PM Modi Remarks At G20 : ప్రపంచ దేశాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల వల్ల ఏర్పడుతున్న ఆహారం, ఇంధనం, ఎరువుల సంక్షోభం దక్షిణాది దేశాల (గ్లోబల్ సౌత్ కంట్రీస్)పై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపిస్తోందని, దీనిని పరిష్కరించడంపై జీ-20 ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని భారత ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
జీ20 శిఖరాగ్ర సదస్సులో మాట్లాడిన ప్రధాని మోదీ, "గతేడాది భారత్‌లో జీ-20 నిర్వహించినప్పుడు 'ఒక భూమి, ఒక కుటుంబం, ఒక భవిష్యత్' థీమ్‌ను తీసుకున్నాం. అది ప్రస్తుత శిఖరాగ్ర సదస్సు కూడా అనుర్తిస్తుంది" అని మోదీ పేర్కొన్నారు.
'ప్రపంచ దేశాల మధ్య ఉన్న వైరుధ్యాలు, ఘర్షణల వల్ల ఆహారం, ఇంధనం, ఎరువుల సంక్షోభం ఏర్పడుతోంది. వీటి దుష్ప్రభావం ప్రపంచంలో దక్షిణాదిన ఉన్న దేశాలపై తీవ్రంగా పడుతోంది. ఈ సవాళ్లను పరిష్కరించడంపై దృష్టి కేంద్రీకరించినప్పుడే మన చర్చలు విజయవంతమవుతాయి' అని మోదీ అన్నారు. సోషల్ ఇన్‌క్లూజన్ అండ్ ది ఫైట్ ఎగెనెస్ట్ హంగర్ అండ్ పావర్టీ' అనే అంశంపై జీ-20 సెషన్లో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.