Eyesight Improving Vegetables : సర్వేంద్రియానాం నయనం ప్రధానం అంటారు పెద్దలు. అందుకే మనం అన్ని రకాలుగా బాగుండాలంటే కంటి చూపును కాపాడుకోవడం చాలా అవసరం. పోషకాలతో నిండిన ఆహారపు అలవాట్లు కంటి ఆరోగ్యాన్ని కాపాడటంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వల్ల కొన్ని కూరగాయలు కంటి చూపును చురుగ్గా మారుస్తాయి. రెటీనా సమస్యలు, రేచీకటి, కంటి శుక్లాలు వంటి దీర్థకాలిక కంట సమస్యలు రాకుండా ఉండేందుకు కొన్ని ఆహారాలను మనం తరచుగా తప్పక తీసుకోవాల్సి ఉంటుందని కంటి వైద్య నిపుణులు చెబుతున్నారు. అలా సహజంగా మీ కంటి చూపును పెంచే కూరగాయలు ఏంటో చూసేద్దామా.
క్యారెట్ : క్యారెట్లో బీటా కెరోటిన్, విటమిన్-ఏ పుష్కలంగా ఉంటాయి. కంటి చూపును మెరుగుపరచడంలో విటమిన్-ఏ కీలక పాత్ర పోషిస్తుంది. రేచీకటి సమస్య నుంచి దూరంగా ఉంచుతుంది. వీటిలోని బీటా కెరోటిన్ మొత్తం కంటి ఆరోగ్యాన్ని కాపాడటంలో సహాయపడుతుంది.
బచ్చలికూర : రెటీనాలో సాంద్రతను పెంచే లుటీన్, జియాక్సింతిన్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు బచ్చలికూరలో మెండుగా లభిస్తాయి. ఈ హానికరమైన కాంతి నుంచి కళ్లను రక్షించడంలో, మాక్యులర్, డీజెనరేషన్, కంటి శుక్లం వంటి దీర్థకాలిక కంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో బచ్చలికూర చక్కగా ఉపయోగపడుతుంది.
కాలే :కాలేలో విటమిన్-ఏ, విటమిన్-సీ, విటమిన్-కేలతో పాటు లుటీన్, జియాంక్సంతిన్ అధికంగా ఉంటాయి. రెటీనా ఆరోగ్యానికి ఇవి చాలా బాగా సహాయపడతాయి. కంటి ఆరోగ్యాన్ని దెబ్బతీసే హానికరమైన నీలి కాంతిని ఫిల్లర్ చేయడంలో, మచ్చల క్షీణిత ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కంటిశుక్లంతో పాటు వయస్సుతో పాటు వచ్చే దృష్టి సమస్యలను నయం చేస్తుంది.
చిలకడదుంప :తియ్యటి రుచి కలిగిన చిలకడదుంపల్లో బీటా కెరోటిన్, విటమిన్-ఏ అధికంగా ఉంటాయి. ఆక్సీకరణ ఒత్తిడి నుంచి కళ్లను కాపాడేందుకు ఇవి చక్కగా సహాయపడతాయి. చిలకడ దుంపలను మీ డైట్ ప్లాన్‌లో చేర్చుకోవడం వల్ల సహజమైన కంటి ఆరోగ్యాన్ని పొందండమే కాకుండా రేచీకటి సమస్యకు దూరంగా ఉండచ్చు.
రెడ్ క్యాప్సికమ్ : విటమిన్-ఏ, విటమిన్-సీ రెడ్ క్యాప్సికమ్‌లో అధికంగా ఉంటాయి. కళ్లలోని రక్తనాళాల ఆరోగ్యాన్ని కాపాడటంలో, కంటి శుక్లాల ప్రమాదాన్ని తగ్గించడంలోనూ విటమిన్-సీ చక్కగా సహాయపడుతుంది. వీటిలోని విటమిన్-ఏ మొత్తం కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.