘటనలో ఐదుగురు ఇజ్రాయెలీలు చనిపోయిన ఘటన వెనకుంది జాఫరే. అంతేకాకుండా గతేడాది అక్టోబర్ 8న తూర్పు లెబనాన్ నుంచి ఇజ్రాయెల్‌పై రాకెట్ దాడులను హెజ్‌బొల్లా అతడి ఆధ్వర్యంలోనే చేపట్టింది' అని ఐడీఎఫ్ తెలిపింది.