Actress Mandira Bedi Fitness Secret: ప్రసవానంతరం మహిళలు ఎదుర్కొనే సమస్యల్లో బరువు పెరగడం ఒకటి. చాలా మంది బరువు తగ్గేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ చాలా మందికి నిరాశే మిగులుతుంది. అయితే తాను చక్కటి డైట్, జీవన విధానాన్ని అలవర్చుకోవడం ద్వారా కేవలం 6 నెలల్లోనే 20 కేజీలకుపైగా బరువు తగ్గినట్టు చెబుతున్నారు బాలీవుడ్ నటి మందిరా బేడీ! ప్రస్తుతం 52 సంవత్సరాల వయసులోనూ తన అందం, ఆరోగ్యం, ఫిట్ గా ఉండడానికి. తాను ఆహారంలో చేసుకున్న మార్పులే కారణమంటున్నారు. ఈ మేరకు ‘వాట్ విమెన్ వాంట్’ అనే షోలో ఆమె చెప్పారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
ప్రెగ్నెంట్ అయ్యాక మహిళలు బరువు పెరగడం సహజమే. ఇక ప్రసవం తర్వాత, తిరిగి మునుపటి స్థితికి చేరుకోవాలంటే కొన్ని నెలల సమయం పడుతుంది. అలా డెలివరీ తర్వాత బరువు తగ్గేందుకు తనకు ఆరు నెలల సమయం పట్టిందంటోంది మందిరా. పెళ్లైన 13 సంవత్సరాల తర్వాత గర్భం దాల్చిన మందిరా, గర్భిణిగా ఉన్నప్పుడు 22 కిలోల బరువు పెరిగి, డెలివరీ తర్వాత ఈ బరువు తగ్గి పూర్వపు స్థితికి రావడానికి ఆరు మాసాల సమయం పట్టినట్లు చెప్పారు.
బరువు తగ్గాలంటే మాటలు కాదు. ఇందుకోసం తీసుకునే ఆహారంలో మార్పులు చేసుకోవాలి. అలాగే కొన్ని వ్యాయామాల్ని కూడా సాధన చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే తనకెంతో ఇష్టమైన స్వీట్లను కూడా పక్కన పెట్టానంటోందీ మందిరా. అమ్మ అయిన తర్వాత 40 రోజులకే బరువు తగ్గేందుకు సాధన మొదలుపెట్టినట్లు చెప్పారు. ఆరు నెలల్లో 20 కిలోలు తగ్గాలన్న లక్ష్యాన్ని పెట్టుకున్నట్లు, ఇందుకు కచ్చితమైన ఆహార నియమాలు పాటించినట్లు వివరిస్తోంది.
- స్వీట్లను పూర్తిగా పక్కకు పెట్టి, వాటికి బదులుగా సహజ చక్కెరలు నిండిన పండ్లు, ఖర్జూరం.. వంటివి మాత్రమే తీసుకుందట.
- అలాగే వారంలో ఆరు రోజులు వ్యాయామాలు చేసేదని, స్క్వాట్స్, పిలాటిస్, బరువులెత్తడం, పుషప్స్.. ఇలా రోజుకొకటి చొప్పున గంట పాటు సాధన చేసినట్లు చెబుతోంది.
- ఇక వారానికి రెండుసార్లు గంటన్నర పాటు నడిచేదని, బరువు తగ్గడంలో ఈ నడక ఎంతో ప్రభావవంతంగా పనిచేసిందని వివరిస్తోంది.
- యోగా, ధ్యానం, మానసిక ప్రశాంతతను అందిస్తూ పరోక్షంగా బరువు తగ్గేందుకూ దోహదం చేశాయని, అనుకున్నట్లుగానే ఆరు నెలల్లో సుమారు 20 కిలోల పైన తగ్గినట్లు చెబుతూ తన వెయిట్‌లాస్ జర్నీని పంచుకుంది మందిరా.
బరువు తగ్గేందుకు రోజుకు ఎన్ని మెట్లు ఎక్కాలి? ఇది తెలిస్తే లిఫ్ట్ కూడా వాడరు!
బరువు తగ్గాలంటే వ్యాయామాలు మాత్రమే కాదు - రోజూ ఇది తిన్నా ఈజీగా వెయిట్ లాస్!