ETV Bharat / state

అన్నంలో ఉప్పు, కారం కలుపుకొని తినండి - మహాత్మాగాంధీ యూనివర్సిటీలో కొత్త టిఫిన్! - MG UNIVERSITY STUDENTS PROTEST

మహాత్మాగాంధీ యూనివర్సిటీలో విద్యార్థినుల ఆందోళన - అల్పాహారంలోకి అన్నం, కారం, ఉప్పు పెట్టారని సిబ్బందితో గొడవ - హాస్టల్​ను పరిశీలించిన యూనివర్సిటీ అధికారులు

MG University Students Protest Over Breakfast Issue In Hostel
MG University Students Protest Over Breakfast Issue In Hostel (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : 18 hours ago

MG University Students Protest Over Breakfast Issue In Hostel : అల్పాహారంలో కారం, ఉప్పు పెడుతున్నారని మహాత్మాగాంధీ యూనివర్సిటీ మహిళా విద్యార్థినులు హాస్టల్​ సిబ్బందితో గొడవ పడుతున్న దృశ్యాలు సోషల్​ మీడియాలో వైరల్​ అవుతున్నాయి. మంగళవారం ఉదయం అల్పాహార సమయంలో మెస్​కు వచ్చిన విద్యార్థినులు బ్రేక్​ఫాస్ట్​ చూసి ఆందోళనకు దిగారు. పొద్దున్నే అన్నం, ఉప్పు, కారం పెట్టడం ఏంటని సిబ్బందితో గొడవకు దిగారు.

ఈ విషయంపై యూనివర్సిటీ అధికారులకు తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని పలువురు విద్యార్థినులు వాపోయారు. విద్యార్థినులు ఆందోళనకు దిగడంతో స్పందించిన అధికారులు హాస్టల్​ను పరిశీలించారు. అనంతరం విద్యార్థినుల భాగస్వామ్యంతోనే వారికి నచ్చిన మెనూ ప్రకారమే ఉదయం బ్రేక్​ ఫాస్ట్​, మధ్యాహ్నం లంచ్​, డిన్నర్​ ఉంటుందని వారు తెలిపారు.

అన్నంలో ఉప్పు, కారం కలుపుకొని తినండి! - మహాత్మాగాంధీ యూనివర్సిటీలో కొత్త టిఫిన్ (ETV Bharat)

మెస్​ ఛార్జీలు పెంచినా మారని పరిస్థితి : ప్రభుత్వ వసతి గృహాల్లో ఇటీవల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఆహారం విషయంలో వారు పడుతున్న ఇబ్బందులు అన్ని ఇన్నికాదు. సరిగ్గా ఆహారం వండకపోవడంతో వికటించి చాలా మంది విద్యార్థినులు ఫుడ్​ పాయిజన్​కు గురవుతుండగా, మృతి చెందిన ఘటనలు ఉన్నాయి. దీనిపై స్పందించిన ప్రభుత్వం తాజాగా మెస్​ఛార్జీలను పెంచింది. తరచూ హాస్టల్స్​కు వెళ్లి తనిఖీ చేస్తున్నారు అధికారులు.

దీంతో హమ్మయ్యా అనుకున్నారు విద్యార్థులు. కానీ ప్రభుత్వం మెస్​ ఛార్జీలను పెంచినా కొన్ని వసతి గృహాల్లో ఎలాంటి మార్పులు జరగట్లేదు. పెట్టే మూడు పూటల తిండిలో నాణ్యత పాటించడం లేదు. తాజాగా నల్గొండ జిల్లా మహాత్మగాంధీ యూనివర్సిటీలో అల్పాహారానికి అన్నం, ఉప్పు, కారం పెట్టి తినమన్నారు. దీంతో కోపానికి గురైన విద్యార్థినులు ఆందోళన చేపట్టారు.

హాస్టల్​ భోజనంలో మధ్యాహ్నం కప్ప - రాత్రి అన్నం తింటుండగా పురుగులు - విద్యార్థినుల మెరుపు ధర్నా

అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులకు పురుగుల అల్పాహారం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.