తెలంగాణ

telangana

ETV Bharat / international

తైవాన్‌లో భారీ భూకంపం- 9మంది మృతి- క్వారీల్లో చిక్కుకున్న కార్మికులు - earthquake in taiwan - EARTHQUAKE IN TAIWAN

Earthquake In Taiwan : తైవాన్​ రాజధాని తైపీలో భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్​ స్కేల్​పై 7.4గా నమోదైంది. దీంతో తైవాన్​తో దక్షిణ జపాన్ ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. మరోవైపు భూకంపం కారణంగా ఏడుగురు పౌరులు చనిపోయినట్లు అధికారులు తాజాగా వెల్లడించారు.

Earthquake In Taiwan 2024
Earthquake In Taiwan 2024

By ETV Bharat Telugu Team

Published : Apr 3, 2024, 6:51 AM IST

Updated : Apr 3, 2024, 6:46 PM IST

Earthquake In Taiwan : తైవాన్ ద్వీపంలో గత 25 ఏళ్లలో ఎన్నడూ చూడని విధంగా బలమైన భూకంపం సంభవించింది. ఇప్పటివరకు తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోగా 934 మందికిపైగా గాయపడినట్లు తైవాన్ అధికారులు తెలిపారు. మరొ 50 మంది ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు. సుమారు 70 మంది కార్మికులు రాళ్ల క్వారీలో చిక్కుకున్నట్లు తెలిపారు. ఈ విపత్తు ధాటికి పలు భవనాలు కుప్పకూలగా మరికొన్ని ఒకవైపునకు ఒరిగాయి. వంతెనలు ఊగిపోయాయి. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహాయచర్యలు ముమ్మరంగా సాగుతున్నట్లు అధికారులు వివరించారు.

భూకంపం ధాటికి వంగిపోయిన నివాస సముదాయం!
నేలకొరిగిన భవనం నుంచి చిన్నారిని కాపాడుతున్న స్థానికులు.

తైవాన్‌ రాజధాని తైపీలో రిక్టర్​ స్కేల్​పై భూకంప తీవ్రత 7.4గా నమోదైంది. తైవాన్‌ కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 8 గంటల సమయంలో ఈ విపత్తు సంభవించింది. ఆ దేశ భూకంప పర్యవేక్షణ సంస్థ ప్రకంపనల తీవ్రతను రిక్టర్‌ స్కేల్‌పై 7.2గా గుర్తించగా, అమెరికా జియోలాజికల్‌ సర్వే (USGS) దీన్ని 7.4గా పేర్కొంది. హువాలియెన్‌ పట్టణానికి నైరుతి దిశలో 18 కిలోమీటర్ల దూరం, 35 కి.మీ లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. దీని తర్వాత 6.5 తీవ్రతతో మరో భూకంపం కూడా సంభవించినట్లు యూఎస్‌జీఎస్‌ వెల్లడించింది.

భూకంపం ధాటికి నేలకొరిగిన భారీ భవనం
తైవాన్​ భారీ భూకంపం

భూకంపం వల్ల వచ్చిన సునామీ అలలు తైవాన్‌ తూర్పు తీరంలోని హువాలియెన్‌ పట్టణాన్ని తాకాయి. పెద్ద ఎత్తున భవనాలు ధ్వంసమయ్యాయి. ఒక ఐదంతస్తుల భవనం 45 డిగ్రీల కోణంలో ఒరిగిపోవడం చిత్రాల్లో కనిపిస్తోంది. రాజధాని తైపీలో అనేక బిల్డింగుల్లో పగుళ్లు వచ్చాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. జపాన్‌లోని కొన్ని దీవుల్లోనూ పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది.

ఒకినావా ద్వీప సమూహంలో మూడు మీటర్ల వరకు సునామీ అలలు ఎగిసిపడే ప్రమాదం ఉందని జపాన్‌ హెచ్చరించింది. ఆ తర్వాత సునామీ హెచ్చరికలను ఎత్తివేసింది. భూకంపం సంభవించిన 30 నిమిషాల తర్వాత భారీ అల యొనగుని ద్వీపాన్ని తాకినట్లు అంతకుముందు తెలిపింది. మియాకో, యేయామా ద్వీపాలకు కూడా సునామీ ముప్పు పొంచి ఉందని వెల్లడించింది. తైపీలో పలు రైళ్ల సేవలను నిలిపివేశారు అధికారులు. 1999 తర్వాత తైవాన్‌ను ప్రభావితం చేసిన అతిపెద్ద భూకంపం ఇదేనని నిపుణులు చెబుతున్నారు.

పరిసర దేశాలు అలర్ట్​!
తైవాన్‌లో భూకంపంతో జపాన్‌ సహా మరికొన్ని దేశాల్లోని తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. ఈ ప్రకృతి విపత్తుకు సంబంధించి ప్రాణ, ఆస్తి పూర్తి నష్ట వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు తీరప్రాంతాల్లో సునామీ ప్రభావాన్ని అంచనా వేసేందుకు జపాన్​ సెల్ఫ్​ డిఫెన్స్​​ఎయిర్​క్రాఫ్ట్​లను ఇప్పటికే ఒకినావా ప్రాంతానికి పంపింది. అవసరమైతే బాధితులను అక్కడి నుంచి తరలించేందుకు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది.

నైట్‌క్లబ్‌లో ఘోర అగ్ని ప్రమాదం- 29 మంది మృతి - turkey fire accident today

కోర్టుకు ట్రంప్​ రూ.1460 కోట్ల బాండు సమర్పణ- అలా జరిగితే మొత్తం పోయినట్లే! - Trump Bond In Civil Fraud Case

Last Updated : Apr 3, 2024, 6:46 PM IST

ABOUT THE AUTHOR

...view details