తెలంగాణ

telangana

ETV Bharat / international

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు- మూడో ప్రపంచ యుద్ధం ముప్పు పొంచి ఉందా? - Is World War 3 Coming - IS WORLD WAR 3 COMING

Is World War 3 Coming : ఇజ్రాయెల్‌పై దాదాపు 200 బాలిస్టిక్ క్షిపణులతో ఇరాన్ దాడి చేయడం పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తీవ్రతరం చేసింది. ఈ పరిణామంతో ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే ఓ వైపు రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం సుదీర్ఘంగా కొనసాగుతోంది. మరోవైపు గాజాలోని హమాస్‌, లెబనాన్‌లోని హెజ్‌బొల్లా లక్ష్యంగా ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. ఈ క్రమంలో ఇరాన్ ప్రత్యక్షంగా ఇజ్రాయెల్‌పై దాడి చేయడం వల్ల ప్రపంచం మూడో ప్రపంచ యుద్ధం అంచున ఉందనే హెచ్చరికలు వినినిపిస్తున్నాయి.

Israel Iran war
Israel Iran war (Associated Press)

By ETV Bharat Telugu Team

Published : Oct 2, 2024, 9:43 PM IST

Is World War 3 Coming : ఒకవైపు రష్యా-ఉక్రెయిన్‌ మధ్య కొనసాగుతున్న యుద్ధం మూడేళ్లకు చేరువవుతోంది. మరోవైపు పశ్చిమాసియాలో భీకర పోరు కొనసాగుతోంది. గతేడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్‌ దాడులతో మొదలైన ఘర్షణలు అంతకంతకూ విస్తరిస్తున్నాయి. గాజాలోని హమాస్‌, లెబనాన్‌లోని హెజ్‌బొల్లా లక్ష్యంగా ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. ఈ నేపథ్యంలో ఇరాన్‌ దాదాపు 200 క్షిపణులతో ఇజ్రాయెల్‌పై దాడి చేయడం ఉద్రిక్తతలను తీవ్రతరం చేసింది. ఈ ఘర్షణలు తొలుత ప్రాంతీయ యుద్ధంగా క్రమంగా మూడో ప్రపంచ యుద్ధంగా మారే ప్రమాద ముందనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి. దీనిపై సామాజిక మాధ్యమాల్లో చర్చలు జోరుగా సాగుతోంది.

మూడో ప్రపంచ యుద్ధం అంచున ప్రపంచం
భారత్ సహా ప్రపంచ వ్యాప్తంగా ఎక్స్‌లో మూడో ప్రపంచ యుద్ధం అంశంపై చర్చ నడుస్తోంది. హాష్‌ట్యాగ్‌ వరల్డ్ వార్‌-3 అంశం భారత్‌లో ఎక్స్‌ మాధ్యమంలో 5 గంటల పాటు టాప్‌-3 ట్రెండింగ్ టాపిక్‌లలో ఒకటిగా ఉంది. 2 లక్షలకు పైగా ఇందుకు సంబంధించిన పోస్టులు వచ్చాయి. ప్రపంచం మూడో ప్రపంచ యుద్ధం అంచున ఉందని అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. అమెరికాను ఇద్దరు అసమర్థులు నడిపిస్తున్నారని అధ్యక్షుడు బైడెన్‌, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ను ఉద్దేశించి ట్రంప్ విమర్శించారు. వారిద్దరూ ప్రపంచాన్ని మూడో ప్రపంచ యుద్ధం వైపు నడిపిస్తున్నారని ఆరోపించారు. బలహీన, బుజ్జగింపు విధానాలే ప్రపంచానికి ఈ పరిస్థితిని తీసుకొచ్చాని ట్రంప్ పేర్కొన్నారు. రిపబ్లికన్ పార్టీకి చెందిన పలువురు నేతలు సైతం కమలా హారిస్‌పై విమర్శలు గుప్పించారు. రానున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్‌కు వేసే ప్రతి ఓటు ప్రపంచాన్ని అణు యుద్ధం వైపు నడిపిస్తుందని ఆరోపించారు.

ఏ క్షణం ఏం జరుగుతుందో?
గతంలో జరిగిన రెండు ప్రపంచ యుద్ధాల కంటే మూడో ప్రపంచ యుద్ధం వస్తే దాని తీవ్రత ఊహించని విధంగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అది మానవాళిని నాశనం చేస్తుందని పేర్కొన్నారు. పరస్పర దాడులు చేసుకుంటున్న దేశాలు ఆలోచించాల్సిన అవసరముందని సూచించారు. తాజా దాడులతో ఇరాక్‌, సిరియాల్లో ఇరాన్ మద్దతుగల మిలిటెంట్లు అప్రమత్తమైనట్టు తెలుస్తోంది. అటు యెమెన్‌కు చెందిన హూతీ రెబెల్స్‌ సైతం గల్ఫ్ ఆఫ్ ఏడెన్, ఎర్రసముద్రంలో రవాణా నౌకలపై దాడులకు పాల్పడుతున్నారు. ఈ పరిణామాలతో ఇజ్రాయెల్ చుట్టూ ఉన్న ప్రాంతం వార్‌ జోన్‌ను తలపిస్తోంది. ఇరాన్ దాడులతో మండిపడుతోన్న ఇజ్రాయెల్ ప్రతి దాడి ఉంటుందనే హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ దాడులు జరిపితే ఆ దేశానికి అమెరికా, నాటో సాయం చేసే అవకాముందని తెలుస్తోంది. మరోవైపు ఇరాన్, సిరియాకు రష్యా మద్దతు ఉంది. రష్యా ఆ దేశాలకు మద్దతిస్తే చైనా, ఉత్తరకొరియాలు రష్యాకు మద్దతిస్తాయని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఏ క్షణం ఏం జరుగుతుందోనని ఉత్కంఠ నెలకొంది.

ABOUT THE AUTHOR

...view details