Walking 10k Steps Per Day Tips In Telugu :ఆధునిక కాలంలో జీవన శైలి మారింది. ఉద్యోగం, వ్యాపారం అంటూ బిజీబిజీగా గడుపుతున్నారు. దీంతో శారీరక వ్యాయామం చేయడం తగ్గింది. అందుకే కనీసం రోజుకు కొంత దూరమైనా నడవాలని అనుకుంటున్నారు. ఈ క్రమంలో రోజుకి 10 వేల అడుగులు నడవాలని టార్గెట్ పెట్టుకుంటున్నారు కొందరు. కానీ కొన్ని సార్లు దాన్ని రీచ్ కాలేకపోతున్నారు. 10 వేల అడుగులు అంటే వినడానికి ఈ నంబర్ కొందర్ని భయపెట్టవచ్చు. కొన్ని టిప్స్ పాటించడం వల్ల సులువుగా రోజుకు 10వేల అడుగులు ఈజీగా నడవవచ్చని డా.అపూర్వ దువా చెబుతున్నారు.
రోజుకు 10 వేల అడుగుల్ని నడవడం పెడోమీటర్, ఫిట్‌నెస్ ట్రాకింగ్ పరికరంలో లక్ష్యాన్ని పూర్తి చేయడానికి పెట్టుకున్న ఒక మ్యాజిక్ ఫిగర్. అంతే కానీ రోజుకు 10 వేల అడుగులు నడవటం వల్ల కలిగే ప్రయోజనాలకు శాస్త్రీయ ఆధారాలు లేవు. దీని వల్ల ఉన్న ప్రయోజనమేంటంటే ఎక్కువ దూరం నడిచేలా ఈ లక్ష్యం మనల్ని ప్రేరేపిస్తుంది. రోజుకి 10 వేల అడుగులు నడవడానికి ఈ సింపుల్ టిప్స్ ఫాలో అవ్వండి.
1. ఇష్టమైన ప్రాంతాల్లో నడవటం
మీకు ఇష్టమైన ప్రాంతాల్లో నడవటం వల్ల మానసిక స్థితి మెరుగుపడుతుంది. మీకు నచ్చిన ప్రాంతాల్లో నడవటం వల్ల మీకు తెలియకుండానే ఎక్కువ దూరం నడిచే అవకాశం ఉంటుంది. మీకు నచ్చిన పాటను వింటూ చిన్న పాటి నృత్యం చేసుకుంటూ వెళ్లండి. దాని వల్ల మీ లక్ష్యాన్ని ఈజీగా చేరుకుంటారు.
2. నచ్చిన ఆట ఆడటం
నచ్చిన ఆటలో పాల్గొనటం వల్ల హాయిగా అనిపించడమే కాకుండా 10 వేల అడుగుల లక్ష్యాన్ని సులభంగా చేరుకోవచ్చు. మీ జీవిత భాగస్వామిని జత చేసుకోవడం వల్ల ఇంకా ఎక్కువ ఉత్సాహంగా ఆడగలరు.
3. ఇంటి పనులు చేయడం
కొందరు ఇంటి పనులు చేయడం ఎలాంటి వ్యాయామం కిందకు రాదనుకుంటారు. కానీ అది నిజం కాదు. రోజూ కొంత సమయం ఇంటి పనులు చేయడం వల్ల ఎక్కువ సేపు నడిచే అవకాశముంటుంది. స్వీపింగ్, వాక్యూమింగ్, మాపింగ్, డస్టింగ్, క్లీనింగ్ లాంటి కార్యకలాపాలు మీ లక్ష్యాన్ని చేరుకోవడంలో సాయపడతాయి.