Walking Mistakes To Avoid :ఫిట్‌గా ఉండటానికి, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, బరువు తగ్గడానికి- ఇలా రకరకాల కారణాలతో చాలామంది వాకింగ్ చేస్తుంటారు. వాకింగ్ చెయ్యడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని అందరికీ తెలుసు. అయితే వాకింగ్ చేసేటప్పుడు చేసే కొన్ని తప్పుల వల్ల ఫలితాలు తారుమారు అవుతాయని అంటున్నారు నిపుణులు. అందుకే ఎలా వాకింగ్ చెయ్యాలని, ఎలా వాకింగ్ చెయ్యకూడదని చెబుతున్నారు ఇక్కడ తెలుసుకోండి.
మాట్లాడుతూ వాకింగ్ చెయ్యకూడదు
చాలామంది వాకింగ్ చేసేటప్పుడు స్నేహితులతోనో, ఇతరులతోనో అలా మాట్లాడుకుంటూ వాకింగ్ చేస్తుంటారు. నిజానికి ఇలా మాట్లాడుతూ వాకింగ్ చెయ్యడం వల్ల నష్టం కలుగుతుందని అంటున్నారు ప్రముఖ యోగ థెరపిస్ట్ అంకత. మాట్లాడుతూ నడవడం అలవాటు అయితే వాకింగ్ చెయ్యడం తక్కువ, మాట్లాడటం ఎక్కువ అవుతుందని అంటున్నారు. దీంతో వాకింగ్ వల్ల కలిగే ప్రయోజనాలు కలగవని అంటున్నారు.
వీకెండ్లో ఎక్కువ వాకింగ్ చెయ్యొద్దు
వీకెండ్ సెలవు రోజున చాలామంది వాకింగ్ కాస్త ఎక్కువ సేపు చేస్తుంటారు. అంటే ఎక్కువ దూరం వాకింగ్ చేస్తుంటారు. అయితే వీకెండ్లో వాకింగ్ ఎక్కువ చేయడం వల్ల శరీరం ఎక్కువ అలసిపోతుందని, దానికి తగినట్లు విశ్రాంతి ఇవ్వకపోతే శరీరానికి నష్టం తప్పదని నిపుణులు అంటున్నారు. అందుకే వీకెండ్లో ఎక్కువ వాకింగ్ చేయకపోవడం ఉత్తమం అని సూచిస్తున్నారు.
ఒకే స్పీడు వద్దు
వాకింగ్ అంటే చాలామంది ఒకటే స్పీడ్‌ను మెయింటెయిన్ చెయ్యాలని అనుకుంటూ ఉంటారు. నిజానికి ఇది శరీరానికి మంచిది కాదు. వాకింగ్‌లో మూడు నిమిషాలు స్పీడ్‌గా చేస్తే, మూడు నిమిషాలు నెమ్మదిగా చేయాలని అంటున్నారు నిపుణులు. ఇలా చేయడం వల్ల శరీరంలో మెటబాలిక్ యాక్టివిటీ ఎక్కువ అవుతుందని వివరిస్తున్నారు.