తెలంగాణ

telangana

By ETV Bharat Telugu Team

Published : Aug 12, 2024, 12:23 PM IST

ETV Bharat / international

2000 కిలోలను మోసుకెళ్లే చైనా డ్రోన్ - ఆ విషయంలో డ్రాగన్​ జెట్​ స్పీడ్​! - Heavy Lift Drone China

Heavy Lift Drone China : రెండు టన్నుల బరువైన సరకులను తీసుకెళ్లగలిగే రవాణా డ్రోన్​ను చైనా పరీక్షించింది. దీనిని సిచువాన్ టెంగ్డెన్ సైన్స్ టెక్ ఇన్నోవేషన్ సంస్థ రూపొందించింది.

Heavy Lift Drone China
Heavy Lift Drone China (Getty Images)

Heavy Lift Drone China : డ్రోన్ల విషయంలో శరవేగంగా చైనా పురోగతి సాధిస్తోంది. సిచువాన్‌ టెంగ్డెన్‌ సైన్స్‌ టెక్‌ ఇన్నోవేషన్‌ సంస్థ తయారు చేసిన అతిపెద్ద పౌర రవాణా డ్రోన్‌ను తాజాగా పరీక్షించింది. రెండు ఇంజిన్లతో పనిచేసే ఈ డ్రోన్‌ ఏకంగా 2 టన్నుల పేలోడ్‌ను మోసుకెళ్లగలదు. సిచవాన్‌ ప్రావిన్స్‌లో దాదాపు 20 నిమిషాలపాటు ప్రయోగం జరిగింది. ఆ డ్రోన్​ రెక్కల పొడవు 16 మీటర్లు, ఎత్తు 15 అడుగులుగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా వినియోగించే సెస్నా 172 విమానం కంటే కొంచెం ఎక్కువ పొడవే ఉంటుంది.

ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా డ్రోన్ల తయారీ, విక్రయాల్లో చైనా అగ్రస్థానంలో ఉంది. జూన్‌లో ఏవియేషన్‌ ఇండస్ట్రీ కార్పొరేషన్‌ తయారుచేసిన హెచ్‌హెచ్‌-100 అనే కార్గో డ్రోన్‌ను పరీక్షించింది. ఇది దాదాపు 700 కేజీల బరువును తీసుకొని 520 కిలోమీటర్ల పాటు ప్రయాణించింది. వచ్చే ఏడాది టీపీ2000 అనే యూఏవీని పరీక్షించేందుకు సన్నాహాలు చేస్తోంది చైనా. ఇది 2 టన్నుల పేలోడ్‌తో 2,000 కిలోమీటర్లు ప్రయాణించగలదని అంచనా వేస్తున్నారు.

మరోవైపు, చైనా ప్రభుత్వం ఇటీవల కాలంలో లోఆల్టిట్యూడ్‌ ఎకానమీ (తక్కువ ఎత్తులో కార్యకలాపాలు నిర్వహించే ఆర్థిక వ్యవస్థ)ను కూడా బలోపేతం చేయాలని నిర్ణయించింది. ఇది 2030 నాటికి నాలుగు రెట్లు పెరిగి 270 బిలియన్‌ డాలర్లకు చేరుతుందని ఆ దేశ ఏవియేషన్‌ రెగ్యులేటరీ అంచనా వేసింది. దీనిలో ప్రయాణికులను, సరకులను రవాణా చేయాలని పేర్కొంది. దీంతో ఈ ఏడాది ఏప్రిల్‌లో గ్వాంగ్జుకు చెందిన ఈహంగ్‌ హోల్డింగ్స్‌ అనే సంస్థకు చెందిన మానవ రవాణా డ్రోన్‌కు అనుమతులు ఇచ్చింది. 2023 నాటికి చైనాలో దాదాపు 2,000కు పైగా సంస్థలు డ్రోన్ల తయారీ, డిజైన్‌లో పని చేస్తున్నాయి.

కొన్నిరోజుల క్రితం, చైనా ప్రయోగించిన చాంగే-6(Chang'e-6) ప్రోబ్, జాబిల్లి పైనుంచి విజయవంతంగా భూమికి తిరిగి వచ్చింది. తొలిసారి చంద్రుని అవతలి వైపు నుంచి రాళ్లు, మట్టి నమూనాలను సేకరించి ఉత్తర చైనాలోని ఇన్నర్ మంగోలియన్ ప్రాంతంలో ప్రోబ్ ల్యాండ్ అయింది. ఇందుకోసం నెల రోజుల ముందు నుంచే ల్యాండింగ్‌ ప్రాంతంలో వాతావరణ శాఖ విస్తృత ఏర్పాట్లు చేసింది. అందుకు సంబంధించిన పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

చైనా కవ్వింపు చర్యలు - తైవాన్ చుట్టూ డ్రాగన్ సైనిక విన్యాసాలు - China Military Drills

'మా దేశంపై చైనా సైనిక చర్యలను ఆపాలి'- తైవాన్ అధ్యక్షుడిగా లాయ్‌ చింగ్‌ తె ప్రమాణం - taiwan new president inauguration

ABOUT THE AUTHOR

...view details