తెలంగాణ

telangana

ETV Bharat / health

ఇవాళ వరల్డ్ స్లీప్​ డే - మీకు నిద్ర పట్టకపోవడానికి కారణాలు ఇవే! - reasons not getting enough sleep

World Sleep Day 2024 : నేటి ఆధునిక జీవితంలో మనిషి ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో 'నిద్రలేమి' ఒకటి. మరి.. ఈ సమస్యకు కారణాలేంటి? రోజువారీ జీవితంలో మనిషి చేస్తున్న పొరపాట్లు ఏంటి? నిపుణులు ఏం చెబుతున్నారు? నేడు 'ప్రపంచ నిద్ర దినోత్సవం' సందర్భంగా.. ఈ సమస్యను ఎలా అధిగమించాలో తెలుసుకుందాం.

World Sleep Day 2024
World Sleep Day 2024

By ETV Bharat Telugu Team

Published : Mar 15, 2024, 11:44 AM IST

World Sleep Day 2024 :మనం ఆరోగ్యంగా ఉండటానికి పోషకాహారం తీసుకోవడం ఎంత ముఖ్యమో.. కంటినిండా నిద్ర పోవడం కూడా అంతే ముఖ్యం. కానీ.. ప్రస్తుత కాలంలో చాలా మంది ప్రశాంతమైన నిద్రకు దూరమవుతున్నారు. నిద్రలేమి కారణంగా అధిక బరువు మొదలు.. బీపీ, షుగర్ వంటి ఎన్నో రకాల అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ఈ విషయంలో జనాలను అప్రమత్తం చేసేందుకే ప్రతీ సంవత్సరం మార్చి మూడో శుక్రవారం రోజున "ప్రపంచ నిద్ర దినోత్సవం" జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా.. నిద్రలేమి సమస్యను ఎలా అధిగమించాలో తెలుసుకుందాం.

అనారోగ్యకరమైన ఆహారం :
రోజూ చక్కెర, కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండే ప్రాసెస్‌ చేసిన ఆహారం తినడం వల్ల నిద్రపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అలాగే మసాలాలు ఎక్కువగా ఉండే జంక్‌ఫుడ్‌, ఫాస్ట్‌ఫుడ్‌ వంటి ఫుడ్‌ తినడం వల్ల గుండెల్లో మంట కలిగి నిద్ర దూరమవుతుంది. అందుకే.. రాత్రి నిద్రపోయే ముందు ఈ పదార్థాలను అస్సలు తినకూడదని సూచిస్తున్నారు నిపుణులు. అలాగే వీటిని నైట్‌ తినడం వల్ల బరువు కూడా పెరుగుతారు.

నిద్రకు సరైన టైమ్‌ లేకపోవడం :
ఈ రోజుల్లో చాలా మంది ఉద్యోగస్థులు, వివిధ పనులు చేసేవారు నైట్‌ షిఫ్ట్‌లంటూ రాత్రంతా మెలకువగా ఉండి, ఉదయం నిద్రపోతుంటారు. మంచి నిద్ర లేకపోవడానికి ఇది కూడా ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. అలాగే పడుకునే గదిలో శబ్ధాలు రావడం, వెలుతురు ఉండటం వల్ల నిద్రలేమి సమస్య వెంటాడుతుందని చెబుతున్నారు.

ఒత్తిడి, ఆందోళన :
ఈ రోజుల్లో చాలా మంది పని ఒత్తిడి, ఆర్థిక సమస్యలు, గొడవలు వంటి వివిధ కారణాల వల్ల లైఫ్‌లో చాలా ఒత్తిడి, ఆందోళనలను అనుభవిస్తున్నారు. దీనివల్ల వారు ఒత్తిడితో నిద్రకు దూరమవుతున్నారు. దీర్ఘకాలికంగా ఒత్తిడికి గురవడం వల్ల నిద్రలేమి సమస్య వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

సాయంత్రం వ్యాయామాలు :
కొంతమంది సాయంత్రం ఎక్కువగా వర్క్‌అవుట్‌లు చేస్తుంటారు. అయితే, ఇలా చేయడం వల్ల హృదయ స్పందన రేటు పెరుగుతుందట. దీనివల్ల రాత్రి నాణ్యమైన నిద్ర దూరమవుతుందని నిపుణులంటున్నారు. వ్యాయామాలను ఉదయం చేయాలని సూచిస్తున్నారు.

ఇంకా :

  • కొంత మంది పడుకునే ముందు ఆహారం తింటారు. తిన్న వెంటనేపడుకోవడం వల్ల గుండెల్లో మంటగా అనిపిస్తుంది. అందుకే పడుకోవడానికి కనీసం రెండు గంటల ముందు డిన్నర్‌ కంప్లీట్‌ అయ్యేలా చూసుకోవాలి.
  • రోజూ కాఫీ, టీ, కోలా వంటి డ్రింక్స్‌ ఎక్కువగా తాగడం వల్ల కూడా నిద్ర దూరమవుతుంది.
  • 2013లో "Sleep" జర్నల్‌ ప్రచురించిన నివేదిక ప్రకారం.. రోజుకు 400 మిల్లీగ్రాముల కెఫీన్‌ (సుమారు 4 కప్పుల కాఫీ) తాగిన వారు, సాధారణ వ్యక్తుల కంటే నిద్రపోవడానికి ఎక్కువ సమయం పట్టిందని పరిశోధకులు గుర్తించారు. అలాగే వీరు తక్కువ నాణ్యమైన నిద్రను పోయారని తేల్చారు.
  • అలాగే పొగ, మద్యం తాగడం వంటి అలవాట్లు మీ నిద్రపై ప్రతికూల ప్రభావం చూపిస్తాయి.
  • మనం రోజూ తగినంత శారీరక శ్రమ చేయకపోవడం వల్ల కూడా నిద్రకు దూరమవుతామని మీకు తెలుసా ? అవును.. నాణ్యమైన నిద్ర కోసం బాడీకి కొంత వ్యాయామం అవసరం.
  • అందుకే రోజూ నడక, ధ్యానం, జాగింగ్‌, సైక్లింగ్‌, స్విమ్మింగ్ వంటి వ్యాయామాలను తప్పకుండా చేయాలి.
  • స్లీప్ అప్నియా (sleep apnea), ఇన్సోమ్నియా (insomnia), రెస్ట్‌లెస్ లెగ్ సిండ్రోమ్ (restless leg syndrome) వంటి వివిధ అనారోగ్య సమస్యల వల్ల కూడా నిద్ర దూరం అవుతుంది. కాబట్టి.. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సమస్య అలాగే ఉంటే.. వైద్యులను సంప్రదించడం మంచిది.

ఫుడ్​ పాయిజన్​ అయిందా? డాక్టర్​ వద్దకు వెళ్లేముందు ఇంట్లో ఇలా చేస్తే బిగ్ రిలీఫ్!

సిగరెట్ తాగడం Vs పొగాకు నమలడం- ఏది ఎక్కువ డేంజర్​! నిపుణుల మాటేంటి!

హెల్దీగా ఉండాలనుకుంటున్నారా? డిన్నర్​ టైమ్​లో ఈ టిప్స్​ పాటిస్తే బెస్ట్​ అంటున్న నిపుణులు!

ABOUT THE AUTHOR

...view details