ETV Bharat / business

న్యూ ఇయర్ ఆఫర్‌ - ఆ క్రెడిట్ కార్డులపై క్యాష్‌బ్యాక్స్‌+ రివార్డ్స్‌+ గిఫ్ట్‌ వోచర్స్ - మరికొద్ది రోజులు మాత్రమే ఛాన్స్‌! - HDFC CREDIT CARD OFFERS

లైఫ్‌ టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డ్స్ - క్యాష్‌బ్యాక్స్‌+ రివార్డ్స్‌+ గిఫ్ట్‌ వోచర్స్ - న్యూ ఇయర్‌ ఆఫర్‌ మరికొద్ది రోజులు మాత్రమే!

Credit Card
Credit Card (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : 3 hours ago

HDFC Credit Card Offers : కొత్తగా క్రెడిట్ కార్డ్ తీసుకుందామని అనుకుంటున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్‌. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ న్యూ ఇయర్‌ ఆఫర్స్‌ ప్రకటించింది. ముఖ్యంగా మిలీనియా, డైనర్స్ క్లబ్‌ ప్రివిలైజ్‌, బిగ్ గ్రో, పిక్సెల్‌ ప్లే, పిక్సెల్‌ గో క్రెడిట్ కార్డ్‌లను 'లైఫ్‌ టైమ్ ఫ్రీ'గా ఇస్తోంది. అయితే ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుంది. 2024 డిసెంబర్‌ 17 నుంచి 2025 జనవరి 16 వరకు మాత్రమే ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంటుందని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ స్పష్టం చేసింది. ఇదే సమయంలో 'రెగాలియా గోల్డ్‌' కార్డ్‌ను తీసుకున్నవారికి ఒక ఏడాది వరకు దానిని ఉచితంగా అందించనున్నట్లు తెలిపింది.

పాపులర్ కార్డ్స్‌
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కొన్ని పాపులర్‌ క్రెడిట్ కార్డ్‌లపై కూడా ఫెస్టివల్‌ ఆఫర్స్ అందిస్తోంది. ముఖ్యంగా స్విగ్గీ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ క్రెడిట్ కార్డ్‌, టాటా న్యూ ప్లస్‌ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌, టాటా న్యూ ఇన్ఫినిటీ హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డ్‌లపై ఎటువంటి యాన్యువల్ ఫీజులు, ఇతర ఛార్జీలు లేకుండా అందిస్తోంది. అయితే ఈ ఆఫర్ డిసెంబర్‌ 31 వరకే అందుబాటులో ఉంటుంది.

Millennia Credit Card : ఈ మిలీనియా క్రెడిట్ కార్డ్‌లను నెలకు రూ.35,000లకు పైగా జీతం సంపాదించే ఉద్యోగులకు అందిస్తారు. అలాగే స్వయం ఉపాధి పొందుతూ సంవత్సరానికి రూ.6 లక్షల వరకు ఐటీఆర్‌ దాఖలు చేసేవారికి అందిస్తారు. దీని యాన్యువల్‌ లేదా జాయినింగ్ ఫీజు రూ.1000. ఒక ఏడాదిలో కస్టమర్‌ ఈ కార్డ్‌ ఉపయోగించి రూ.1 లక్ష వరకు ఖర్చు చేస్తే ఈ ఫీజును బ్యాంక్‌ పూర్తిగా మాఫీ చేస్తుంది. ఈ కార్డ్‌పై ఇచ్చే ఆఫర్లు :

  • అమెజాన్‌, బుక్‌ మై షో, కల్ట్‌.ఫిట్‌, ఫ్లిప్‌కార్ట్‌, మింత్రా, సోనీ లివ్‌, స్విగ్గీ, టాటా CLiQ, ఊబర్‌, జొమాటోల్లో చేసే కొనుగోళ్లపై 5 శాతం వరకు క్యాష్‌బ్యాక్
  • ఈఎంఐ, వాలెట్ లావాదేవీలతో సహా అన్ని ఇతర ఖర్చులపై (ఫ్యూయెల్ ఖర్చులు తప్ప) 1 శాతం వరకు క్యాష్‌బ్యాక్
  • ఒక క్యాలెండర్ క్వార్టర్‌లో రూ.1 లక్ష వరకు ఖర్చు చేస్తే రూ.1000 విలువైన గిఫ్ట్‌ ఓచర్

Diners Club Privilege Credit Card : ఈ డైనర్స్‌ క్లబ్ ప్రివిలైజ్‌ క్రెడిట్ కార్డ్‌లను కూడా నెలకు రూ.35,000లకు పైగా జీతం సంపాదించే ఉద్యోగులకు అందిస్తారు. అలాగే స్వయం ఉపాధి పొందుతూ సంవత్సరానికి రూ.6 లక్షల వరకు ఐటీఆర్‌ దాఖలు చేసేవారికి అందిస్తారు. దీని యాన్యువల్‌ లేదా జాయినింగ్ ఫీజు రూ.1000. ఒక ఏడాదిలో కస్టమర్‌ ఈ కార్డ్‌ ఉపయోగించి రూ.3 లక్షల వరకు ఖర్చు చేస్తే ఈ ఫీజు నుంచి మినహాయింపు లభిస్తుంది. ఈ కార్డ్‌పై ఇచ్చే ఆఫర్లు :

