Michael Clarke About Jasprit Bumrah : బోర్డర్- గావస్కర్ ట్రోఫీని భారత్ చేజార్చుకున్నప్పటికీ, టీమ్ఇండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా అద్భుత సూపర్ పెర్ఫామెన్స్‌తో ఆకట్టుకున్నాడు. ఈ సిరీస్‌లో మొత్తం 32 వికెట్లు తీసి 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్'గా నిలిచిన అతడిపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో ఆసీస్ మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ కూడా బుమ్రాపై ప్రశంసలు కురిపించాడు. అన్ని ఫార్మాట్లలో అత్యుత్తమ బౌలర్ బుమ్రా అని కొనియాడాడు.
'అన్ని ఫార్మాట్లలో బుమ్రానే బెస్ట్ బౌలర్'
బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ముగిసిన తర్వాత బుమ్రా పెర్ఫామెన్స్ గురించి తాను ఆలోచించానని క్లార్క్ తెలిపాడు. అన్ని ఫార్మాట్లలో బుమ్రానే అత్యుత్తమ బౌలర్ అని అభిప్రాయపడ్డాడు. "చాలా మంది గొప్ప ఫాస్ట్ బౌలర్లు నాకు తెలుసు. గ్లెన్ మెక్‌గ్రాత్, ఆంబ్రోస్ లాంటి వారు ఉన్నా, వారు టీ20 ఫార్మాట్లో ఆడలేదు. అందుకే నేను బుమ్రా పేరు చెబుతున్నాను. ఎలాంటి పరిస్థితుల్లోనైనా, ఎలాంటి ఫార్మాటైనా బుమ్రా అదరగొడతాడు. అదే అతడిని గొప్ప బౌలర్‌గా మార్చింది. బుమ్రా జట్టులో ఉంటే సిడ్నీ టెస్టు భారత్ గెలుస్తుందని నేను అనుకున్నాను. టీమ్ఇండియాలోని ఇతర బౌలర్ల కంటే బుమ్రా చాలా మెరుగ్గా ఉన్నాడు." అని క్లార్క్ బుమ్రా ప్రశంసలతో ముంచెత్తాడు.
Is Bumrah the 🐐 across formats?
— ESPNcricinfo (@ESPNcricinfo) January 8, 2025
Michael Clarke thinks so.#AroundTheWicket pic.twitter.com/qUo6MRY75I
ఫించ్ సైతం
బుమ్రాపై ఆసీస్ మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ సైతం ప్రశంసలు కురిపించాడు. బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా జరిగిన సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ లో గాయం కారణంగా బుమ్రా మైదానంలోకి దిగలేదు. ఒకవేళ అతడు బౌలింగ్ చేసి ఉంటే పరిస్థితి ఇంకోలా ఉండేదని ఫించ్ అభిప్రాయపడ్డాడు. 'సిడ్నీ టెస్టు చివరి ఇన్నింగ్స్ లో బుమ్రా బౌలింగ్ చేసి ఉంటే ఆస్ట్రేలియా పరిస్థితి ఎలా ఉండేది? ఆసీస్ గెలిచింది కానీ, పరిస్థితి అనుకున్నదానికంటే క్లిష్టంగా మారేది" అని ఫించ్ పేర్కొన్నాడు.
బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భారత పేసర్ 5 టెస్టుల్లో 32 వికెట్లు తీశాడు. దీంతో అతడిని 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' అవార్డు దక్కింది. అలాగే రెండు టెస్టులకు టీమ్‌కు సారథ్యం వహించిన బుమ్రా ఒక గెలుపును జట్టుకు అందించాడు. ఈ క్రమంలో బుమ్రా బౌలింగ్‌తో పాటు కెప్టెన్సీపై కూడా పలువురు ప్రశంసలు కురిపించారు. కాగా, బోర్డర్- గావస్కర్ ట్రోఫీని 1-3 తేడాతో భారత్ చేజార్చుకుంది.
టాప్ 10లోకి పంత్- అగ్రస్థానంలోనే బుమ్రా- ICC ర్యాంకింగ్స్
'ఒక్కడే మా అందర్నీ వణికించాడు- నా కెరీర్లో చూసిన బెస్ట్ పర్ఫార్మెన్స్ బుమ్రాదే'