Are You Wearing Jasmine?:వేసవి కాలం అంటే మండే ఎండలు, ఉక్కిరిబిక్కిరి చేసే ఉక్కపోతలే కాదు.. వేసవి అంటే మల్లెల పరిమళాలు కూడా! ఎండాకాలంలోనే మల్లెలు విరగబూస్తాయి. బజారుల్లో గుట్టలు గుట్టలుగా కనిపిస్తాయి. ఇక ఆడవారికి మల్లెపూలంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. భర్త ఓ మూర మల్లెలు తెస్తే ఎంతగానో మురిసిపోతారు. అయితే.. ఇంట్లో, తోటలో లభించే మల్లెపూలు పరిమళం వెదజల్లితే.. మార్కెట్లో లభించే మల్లెలు మాత్రం విషాన్ని వ్యాపింపజేస్తున్నాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి.. ఆ వివరాలేంటో ఈ స్టోరీలో చూద్దాం..
మల్లెపూలు ఎంత ఫ్రెష్‌గా ఉంటే అంత సువాసన వెదజల్లుతాయి. అయితే.. నిజమైన మల్లెలు సిగలో పెట్టుకున్న కొద్దిసేపటికి వాడిపోతుంటాయి. మరి.. మార్కెట్లో అలా గాలికి పెడితే వెంటనే వాడిపోతాయి కదా.. అందుకే వ్యాపారులు మల్లెలను కెమికల్స్‌తో ముంచుతున్నారట! ఎంతసేపైనా మల్లె పూలు వాడిపోకుండా ఉండడానిక పలు రకాల రంగులు, రసాయనాలను వాడుతున్నారట. ఇవే మనుషుల ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తున్నాయని నిపుణులు అంటున్నారు.
పూలు ఎక్కువసేపు తాజాగా ఉండేందుకు కాపర్ సల్పేట్ కలిపిన నీటిలో మల్లెపూలను ముంచి తీస్తున్నారట. ఇలా చేసిన పూలు కొన్ని గంటల పాలు ఫ్రెష్‌గా కనిపిస్తాయి. ఈ విషయం తెలియని చాలా మంది మహిళలు పూలు ఫ్రెష్‌గా ఉన్నాయని కొనుగోలు చేస్తుంటారు. కాపర్ సల్ఫేట్ నీటిలో ముంచిన మల్లెపూలు పెట్టుకోవడం వల్ల చర్మ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అంతే కాకుండా ఇతర ఆరోగ్య సమస్యలు ఎటాక్ అయ్యే అవకాశం ఉందంటున్నారు.
చర్మంపై దద్దుర్లు: కాపర్ సల్ఫేట్ ఒక విషపూరితమైన రసాయనం. కాపర్ సల్ఫేట్ నీటిలో ముంచిన మల్లెపూలు పెట్టుకోవడం వల్ల చర్మానికి చికాకు కలిగించి, దద్దుర్లు, దురద, చర్మం ఎరుపు, వాపు వంటి సమస్యలకు దారితీస్తుందని అంటున్నారు.