  • బుక్‌ మై షోలో ఒక టికెట్ బుక్ చేస్తే మరో టికెట్ ఫ్రీ
  • స్విగ్గీ, జొమాటో ఆర్డర్స్‌పై 5X రివార్డ్ పాయింట్స్‌
  • వెల్కమ్ బెనిఫిట్ కింద స్విగ్గీ వన్‌, టైమ్స్ ప్రైమ్‌ - కాంప్లిమెంటరీ యాన్యువల్ మెంబర్‌షిప్‌
  • మూడు మాసాలకు రూ.1.5 లక్షల వరకు ఖర్చు చేస్తే రూ.1500 విలువైన మారియట్‌, డెకాథ్లాన్ ఓచర్స్‌
  • ప్రపంచంలో ఎక్కడైనా సరే 8 కాంప్లిమెంటరీ ఎయిర్‌పోర్ట్ లాంజ్‌ యాక్సెస్‌
  • మీరు ఖర్చు చేసే ప్రతి రూ.150లపై 4 రివార్డ్ పాయింట్స్

BizGrow Credit Card : ఈ బిగ్‌గ్రో కార్డ్ జాయినింగ్ ఫీజు రూ.500. ఒక సంవత్సరంలో ఈ కార్డ్ ద్వారా రూ.1 లక్ష ఖర్చు చేస్తే ఈ ఫీజును పూర్తిగా మాఫీ చేస్తారు. ఈ కార్డ్‌పై ఇచ్చే ఆఫర్లు :

  • కొన్ని నిర్దేశిత పేమెంట్లపై 10X క్యాష్ పాయింట్స్‌
  • క్వార్టర్లీ రూ.1 లక్ష ఖర్చు చేస్తే 'మైల్‌ స్టోన్ బెనిఫిట్' కింద 2000 బోనస్‌ క్యాష్‌ పాయింట్స్
  • 1 శాతం ఫ్యూయెల్ సర్‌ఛార్జీ మినహాంపు
  • మీరు ఖర్చు చేసే ప్రతి రూ.150లపై 2 క్యాష్‌ పాయింట్స్

Pixel Play Credit Card : ఈ పిక్సెల్‌ ప్లే క్రెడిట్‌ కార్డ్ జాయినింగ్ ఫీజు రూ.500. ఒక సంవత్సరంలో ఈ కార్డ్ ద్వారా రూ.1 లక్ష ఖర్చు చేస్తే ఈ ఫీజును పూర్తిగా మాఫీ చేస్తారు. నెలకు రూ.25వేలకు పైగా సంపాదించే ఉద్యోగులకు, స్వయం ఉపాధి పొందుతూ సంవత్సరానికి రూ.6లక్షల వరకు ఐటీఆర్‌ ఫైల్ చేసేవారికి ఇది ఇస్తారు. ఈ కార్డ్‌పై ఇచ్చే ఆఫర్లు :

  • బుక్‌ మై షో, జొమాటో, బ్లింకిట్‌, రిలయన్స్ స్మార్ట్ బజార్‌, క్రోమా, రిలయన్స్ డిజిటల్‌, నైకా, మింత్రాల్లో చేసే కొనుగోళ్లపై 5 శాతం క్యాష్‌బ్యాక్‌ లభిస్తుంది.
  • అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌, పేజాప్‌ కొనుగోళ్లపై 3 శాతం క్యాష్‌బ్యాక్‌
  • ఇతర అన్ని రకాల కొనుగోళ్లపై 1 శాతం క్యాష్‌ బ్యాక్‌
  • యూపీఐ పేమెంట్స్‌పై 1 శాతం క్యాష్ బ్యాక్‌
  • కార్డ్‌ డిజైన్‌, బిల్లింగ్ సైకిల్‌ను కస్టమైజ్ చేసుకోవచ్చు.

Pixel Go Credit Card : ఈ పిక్సెల్‌ ప్లే క్రెడిట్‌ కార్డ్ జాయినింగ్ ఫీజు రూ.250. ఒక సంవత్సరంలో ఈ కార్డ్ ద్వారా రూ.50,000 ఖర్చు చేస్తే ఈ ఫీజును పూర్తిగా మాఫీ చేస్తారు. నెలకు రూ.8 వేలకు పైగా సంపాదించే ఉద్యోగులకు, స్వయం ఉపాధి పొందుతూ సంవత్సరానికి రూ.6 లక్షల వరకు ఐటీఆర్‌ ఫైల్ చేసేవారికి ఇది ఇస్తారు.

  • నిర్దేశిత ఆర్థిక లావాదేవీలపై 1 శాతం అన్‌లిమిటెడ్ క్యాష్‌బ్యాక్‌

  • షాప్‌ నౌ - పే ఇన్ పార్ట్స్‌ విధానంలో ఈఎంఐ ఫెసిలిటీ
  • స్విగ్గీ డైన్‌అవుట్‌ భాగస్వామి రెస్టారెంట్లపై 25 శాతం వరకు డిస్కౌంట్‌

నయా క్రెడిట్ కార్డ్ స్కామ్‌ - కార్డ్ లిమిట్ పెంచుతామంటూ బురిడీ - జర జాగ్రత్త!

ఆన్‌లైన్‌ షాపింగ్ చేస్తున్నారా? మీ క్రెడిట్ కార్డ్ డేటాను ప్రొటక్ట్‌ చేసుకోండిలా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.