తెలంగాణ

telangana

ETV Bharat / international

రెస్టారెంట్​లో చెలరేగిన మంటలు- 45మంది మృతి - fire breaks out in restaurant

Bangladesh Fire Accident : ఓ రెస్టారెంట్​లో జరిగిన అగ్ని ప్రమాదంలో సుమారు 45 మంది మరణించగా, మరో 22 తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో జరిగింది.

Bangladesh Fire Accident
Bangladesh Fire Accident

By ETV Bharat Telugu Team

Published : Mar 1, 2024, 6:37 AM IST

Updated : Mar 1, 2024, 11:07 AM IST

Bangladesh Fire Accident : బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో జరిగిన అగ్ని ప్రమాదంలో దాదాపు 45మంది మృతిచెందారు. 22మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఓ ఏడంతస్తుల రెస్టారెంట్​లో మంటలు చెలరేగడం వల్ల ఈ ప్రమాదం జరినట్లు సమాచారం. ఈ మేరకు బంగ్లాదేశ్​ ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ సమంత లాల్ సేన్​ వివరాలు వెల్లడించారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారి పరిస్థతి విషమంగా ఉందని ఆయన తెలిపారు. గ్యాస్​ సిలిండర్ పేలడం వల్లనే ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది.

ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే అక్కడకు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో చిక్కుకున్న 70 మందిని రక్షించారు. వారిలో 40 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు గుర్తించారు. ప్రమాద విషయాన్ని తెలుసుకున్న బంగ్లాదేశ్ ఆరోగ్య మంత్రి డాక్టర్ సమంత లాల్ సేన్ ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు.

రెస్టారెంట్​ వద్ద సహాయక చర్యలు చేపడుతున్న ఫైర్ సిబ్బంది

ఢాకా బెయిలీ రోడ్డులో ఉన్న ఓ బిర్యానీ రెస్టారెంట్‌లో గురువారం రాత్రి మంటలు చెలరేగినట్లు అగ్నిమాపక విభాగం అధికారి మహమ్మద్‌ షిహబ్‌ వెల్లడించారు. మంటలు క్రమంగా పై అంతస్తులకు విస్తరించినట్లు తెలిపారు. రెండు గంటల్లో మంటలను అదుపులోకి తెచ్చినట్లు పేర్కొన్నారు. ఘటన జరిగిన ప్రాంతంలో రెస్టారెంట్లు, వస్త్ర దుకాణాలు, మొబైల్‌ ఫోన్ల విక్రయ కేంద్రాలు అధికంగా ఉన్నాయి.

మంటలను అదుపులోకి తెస్తున్న అగ్నిమాపక సిబ్బంది

'ప్రమాదం జరిగిన సమయంలో మేము ఆరో అంతస్తులో ఉన్నాం. మెట్ల మార్గంలో పొగ వస్తుండాన్ని గమనించాం. అందరూ కింది నుంచి పైకి పరుగెత్తుకొచ్చారు. మేమంతా నీటి పైపుల ద్వారా కిందకు దిగాము. మరికొందురు రెస్టారెంట్​ పై నుంచి దూకటం వల్ల తీవ్ర గాయాలయ్యాయి. కొంత మంది పూర్తిగా భవనం పైకి చేరుకున్నారు. సాయం కోసం అర్థించారు' అని రెస్టారెంట్‌ మేనేజర్‌ సోహెల్‌ తెలిపారు.
బంగ్లాదేశ్‌లో అపార్ట్‌మెంట్లు, ఫ్యాక్టరీ కాంప్లెక్సుల్లో అగ్ని ప్రమాదాలు తరచూ జరుగుతుంటాయి. 2021 జులైలో ఓ ఆహార శుద్ధి పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో అనేక మంది పిల్లలు సహా 52 మంది దుర్మరణం చెందారు. 2019 ఫిబ్రవరిలో రాజధాని ఢాకాలో అపార్ట్‌మెంట్‌ బ్లాకుల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 70 మంది మృతి చెందారు.

గాజాలో మారణహోమం- సాయం కోసం ఎదురుచూస్తున్నవారిపై ఇజ్రాయెల్ దాడి- 70మంది మృతి

పాక్​లో ఘోర ప్రమాదం- లోయలో బస్సు పడి 10 మంది మృతి

Last Updated : Mar 1, 2024, 11:07 AM IST

ABOUT THE AUTHOR

...view details