Winter Skin Care Tips;వాతావరణ మార్పుల వల్ల మన ఆరోగ్యం, అందం దెబ్బతింటుంది. ఈ క్రమంలోనే ముఖ్యంగా చలికాలంలో సౌందర్య పరిరక్షణ మరింత సవాలుగా మారుతుుంది. పొడి చర్మం, జుట్టు నిర్జీవమవడం, పాదాల పగుళ్లు వంటి సమస్యలను ఈ కాలంలో చాలామంది ఎదుర్కొంటుంటారు. వీటి నుంచి తప్పించుకోవడానికి అనేక ప్రయత్నాలుచేస్తుంటారు. మరి, ఈ సమస్యల నుంచి విముక్తి పొందడానికి ఈ చిట్కాలు మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
స్క్రబ్‌తో పోషణ!
చలి వల్ల చర్మం పొడిబారిపోయి గరుకుగా మారిపోతుంది. తిరిగి చర్మాన్ని మృదువుగా మార్చుకునేందుకు చాలామంది స్క్రబ్బింగ్ పద్ధతిని పాటిస్తుంటారు. ఇందుకోసం దాల్చినచెక్క, తేనె రెండూ కలిపిన మిశ్రమాన్ని చర్మానికి అప్లై చేసి కాసేపు మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల చర్మానికి పోషణ అందడంతో పాటు మృతకణాలూ తొలగిపోతాయని నిపుణులు అంటున్నారు. అలాగే దాల్చిన చెక్క శరీరంలో వేడిని పుట్టించడానికీ తోడ్పడుతుందని చెబుతున్నారు.
మెడపై సుతారంగా
చలికాలంలో అటు వెచ్చదనాన్ని పంచడంతో పాటు ఇటు చర్మాన్ని మృదువుగా మార్చే పదార్థాల్లో గుమ్మడి ఒకటని నిపుణులు చెబుతున్నారు. దీని గుజ్జుతో ముఖం, మెడపై సుతారంగా మసాజ్ చేసుకోవడం వల్ల పొడిబారిన చర్మం తిరిగి మృదువుగా మారుతుందని వివరిస్తున్నారు. ఇందులోని ఎంజైమ్స్, బీటా కెరోటిన్ ఈ పనిని మరింత సమర్థంగా పూర్తి చేస్తాయని పేర్కొన్నారు.