ETV Bharat / state

ఒకే గుడ్డు నుంచి 2 కోడి పిల్లలు - నుదుటన ముక్కుతో మేక - ఈ వింతలు మీరు చూశారా? - STRANGE INCIDENT

వేర్వేరు చోట్ల వింత ఘటనలు - ఒకే కోడి గుడ్డులో రెండు పిల్లలు - తల భాగంలో కళ్లు, నుదుటి భాగంలో ముక్కుతో పుట్టిన ఓ మేక

STRANGE TWO CHICKS IN ONE EGG
Strange Two Chicks in one Hen Egg (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : 14 hours ago

Updated : 13 hours ago

Strange Two Chicks in one Hen Egg : ప్రపంచంలో వింత ఘటనలెన్నో జరుగుతుంటాయి. అరుదుగా జరిగే ఆ వింతలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తాయి. తాజాగా ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం సొనాల గ్రామంలో అరుదైన ఘటన జరిగింది. ఓ కోడి గుడ్డు పెట్టగా, అందులో నుంచి ఏకంగా రెండు కోడి పిల్లలు బయటకు వచ్చాయి. బోథ్ మండలం సొనాల గ్రామానికి చెందిన షేక్ తోఫిక్ కోళ్లను పెంచుతుంటారు. అయితే ఆయన తన కోళ్ల కోడిగుడ్లను పొదిగించగా, ఈ నెల 23న ఒక గుడ్డులో నుంచి రెండు పిల్లలు బయటకు వచ్చాయి. దీంతో ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైన షేక్ తోఫిక్, ఆ రెండు పిల్లలను పరిశీలించగా అవి పూర్తి ఆరోగ్యంగా ఉన్నాయి.

Strange Two Chicks in one Hen Egg
ఒక గుడ్డులోనుంచి పుట్టిన రెండు కోడి పిల్లలు (ETV Bharat)

ఒక్క కోడి గుడ్డులో రెండు కోడి పిల్లలు పుట్టిన విషయం తెలుసుకున్న చుట్టుపక్కల వారందరూ వాటిని చూసేందుకు తరలివస్తున్నారు. అయితే ఈ వింత ఘటనపై సొనాల ఇన్​ఛార్జి పశు వైద్యాధికారి సుశీల్ కుమార్​ను సంప్రదించగా, జన్యుపరమైన లోపాలతో ఇలా జన్మిస్తాయని వివరించారు. ఇలాంటివి అరుదుగా జరుగుతుంటాయని తెలిపారు. ఈ నేపథ్యంలో గ్రామస్థులు సైతం కోడికి కవలలు పుట్టాయి అంటూ వింత ఘటనను పలు రకాలుగా చర్చించుకుంటున్నారు.

STRANGE GOAT BIRTH IN NIZAMABAD
తల భాగంలో కళ్లు, నుదుటి భాగంలో ముక్కుతో పుట్టిన మేక పిల్ల (ETV Bharat)

తల భాగంలో కళ్లు, నుదుటి భాగంలో ముక్కుతో ఓ మేక పిల్ల : మరోవైపు నిజామాబాద్ జిల్లాలోనూ ఇలాంటి ఓ ఘటన వెలుగు చూసింది. ఈ నెల 22న ఓ వింత మేక పిల్ల జన్మించింది. జిల్లాలోని ఎడపల్లి మండలంలోని మంగళ్ పహాడ్ గ్రామానికి చెందిన రామరాజుకు చెందిన ఓ మేక ఆదివారం రెండు పిల్లలకు జన్మనిచ్చింది. అయితే అందులో ఒక మేక పిల్ల తల భాగంలో కళ్లు, నుదుటి భాగంలో ముక్కుతో పుట్టింది. దీంతో అక్కడున్న గ్రామస్థులు ఈ వింత మేకను చూసి ఒకింత ఆశ్చర్యానికి గురవుతున్నారు. దీనిపై ఓ పశు వైద్యాధికారిని సంప్రదించగా, జన్యు లోపంతో మేక పిల్ల అలా పుట్టిందని తెలిపారు.

Two Headed Goat Suryapet : రెండు తలలున్న మేకను చూశారా.. ఇదిగో ఈ వీడియో చూసేయండి

వింత ఘటన.. ఆరు కాళ్లతో గొర్రెపిల్ల జననం

Last Updated : 13 hours ago
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.