తెలంగాణ

telangana

ETV Bharat / health

ఈ ఫుడ్స్ తింటున్నారా? - అయితే మీకు బీపీ గ్యారెంటీ! - Worst Foods For Blood Pressure - WORST FOODS FOR BLOOD PRESSURE

Blood Pressure Increase Foods : మారిన జీవనశైలి కారణంగా ఈరోజుల్లో చాలా మంది బీపీ సమస్య​తో బాధపడుతున్నారు. మీరు ఆ సమస్య బారిన పడకుండా ఉండాలంటే.. ఈ ఆహార పదార్థాలకు వీలైనంత దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

Worst Foods For Blood Pressure
Blood Pressure

By ETV Bharat Telugu Team

Published : Apr 29, 2024, 1:56 PM IST

Worst Foods For Blood Pressure : ప్రస్తుత రోజుల్లో చాలా మంది బీపీతో బారిన పడుతున్నారు. మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్లు, తగ్గుతున్న శారీరక శ్రమ, ఒత్తిడి, అధిక బరువు.. వీటన్నింటి వల్ల చిన్న వయసులోనే రక్తపోటు సమస్యలతో ఇబ్బందిపడుతున్నారు. అందుకే సరైన జీవనశైలితోపాటు తినే ఆహారం విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలంటున్నారు నిపుణులు! ప్రధానంగా కొన్ని ఆహారాలకు వీలైనంత దూరంగా ఉండాలంటున్నారు. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

పచ్చళ్లు :మీరు హైబీపీ బారిన పడకూడదంటే వీలైనంత వరకు పచ్చళ్లను తీసుకోకపోవడం మంచిది అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే వీటిలో అధిక స్థాయిలో ఉప్పు ఉంటుంది. ఇది వాటిని ఎక్కువ కాలం తాజాగా ఉంచడంలో సహాయపడుతుంది. కాబట్టి మీరు రక్తపోటు సమస్యలను ఎదుర్కోవద్దంటే పికిల్స్​కు వీలైనంత దూరంగా మంచిది అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా ఇప్పటికే హైబీపీతో బాధపడేవారు వీటిని అస్సలు తీసుకోవద్దంటున్నారు.

ప్రాసెస్డ్ ఫుడ్స్ :అధికరక్తపోటు ప్రాబ్లమ్ ఎదుర్కోవద్దంటే మీరు దూరంగా ఉండాల్సిన మరో ఆహారం.. ప్రాసెస్డ్ ఫుడ్స్. ఎందుకంటే వీటిలో కూడా సాల్ట్ అధికంగా ఉంటుంది. కాబట్టి వీటిని తీసుకోవడం ద్వారా బీపీ పెరిగే అవకాశం ఉందంటున్నారు. ముఖ్యంగా హాట్​డాగ్​లు, సాసేజ్, బేకన్, కార్న్డ్ బీఫ్ వంటి వాటికి వీలైనంత దూరంగా ఉండాలని సూచిస్తున్నారు నిపుణులు. అదేవిధంగా.. జంక్‌ఫుడ్​కు నో చెప్పాలంటున్నారు. అలాగే అధిక రక్తపోటు ఉన్నవారు.. ఫ్రై చేసిన మాంసాహార పదార్థాలకు దూరుంగా ఉండాలని సూచిస్తున్నారు హైదరాబాద్​కు చెందిన పోషకాహార నిపుణురాలు డాక్టర్ అంజలీదేవి.

ఎలాంటి మందులూ వాడకుండానే - హైబీపీ తగ్గించుకోండిలా!

చీజ్ :చాలా మంది వివిధ వంటకాలలో చీజ్​ని ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. అయితే.. మీరు హైబీపీ ప్రాబ్లమ్​ ఎదుర్కోవద్దంటే చీజ్​ వాడకాన్ని తగ్గించుకోవడం మంచిది అంటున్నారు నిపుణులు. ఎందుకంటే దీనిలో సోడియం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా అమెరికన్ చీజ్​, బ్లూ చీజ్​లో ఔన్స్ సర్వింగ్​కు 300 మిల్లీ గ్రాముల సోడియం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి చీజ్​కు దూరంగా ఉండాలని, ముఖ్యంగా హైబీపీ ఉన్నవారు దీనిని అస్సలు తీసుకోకపోవడం మంచిది అంటున్నారు నిపుణులు.

ఆల్కహాల్ :మీరు అధిక రక్తపోటు బారిన పడకుండా ఉండాలంటే ఆల్కహాల్​కు వీలైనంత దూరంగా ఉండడం మంచిది అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అంతేకాదు అధిక ఆల్కహాల్ వినియోగం గుండె, కాలేయం, మూత్రపిండాల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంటుందంటున్నారు. ముఖ్యంగా హైబీపీ ఉన్నవారు మద్య జోలికి వెళ్లకపోవడం మంచిది అంటున్నారు.

కూల్‌డ్రింక్స్‌ : వీటిలో కూడా షుగర్‌ కంటెంట్‌ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి హైబీపీ రావొద్దంటే కూల్​డ్రింక్స్​కు వీలైనంత దూరంగా ఉండడం మంచిది అంటున్నారు నిపుణులు. ఇవి రక్తపోటుతోపాటు బరువు కూడా పెరిగేలా చేస్తాయంటున్నారు. 2019లో బ్రిటిష్ మెడికల్ జర్నల్ ( BMJ) ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం.. షుగర్‌ ఎక్కువగా ఉండే కూల్‌డ్రింక్స్‌ తీసుకోవడం వల్ల బీపీ పెరిగే అవకాశం 20 శాతం ఎక్కువగా ఉందని పరిశోధకులు గుర్తించారు. వీటితో పాటు తీపి ఎక్కువగా ఉండే పదార్థాలకు దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే వీటిని తీసుకోవడం వల్ల బీపీ సమస్యలే కాదు అనారోగ్యకరమైన బరువు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

NOTE :ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

అధిక రక్తపోటుతో బాధపడుతున్నారా? - ఈ ఆహారాలు ఔషధం!

ABOUT THE AUTHOR

...view details