తెలంగాణ

telangana

ETV Bharat / health

"ఆరోగ్యానికి 10 వేల అడుగులు" - ఈ కాన్సెప్ట్​ నిజంగా మంచిదేనా? - రీసెర్చ్​లో ఆసక్తికర విషయాలు! - Walking 10k Steps Per Day Benefits - WALKING 10K STEPS PER DAY BENEFITS

Walking 10k Steps Per Day Health Benefits : ఎవరైనా, ఎక్కడైనా చేయడానికి అనువుగా ఉండే తేలికైన వ్యాయామం "నడక". కానీ.. పలు రకాల కారణాలతో అది కూడా చేయలకోపోతున్నారు చాలా మంది. దీంతో.. "కనీస నడక" అనే కాన్సెప్ట్​ మొదలైంది. అదే.. రోజుకు 10వేల అడుగులు వేయడం. మరి, ఇన్ని అడుగులు వేస్తే నిజంగా ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

Walking 10k Steps Per Day Health Benefits
WALKING HEALTH BENEFITS (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : May 25, 2024, 12:08 PM IST

Health Benefits Of Walking 10,000 Steps A Day :నేటి ఆధునిక కాలంలో జీవన శైలి మారింది. చాలా మంది ఉద్యోగం, వ్యాపారం అంటూ బిజీబిజీగా గడుపుతున్నారు. దీంతో శారీరక వ్యాయామం చేయడం తగ్గింది. అందుకే.. కనీసం రోజుకు కొంత దూరమైనా నడవాలని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే 'రోజుకు 10 వేల అడుగులు' నడవాలనే ఒక కాన్సెఫ్ట్​ తెరపైకి వచ్చింది. మరి, ఆరోగ్యంగా ఉండడానికి నిజంగా 10 వేల అడుగులు సరిపోతాయా? లేదంటే ఎక్కువ నడవాలా? తక్కువ నడవాలా? దీనిపై నిపుణులు ఏం చెబుతున్నారు? వంటి పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

అసలు 10వేల అడుగుల కాన్సెప్ట్ ఎలా వచ్చిందంటే?

నిజానికి.. డైలీ 10వేల అడుగులు నడిస్తే హెల్త్​కు మంచిదనే సలహా శాస్త్రవేత్తల నుంచి వచ్చింది కాదు. 1964 టోక్యో ఒలింపిక్స్‌కు ముందు జపాన్‌కు చెందిన గడియారాల కంపెనీ ‘యమసా’ తమ ప్రొడక్ట్స్​ కోసం ఇచ్చిన ఓ యాడ్​లో ఈ విషయాన్ని ప్రస్తావనకు తెచ్చింది. అంతేకాదు.. ఆ టైమ్​లో కొత్తగా ఓ ‘పెడోమీటర్‌’ను ఆవిష్కరించింది యమసా కంపెనీ. అది మెటల్‌ బాల్‌తో ఉండే ఒక లెక్కింపు డివైజ్. దాన్ని మనం నడుముకు ధరించడం ద్వారా రోజుకు ఎన్ని అడుగులు వేశామో కౌంట్ చేస్తుంది. ఒలింపిక్స్‌ టైమ్స్​లో ఆ పరికరానికి విశేష ఆదరణ దక్కింది. ఆ తర్వాతే ప్రపంచవ్యాప్తంగా 'రోజుకు 10వేల అడుగులు' అనే మాట బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఈ కాన్సెప్ట్​పై శాస్త్రవేత్తలు కూడా అధ్యయనం చేయడం మొదలుపెట్టారట.

అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే..?

'రోజుకు 10వేల అడుగులు' అనే కాన్సెప్ట్​పై గత సంవత్సరం అమెరికాకు చెందిన జాన్స్‌ హాప్‌కిన్స్‌ యూనివర్సిటీ, పోలండ్‌లోని లాడ్జ్‌ మెడికల్‌ యూనివర్సిటీ ఓ అధ్యయనాన్ని ప్రచురించాయి. ఇందుకోసం దాదాపు 2.26లక్షల మందితో 17 వేర్వేరు పరిశోధనలు నిర్వహించాయి. ఈ క్రమంలోనే డైలీ ఎంతసేపు నడవాలనే ప్రశ్నకు పరిశోధకులు రకరకాల ప్రత్యామ్నాయాలు సూచించారు. మనం వేసే అడుగుల సంఖ్యను బట్టి వివిధ ఆరోగ్య ప్రయోజనాలుంటాయని వారు వెల్లడించారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

