PM Modi Singapore Tour : భారత్ స్వయంగా అనేక 'సింగ్‌పూర్'లను సృష్టించాలనుకుంటోంని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాలకు సింగపూర్ ఓ నమూనా మోదీ పేర్కొన్నారు. సింగపూర్ పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రధాని లారెన్స్ వాంగ్‌తో గురువారం చర్చలు జరిపారు. సింగపూర్‌కు చెందిన వివిధ కంపెనీల సీఈఓలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారికి భారత్‌లో పెట్టుబడులు పెట్టే అంశాలపై చర్చించారు. విమానయానం, ఇంధనం, నైపుణ్యాభివృద్ధి వంటి రంగాల్లో భారత్‌లో పెట్టుబడి అవకాశాలను పరిశీలించాల్సిందిగా సింగపూర్ వ్యాపారవేత్తలను ప్రధాని కోరారు. ఈ నేఫథ్యంలో భారత్‌లో దశల వారిగా రూ.5 లక్షల కోట్ల పెట్టుబడులకు సింగపూర్ సంస్థలు సుముఖత వ్యక్తం చేశాయి.
ప్రధాని మోదీ సింగపూర్ కంపెనీల సీఈఓలతో భేటీ అయ్యారు. గత 10 ఏళ్లలో భారతదేశం ఘణనీయమైన అభివృద్ధి సాధించిందని మోదీ తెలిపారు. "భారత్‌లో రాజకీయ స్థిరత్వం, సులభతర వ్యాపారం. సంస్కరణ-ఆధారిత ఆర్థిక ఎజెండాల్లో మార్పులు తీసుకువచ్చాము. పెట్టుబడి నిధులు, మౌలిక సదుపాయాలు, తయారీ, ఇంధనం, లాజిస్టిక్స్‌తో వంటి వివిధ రంగాల్లో వేగంగా వృద్ధి సాధిస్తున్నాం. భారత్ త్వరలోనే ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతోంది" అని ధీమా వ్యక్తం చేశారు.
విమానయాన రంగంలో పెట్టుబడులకు ద్వారాలు తెరిచినట్లు తెలిపారు. దేశీయంగా విమానయాన రద్దీని తీర్చడానికి భారతదేశంలో సుమారు 100కు పైగా కొత్త విమానాశ్రయాలు అవసరం ఉన్నాయని వెల్లడించారు. 'మరిన్ని ఎయిర్‌లైన్ సంస్థలు భారత్‌కు రావాల్సి ఉంది.. ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏవియేషన్ మార్కెట్ ఏదైనా ఉందంటే, అది ఇండియానే" అని ప్రధాని పేర్కొన్నారు.