Tonsils Treatment in Ayurveda:గొంతులో వచ్చే టాన్సిల్స్ సమస్యతో చాలా మంది ఇబ్బందులు పడుతుంటారు. ముఖ్యంగా చిన్న పిల్లల్లో ఈ సమస్య ఎక్కువగా బాధపెడుతుంటుంది. గొంతులో నొప్పితో ఏం తినలేక, తాగలేక అవస్థలు పడుతుంటారు. ఈ సమస్య తగ్గడానికి అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే, ఆయుర్వేద పద్ధతిలో ఈ సమస్యకు చక్కటి పరిష్కార మార్గం ఉందని ప్రముఖ వైద్యులు గాయత్రీ దేవీ చెబుతున్నారు. అదేంటో ఇప్పుడు తెలుసుకందాం.
కావాల్సిన పదార్థాలు
- 50 గ్రాముల తిప్పతీగ చూర్ణం
- 50 గ్రాముల యష్టిమధు చూర్ణం
- 50 గ్రాముల గుగ్గులు
- ఒక చెంచా తేనె
- ఆర చెంచా పటిక భస్మం
తయారీ విధానం
- ముందుగా స్టౌ వెలిగించుకుని ఓ గిన్నెలో నీటిని పోసుకుని వేడిచేసుకోవాలి.
- మరోవైపు ఓ గిన్నెను తీసుకుని అందులో తిప్పతీగ, యష్టిమధు, గుగ్గులు చూర్ణం వేసి బాగా కలపాలి.
- ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని వేడి నీటిలో వేసి కాసేపు మరిగించుకోవాలి.
- అనంతరం దీనిని వడపోసుకుని వేడి చల్లారే వరకు పక్కకు పెట్టుకోవాలి.
- కాస్త గోరువెచ్చగా అయ్యాక చెంచా తేనెను కలిపేసుకుంటే ఔషధం రెడీ!
- ఈ ఔషధాన్ని ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 30-40 మిల్లీ లీటర్ల పరిమామంలో ఇవ్వాలని సూచిస్తున్నారు.
పుకులించుకునే ఔషధం తయారీ విధానం
- ఇప్పుడు మరో ఔషధం తయారీ కోసం స్టౌ ఆన్ చేసి ఓ గిన్నెలో గ్లాసు నీళ్లు పోసి వేడి చేసుకోవాలి.
- ఆ తర్వాత ఈ నీటిని పక్కకు పెట్టుకుని దీనిలో పటిక భస్మం వేసుకుని కలిపితే ఔషధం రెడీ!
- ఈ ఔషధాన్ని ఉదయం, సాయంత్రం ఒకసారి నోటిలో పుకిలించుకుని ఉమ్మివేయాలని సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల వెంటనే ఉపశమనం కలుగుతుందని వివరిస్తున్నారు.
తిప్పతీగ: ఇది చక్కటి యాంటీ బయాటిక్‌గా ఉపయోగపడుతుందని ఆయుర్వేద నిపుణులు డాక్టర్ గాయత్రీ దేవీ చెబుతున్నారు.