తెలంగాణ

telangana

ETV Bharat / international

ఇజ్రాయెల్​పై హెజ్​బొల్లా రివెంజ్​ అటాక్- 100పైగా రాకెట్లతో మెరుపు దాడులు! - Hezbollah Rocket Attack On Israel - HEZBOLLAH ROCKET ATTACK ON ISRAEL

Hezbollah Rocket Attack On Israel : ఇజ్రాయెల్​పైకి హెజ్​బొల్లా ప్రతీకార దాడులకు దిగింది. శుక్రవారం వందకు పైగా రాకెట్లతో ఉత్తర ఇజ్రాయెల్​పై దాడి చేసింది. మరోవైపు, వెస్ట్​బ్యాంక్​లోని ఓ కీలక ఉగ్ర కమాండర్​ను హతమార్చినట్లు ఇజ్రాయెల్ దళాలు ప్రకటించాయి.

Hezbollah Rocket Attack On Israel
Hezbollah Rocket Attack On Israel (Associated Press)

By ETV Bharat Telugu Team

Published : Sep 20, 2024, 6:41 PM IST

Hezbollah Rocket Attack On Israel : లెబనాన్​లో పేజర్లు, వాకీటాకీల పేలుళ్ల నేపథ్యంలో ఇజ్రాయెల్‌పై హెజ్‌బొల్లా ప్రతి దాడికి దిగింది. ఆ దేశంవైపు తాజాగా 140 రాకెట్లు ప్రయోగించింది. ఇజ్రాయెల్‌ హద్దుమీరిందని, ప్రతి దాడి ఉంటుందంటూ హెజ్‌బొల్లా అధినేత హసన్‌ నస్రల్లా హెచ్చరించిన నేపథ్యంలో ఈ రాకెట్లను ప్రయోగించింది. నార్త్​ ఇజ్రాయెల్‌లోని పలు మిలటరీ బ్యారెక్స్‌పై ఈ దాడులు జరిపినట్లు హెజ్‌బొల్లా ప్రకటించింది. సౌత్ లెబనాన్‌లో ఇజ్రాయెల్‌ జరిపిన దాడికి ప్రతీకారంగా ఈ రాకెట్ దాడులకు పాల్పడినట్లు తెలిపింది. లెబనాన్‌ సరిహద్దుల నుంచి మూడు దఫాలుగా ఈ రాకెట్లు దూసుకొచ్చిన విషయాన్ని ఇజ్రాయెల్‌ మిలటరీ కూడా ధ్రువీకరించింది. కానీ నష్టం వివరాలు ఇంకా తెలియరాలేదు.

అయితే మొన్నటివరకు, పాలస్తీనా, హమాస్​పై దృష్టి సారించిన ఇజ్రాయెల్ దళాలు, ఇప్పుడు హెజ్​బొల్లాను లక్ష్యంగా చేసుకుంది. ఈ క్రమంలోనే పేజర్లు, వాకీటాకీల పేలుళ్లతో లెబనాన్‌ అట్టుడికింది. ఈ పేలుళ్ల వెనుక ఇజ్రాయెల్‌ కుట్ర ఉందనేది హెజ్‌బొల్లా వాదన. ఈ క్రమంలోనే దక్షిణ లెబనాన్‌పై గురువారం ఇజ్రాయెల్‌ వైమానిక దాడులతో విరుచుకుపడగా, శుక్రవారం హెజ్‌బొల్లా ప్రతి దాడికి దిగడం గమనార్హం.

ఇజ్రాయెల్ దాడిలో ఉగ్ర కమాండర్ హతం!
మరోవైపు, వెస్ట్‌బ్యాంక్‌లో కీలక ఉగ్రకమాండర్‌ను హతమార్చినట్లు ఇజ్రాయెల్‌ ప్రకటించింది. వెస్ట్‌బ్యాంక్‌లోని ఖబాటియా నగరంలోని కీలక ఉగ్రకమాండర్‌ షాదీ జక్రానేహ్‌ను వాయుసేన అంతమొందించినట్లు ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌-IDF పేర్కొంది. ఖబాటియా వద్ద IDF దళాలు జరిపిన కాల్పుల్లో మరో నలుగురు సాయుధులు మరణించారు. అనంతరం మరికొందరు భద్రతా దళాలపై కాల్పులు జరిపారు. ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో ఆ ప్రాంతంపై IDF దళాలు డ్రోన్ల సాయంతో బాంబులు కురిపించాయి. ఈ ఘటనలో భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రితో ఉన్న కారు నుంచి వెళ్తున్న మిలిటెంట్లపై ఐడీఎఫ్‌ బాంబు దాడి చేసింది. భారీ పేలుడు ధాటికి మరణించిన వారిలో ఖబాటియాలో ఉగ్రనెట్‌వర్క్‌ కమాండర్‌ షాదీ జక్రానేహ్‌ ఉన్నట్లు ఇజ్రాయెల్‌ దళాలు గుర్తించాయి. మరో ఏడుగురు మోస్ట్‌వాంటెడ్‌ వ్యక్తులను అదుపులోకి తీసుకొన్నట్లు తెలిపాయి.

హెజ్‌బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ ప్రత్యక్ష దాడి - ప్రతీకారం తీర్చుకుంటామన్న నస్రల్లా! - Israel Direct Attack On Hezbollah

'యుద్ధం కొత్త దశ షురూ!' లెబనాన్‌లో పేలుళ్ల వేళ ఇజ్రాయెల్‌ ప్రకటన - Israel Lebanon War

ABOUT THE AUTHOR

...view details