ETV Bharat / entertainment

రూ.100 కోట్లు ఇచ్చినా ఆ పాత్ర చేయను : దర్శకుడిపై ప్రముఖ హీరోయిన్ అసహనం - GADAR 2 MOVIE

దర్శకుడిపై అసహనం వ్యక్తం చేసిన ప్రముఖ హీరోయిన్! - ఎందుకంటే?

Gadar 2
Gadar 2 (source Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : 3 hours ago

Gadar 2 Ameesha Patel : సన్నీ దేవోల్‌, అమీషా పటేల్‌ జంటగా నటించిన చిత్రం గదర్‌ 2. అనిల్‌శర్మ తెరకెక్కించిన ఈ చిత్రం గతేడాది విడుదలై బాక్సాఫీస్‌ దగ్గర భారీ విజయాన్ని అందుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనిల్‌ శర్మ ఈ సినిమా విశేషాలు తెలిపారు. అత్త పాత్రలో నటించడానికి అమీషా పటేల్‌ అంగీకరించలేదని ఆయన అన్నారు. "నర్గీస్ దత్ వంటి గొప్ప తారలు కూడా చిన్న వయసులోనే అత్తయ్య పాత్రలు చేశారని ఎంతో నచ్చజెప్పా. అయినా ఆమె మాత్రం చేయనని చెప్పేసింది" అని అనిల్‌ వ్యాఖ్యలు చేశారు.

దీనిపై అమీషా పటేల్ స్పందించింది. దర్శకుడి తీరుపై అసహనం వ్యక్తం చేసింది. "డియర్‌ అనిల్‌. ఇది కేవలం సినిమా మాత్రమే. రియల్ లైఫ్​లో ఓ కుటుంబానికి సంబంధించిన విషయం కాదు. కాబట్టి, ఆన్‌స్క్రీన్‌లో ఏం చేయాలి? ఏం చేయకూడదు? అనేది పూర్తిగా నా వ్యక్తిగత అభిప్రాయం. మీరంటే నాకెంతో గౌరవం ఉంది. గదర్‌ కోసమే కాదు, ఏ చిత్రం కోసమైనా నేను అత్తయ్య పాత్రలు చేయను. రూ.100 కోట్లు ఇచ్చినా కూడా ఆ పాత్ర చేయడానికి అస్సలు అంగీకరించను" అని ఆమె పేర్కొన్నారు.

కాగా, దర్శకుడు అనిల్‌ శర్మ గురించి అమిషా పటేల్​ ఈవిధంగా స్పందించడం ఇది మొదటి సారి కాదు. తనకు ఒక్క మాట కూడా చెప్పకుండా అనిల్‌ 'గదర్‌ 2' క్లైమాక్స్‌ మార్చేశారని గతంలో అమీషా వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తన కొడుకు ఉత్కర్ష్‌ శర్మ (గదర్‌ 2 లో చరణ్‌జీత్‌ రోల్‌లో కనిపించాడు) పాత్రను హైలైట్‌ చేయడం కోసమే ఆయన ఆ విధంగా చేశారని ఆమె పేర్కొన్నారు.

గదర్‌ ఏక్‌ ప్రేమ్‌కథకు సీక్వెల్‌గా గదర్‌ 2 తెరకెక్కింది. పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామాగా ఇది రూపొందింది. సన్నీ దేవోల్‌, అమీ షా పటేల్‌ ప్రధాన పాత్రల్లో కనిపించారు. సన్నీ దేవోల్‌, అమీషా యాక్టింగ్‌ను సినీ ప్రియులు ఎంతో ప్రశంసించారు. రూ.60 కోట్లతో ఈ చిత్రాన్ని నిర్మించగా దాదాపు రూ.600 కోట్లకు పైగా వసూళ్లను సాధించిందీ చిత్రం. త్వరలోనే గదర్‌ 3 కూడా ఉండే అవకాశం ఉందని మూవీ టీమ్​ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఆ డైరెక్టర్​తో కలిసి పని చేయాలని ఉంది : రిషబ్​​ శెట్టి

'నాపై నేనే దాడి చేసుకున్నా' - షారుక్​తో వివాదంపై 9 ఏళ్ల తర్వాత స్టార్ సింగర్​ స్పందన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.