  • రోజుకు దాదాపు 4వేల అడుగులు నడవడం ద్వారా అకాల మరణాలకు అడ్డుకట్ట వేయవచ్చని పరిశోధకులు కనుగొన్నారు. అంతేకాదు.. ఇది అల్జీమర్స్‌, డిమెన్షియా వ్యాధుల ముప్పును తగ్గిస్తుందన్నారు. అలాగే అధికబరువు/ఊబకాయం, డయాబెటిస్‌ వంటి సమస్యలను కూడా దూరం చేస్తుందని వారు కనుగొన్నారు.
  • డైలీ 2,337 అడుగులు నడిస్తే గుండె సంబంధిత (కార్డియోవాస్కులర్‌) జబ్బులతో మరణించే అవకాశాలు చాలా వరకు తగ్గుతాయని కనుగొన్నారు.
  • అదేవిధంగా.. రోజుకు 1000 అడుగుల చొప్పున నడకను అదనంగా పెంచుకుంటూ పోతే గుండెజబ్బుల మరణాలు 15 శాతం తగ్గిపోతాయని, 500 అడుగుల చొప్పున పెంచుకుంటూ పోతే.. హార్ట్ ప్రాబ్లమ్స్ 7 శాతం మేర తగ్గుతాయని పరిశోధకులు కనుగొన్నారు.
  • ఇకపోతే 60 ఏళ్లు దాటినవారు రోజుకు 6 వేల అడుగుల నుంచి 10 వేల అడుగులు నడిస్తే అకాల మరణాల ముప్పు 42 శాతం తగ్గుతుందని ఈ పరిశోధకులు పేర్కొన్నారు.

తిన్న తర్వాత కేవలం 10 నిమిషాలు నడవండి - మీ శరీరంలో ఊహించలేని మార్పు!

చిన్న లక్ష్యాలతో ఆరోగ్యానికి మేలు :

  • ఇప్పటికీ రోజూ గరిష్ఠంగా ఎంత నడవాలనే విషయంలో స్పష్టత లేదు. అయితే, ఎంత ఎక్కువ నడిస్తే అంత మంచి లాభాలుంటాయని పరిశోధకులు సూచిస్తున్నారు.
  • మెరుగైన హెల్త్ బెనిఫిట్స్ కోసం 8వేల నుంచి 10వేల అడుగులు నడవడం అనేది బెటర్​ అంటున్నారు. కాబట్టి వీలైనంత యాక్టివ్​గా ఉంటూ రెగ్యులర్​గా వ్యాయామం చేయడం మంచిదని చెబుతున్నారు.
  • కనీసం రోజుకు అరగంట అయినా వర్కౌట్‌ చేసేలా చూసుకోవాలంటున్నారు. ఫలితంగా ఎన్నో ఆరోగ్యకర ప్రయోజనాలు పొందవచ్చని పరిశోధకులు పేర్కొంటున్నారు.
  • అయితే, ఒక్క రోజులోనే 10వేల అడుగులను రీచ్ అవ్వలేకపోవచ్చు. అంతేకాదు.. కొన్నిసార్లు వేగంగా నడవాలన్న ప్రయత్నంలో గుండె మీద ఒత్తిడి పడుతుందనే విషయాన్ని గమనించాలంటున్నారు.
  • కాబట్టి ముందుగా 2,500 నుంచి 3000లతో స్టార్ట్ చేసి నెమ్మదిగా ప్రతి 15రోజులకి 500 చొప్పున పెంచుకుంటూ వెళ్లినా ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందంటున్నారు.
  • అధిక బరువు ఉన్నవాళ్లు 1000 అడుగులతో మొదలుపెట్టినా చాలంటున్నారు. అలాగే వృద్ధాప్యంలో ఉన్నవాళ్లు తమ శక్తి మేరకే లక్ష్యాన్ని పెట్టుకోవాలని సూచిస్తున్నారు.

గమనిక :ఇక్కడ అందించిన సమాచారం వైద్య నిపుణులు, పరిశోధకుల అధ్యయనాలను పరిశీలించి ఇచ్చినది మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపై ముందుగా వైద్యులను సంప్రదించిన తర్వాతే ఎలాంటి నిర్ణయమైనా తీసుకోవడమే మంచిది.!

హెల్దీగా ఉండటానికి - ఏ వయసువారు ఎంత దూరం నడవాలి ? మీకు తెలుసా ?

ABOUT THE AUTHOR

...view details